వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

పాత నిబంధనలో ఉన్న అనేక ఆచారములు క్రొత్త నిబంధనలో నేరవేర్చబడియున్నవి. పాత నిబంధనలో సున్నతి ఒక ముఖ్యమైన ఆచారము. కాబట్టి క్రొత్త నిబంధనలో ఖచ్చితముగా దీనికి ఆత్మీయ అర్థము ఉన్నది.

ఫిలిప్పీ 3:3,4లో "శరీరమును ఆస్పదము చేసికొనక అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము, యేసునందు మహిమయు, శరీరమునందు నమ్మిక ఉంచకయుండుటయు". ఇవి ఒకదానికొకటి సంబంధము కలిగియున్నవి. క్రీస్తుయేసునందు మాత్రమే అతిశయించుటయే ఆత్మలో ఆరాధించుట మరియు మనము శరీరమును ఆస్పదము చేసుకొనకుండా జీవించెదము.

పాత నిబంధనలో కొంచెం శరీరమును కత్తిరించుట ద్వారా సున్నతి చేసెడివారు. కాని మన స్వజీవమును ఉపేక్షించుకొని మరియు చంపుటద్వారా ఆత్మీయ సున్నతిని పొందుదము. పాత నిబంధనలో సున్నతి పొందనివారు ఇశ్రాయేలీయులతో పాలిభాగస్తులు కారు (ఆదికాండము 17:14). క్రొత్త నిబంధనలో తన శరీరమును ఆస్పదము చేసుకొనువాడు ఎవడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజమైన సంఘములో పాలిభాగస్తుడై యుండడు. క్రీస్తులో మాత్రమే అతిశయించుచూ మరియు ఎవరికైతే తమ మీద తమకు నమ్మకము ఉండదో వారే నిజమైన సంఘము. ఇతరులు సంఘమును నిర్మించిన దానికంటె మనము శ్రేష్ఠముగా సంఘమును నిర్మించియున్నామని అతిశయించినయెడల దేవుని నిజమైన సంఘములో మనకు స్థానము ఉండదు.

తమ స్వహస్తములతో చేసిన దానినిబట్టి అతిశయించువారిని గురించి అపొ.కార్యములు 7:41లో చెప్పబడియున్నది. మనము సాధించిన దానిని బట్టి గర్వించినట్లయితే, మనము ఆత్మీయ సున్నతి పొందలేదు. నీ స్వంత శక్తితో నీవు సాధించితివని అనుకొనినట్లయితే, అప్పుడు నీ విశ్వాసం ఓడిపోయింది. అప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడుటయే నిజమైన విశ్వాసమని నీవు నేర్చుకొనునట్లు, "రాత్రంతయు పట్టినను ఒక్క చేప కూడా దొరకకుండా" దేవుడు ప్రేమతో చేయును (యోహాను 21:3).

ఒకరోజు నెబుకద్నెజరు తన రాజధానియగు బబులోను నగరునందు సంచరించుచుండగా, తాను కట్టించిన బబులోను రాజ్యమును బట్టి అతిశయించాడు (దానియేలు 4:29,30). ఆవిధముగా అతడు తలంచిన వెంటనే దేవుడు అతని రాజ్యమును అతని యొద్దనుండి తీసివేసి మరియు అతనిని జంతువుగా మార్చెను. మరల అతడు రాజు అగుటకు చాలా సంవత్సరములు పట్టింది. దేవుని కొరకు తాను సాధించిన దానిని బట్టి అనేకులు అతనివలె గర్వించుదురు. కాని చివరకు నెబుకద్నెజరు తన యొక్క బుద్ధిహీనతను బట్టి మారుమనస్సు పొంది మరియు దేవునిని మహిమపరిచాడు (దానియేలు 4:34-36). ఆవిధముగా అతడు హృదయములో సున్నతి పొందియున్నాడు. అనేకమంది క్రైస్తవనాయకులు ఆత్మీయ సున్నతి పొందకపోవుట చాలా బాధాకరమైనది.

మనము దేవునిని పూర్ణ హృదయముతో ప్రేమించునట్లు మనము హృదయములో సున్నతి పొందవలెనని దేవుడు కోరుచున్నాడు (ద్వితీయోపదేశకాండము 30:6). ఇదియే హృదయము యొక్క సున్నతికి గుర్తు. మనలను మనమే ప్రేమించుకొనుచు మరియు మనలను బట్టి గర్వించినట్లయితే అది సున్నతి కాదు.