WFTW Body: 

దేవుని ముఖము ఎదుట జీవించనియెడల ఒక విశ్వాసి తన ఆత్మీయ స్థితిని నిర్లక్ష్యము చేయుట సులభము. ప్రకటన గ్రంథములో ఏడుగురు సంఘపెద్దలను గద్దించుటను చూచినప్పుడు మనకు అర్ధమవుతుంది. లవొదొకియ సంఘములో ఉన్న పెద్దతో ఈ విధముగా చెప్పాడు, "నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినవాడవు, దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునైయున్నావని యెరుగవు".

మన హృదయ రహస్యములు బయలుపరచబడునట్లు దేవుడు మన జీవితములో అనేక పరిస్థితులు అనుమతించును. ఇబ్బందికరమైన ప్రజలతో మనము ఇబ్బందికరమైన పరిస్థితులగుండా వెళ్ళినందువలన మన హృదయములో కొన్ని జ్ఞాపకములను ఉంచుకొనవలెను. అవి మన యొక్క హృదయము అడుగులో ఉండును గనుక మన హృదయము పవిత్రములు అని ఊహించుకొనెదము. అప్పుడు మన హృదయములో ఉన్నవన్ని మన మనస్సులలోకి వచ్చునట్లు దేవుడు ఒక చిన్న విషయమును అనుమతించును. అటువంటి సమయములో వారిని క్షమించి మరియు ప్రేమించాలని నిర్ణయించుకొనుట ద్వారా పవిత్రపరచుకొనగలము. ఇటువంటి అవకాశము వచ్చునప్పుడు మన హృదయము కడుగుకొనిన యెడల, అది మన హృదయపు అడుగునకు వెళ్ళి అక్కడే నిలిచియుండును. అంతా బాగుందని మనము ఊహించుకొనవచ్చును. కాని నిజానికి బాగుగాలేదు. మరొక చిన్న విషయము వాటి అన్నిటిని మన మనస్సులోనికి తేగలదు కాబట్టి ఇది జరిగినప్పుడు మనలను పవిత్రపరచుకొనవలెను.

తప్పిపోయిన కుమారుని యొక్క అన్న తన తమ్ముడు విషయములో తప్పుడు వైఖరి కలిగియున్నాడని చూచెదము. అయితే అది తన తమ్ముడు వచ్చి విందు చేయుచున్నప్పుడే బయటపడింది. అప్పుడు తన తమ్ముని మీద తప్పుడు నిందలు మోపుచు అది నిజమో కాదో తెలుసుకొనకుండా మాట్లాడెను (ఉదాహరణకు "నీ ఆస్థిని వేశ్యలతో తినివేసిన" యీ నీ కుమారుడు). ఒక వ్యక్తితో మనము సరియైన సంబంధం కలిగిలేనట్లయితే, అతని గురించి చెడ్డ విషయములను నమ్మెదము.

నాకున్నదంతయు నీదే అని తండ్రి పెద్ద కుమారునితో చెప్పాడు. తనకు అనుగ్రహించిన దానితో తృప్తిపడక తన సొంత క్రియలతో నింపబడియున్నాడు. ఉదాహరణకు "యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే". అతడు తన తమ్ముని బలహీనతలతో నింపబడి, "యీ నీ కుమారుడు ఆస్థిని వృథా చేసెను" (లూకా 15:29-30). ఆ తండ్రి వలె మన దేవుడు కూడా "నా వన్నియు నీవని" మనతో చెప్పుచున్నాడు. ప్రభువైన యేసులో ఉన్నవన్నియు మనవైయున్నవి. ఆయనయొక్క జీవము, పవిత్రత, మంచితనము, సహనము, దీనత్వము మొదలగునవన్నియు మనవైయున్నవి.

దీనినుండి మనము నేర్చుకొనవలసిన పాఠమేమనగా దేవుడు నీకు అనుగ్రహించిన కృపామహదైశ్వర్యములతో నింపబడియుండుము. మరియు నీవు సాధించినవాటితోగాని లేక నీ సహవిశ్వాసుల ఓటములతోగాని నింపబడియుండవద్దు.

మన హృదయ రహస్యములు బయలుపరచబడునట్లు దేవుడు మన జీవితములలో అనేక పరిస్థితులు అనుమతించును మరియు అవి బయలుపరచబడిన ప్రతిసారి మనము పవిత్రపరచుకొనెదము.