WFTW Body: 

మనము నిర్గమకాండము 17వ అధ్యాయములో త్రాగడానికి నీళ్ళులేని మరొక చోటుకు ఇశ్రాయేలీయులు వచ్చారని చదువుతాము. వారి సైన్ వేవ్(గణిత శాస్రంలో) క్రిందికు వెళ్ళి వారు మరల సణగడం మొదలెడతారు. మరలా ప్రభువు, "పరిష్కారము వారి కళ్ళముందే ఉందని వారికి చూపిస్తాడు". "నీ యెదుటనున్న ఆ బండను చూడుము. దానిని కొట్టుము" అని ఆయన మోషేతో చెప్పాడు (నిర్గ.కా. 17:6). మోషే ఆ బండను కొట్టగా నీళ్ళు ప్రవహించడం మొదలౌతాయి. నేను ఆ వాక్యభాగాన్ని మొదట చదివినప్పుడు ఒక చిన్న బండనుండి ఒక చిన్న నీళ్ల ధార వస్తే అందరూ త్రాగారనుకొనేవాణ్ణి. కాని ఆ అరణ్యములో ఎంతమంది దప్పిక కలిగియున్నారో మీకు తెలుసా? 20 నుండి 60 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న పురుషులే 6 లక్షల మంది ఉన్నారు. ఇంకా పెద్దవారు, ఇంకా చిన్న వారు స్త్రీలు, పిల్లలు ఉన్నారు. అక్కడ కనీసం 20 లక్షల మంది యుండియుందురు. 20 లక్షల మంది త్రాగడానికి ఎంత నీరు అవసరమని మీరనుకొంటున్నారు? ఒక చిన్నధార సరిపోతుందా? లేదు. ఆ 20 లక్షల మంది త్వరగా నీళ్ళు త్రాగాలంటే అనేక నదులు అనేక దిక్కులలో ప్రవహించవలసియుండెను. ఒక చిన్న ధారనుండి ఆ 20 లక్షల మంది లైనులో నిలబడి త్రాగాలంటే వారి తరుణము వచ్చేసరికే అనేక మంది దప్పికతో మరణించియుందురు. అలాకాదు. ఆ కొట్టబడిన బండ నుండి అరణ్యములోకి నదులు ప్రవహించాయి. యోహాను 7:37-39లో ఒక సిలువవేయబడిన వ్యక్తి నుండి ప్రవహించే ఆత్మతో నిండియున్న జీవమును గురించి యేసు ఈ సాదృష్యమును వాడెను.

ప్రభువైనయేసు కలువరిలో కొట్టబడినప్పుడు, అది పెంతెకొస్తునకు మార్గమును సిద్ధపరిచెను. పెంతెకొస్తుముందెప్పుడూ కలువరి సిలువ రావాలి. మనము పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందినప్పుడు వెంటనే జీవజలనదులు మననుండి ప్రవహించడం మొదలుపెట్టవు. మనం యదార్థముగా ఉంటే దాన్ని ఒప్పుకుంటాము. ఇతరులను దీవించడానికి మననుండి నదులు ప్రవహించేముందు దేవుడు మనలను విరుగగొట్టుటకు మనలో సిలువకార్యమును చేయాలి. భూమిమీదనున్న కోట్లాదిమందికి ఆశీర్వాదకరంగా చేయడానికి దేవుడు నీవంటి నావంటి సామాన్యమైన, ఎందుకూ పనికిరాని, బలహీనమైన తెలివి తక్కువ వారికొరకు చూస్తున్నాడు. కాని అదంతా మనలను దేవుడు విరుగగొట్టడానికి మనము అనుమతిస్తామా లేదా అన్నదానిపై అధారపడియుంది.

నదులు ప్రవహించడం మొదలైన వెంటనే, మనము 8వ వచనములో "తరువాత అమాలేకీయులు వచ్చెను" అని చదువుతాము. పాతనిబంధనంతటిలో అమాలేకు శరీరమునకు సాదృష్యముగా ఉన్నాడు. ఆత్మ మరియు శరీరము ఎల్లప్పుడూ పోరాటములో నున్నవి. నదులు ప్రవహించడం మొదలవగానే అమాలేకు దేవుని ప్రజలతో యుద్ధము చేయడానికి వచ్చాడు. యేసు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వెంటనే సాతాను ఆయనను శోధించుటకు వచ్చెను (లూకా 3:22, 4:1,2). మోషే యెహోషువ కలసి పనిచేయుట ద్వారా అమాలేకు చివరికి ఓడింపబడ్డాడు. మోషే కొండపైన తన చేతులెత్తి ప్రార్థింపగా యెహోషువ లోయలో అమాలేకీయులతో యుద్ధము చేసెను. ఈ విధంగా మనము కూడా శరీరాన్ని జయించవచ్చును. యేసు అరణ్యములో ఉపయోగించినట్లు దేవునివాక్యమనే ఆత్మఖడ్గమును శత్రువుపై ఉపయోగించి మరియు మన బలహీనతను నిస్సహాయతను గుర్తించి మన చేతులెత్తి దేవునికి ప్రార్థించుట ద్వారా శరీరమును జయించవచ్చును. యేసు అరణ్యములో ఉపయోగించినట్లు దేవునివాక్యమనే ఆత్మఖడ్గమును శత్రువుపై ఉపయోగించి మరియు మన బలహీనతను నిస్సహాయతను గుర్తించి మన చేతులెత్తి దేవునికి ప్రార్థించుట ద్వారా శరీరమును జయించవచ్చును.

మోషే చేతులు బరువెక్కగా అహరోను మరియు హూరులు అతని చేతులను ఆదుకొనిరి (నిర్గ.కా. 17:12). మనము బలహీనముగా నుండి అలసిపోయినప్పుడు మన సహాయము కొరకు మనకు కూడా అహరోనులు, హూరులు అవసరం. నా క్రైస్తవ జీవితంలో నేను నేర్చుకున్న గొప్ప సత్యాలలో ఇదొకటి. నేనొక్కడనే ఉండలేను. క్రీస్తు శరీరములో నా తోటి విశ్వాసులు నాకు అవసరము. అనేక సంవత్సరాల క్రితమే నేను దారితప్పిపోకుండా, నాకున్న ఒప్పుదలలతో రాజీపడకుండా నేనిక్కడ నిలబడియున్నానంటే దానికొక కారణం నన్ను ఎల్లప్పుడు ప్రోత్సహించి హెచ్చరించి నాకొరకు ప్రార్థించే సహోదరి సహోదరులే. గడచిన సంవత్సరాలలో నా చేతులను ఎత్తిపట్టుకున్న అనేకమంది అహరోనులు, హూరులు నాకున్నారు. వారికి ఎంతో విలువివ్వడం నేను నేర్చుకున్నాను. మోషేకు ఉన్నన్ని వరాలు అహరోను, హూరులకు లేవు. మోషే దేవునిని ఎరిగినట్లు వారు దేవుని ఎరిగిలేరు. అయినప్పటికీ మోషేకు వారి అవసరముండెను. అహరోను కనీసం ఒక నాయకుడు. కాని హురు ఇంకెప్పుడూ లేఖనాలలో కనిపించని ఒక అజ్ఞాతవ్యక్తి. కాని గొప్ప దైవజనుడైన మోషేకు ఈ అజ్ఞాత వ్యక్తి యొక్క సహాయం కూడా అవసరమైయుంది. క్రీస్తు శరీరములో ఉన్న బలహీనులైన అనామకులైన సహోదరులను ఎప్పుడూ తృణీకరించవద్దు. నీవు లోకంలో అతిగొప్ప దైవజనుడివైనా నీకు వాళ్ళ అవసరముంది. చివరికి యేసు కూడా గెత్సెమనేలో తన చేతులను ఎత్తిపట్టుకోమని తొట్రుపడే పేతురు, యాకోబు, యోహానులనడిగెను. "తల(క్రీస్తు) పాదములతో(శరీరములో క్రింద ఉండే అవయవములతో) మీరు నాకక్కరలేదని చెప్పజాలదు" (1 కొరంథీ 12:21).