WFTW Body: 

ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి (మత్తయి 11:28) అని ప్రభువైనయేసు ఆహ్వానించుచున్నాడు. ఎవరైతే తమ జీవితములలో అలసిపోయి, ముగింపునకు వచ్చెదరో వారు మాత్రమే ఆయన యొద్దకు రాగలరు. ప్రతియొక్కరిని తనయొద్దకు రమ్మని ప్రభువైనయేసు చెప్పుటలేదు. వారి జీవితములో పాపములో ఓడిపోయి మరియు విసిగి వేసారిన వారిని మాత్రమే ప్రభువు ఆహ్వానించుచున్నాడు. తన సమస్తమును ఖర్చుపెట్టి మరియు తనకు ఎవరు ఏమి ఇవ్వని సమయములో తప్పిపోయిన కుమారుడు తండ్రియొద్దకు వచ్చియున్నాడు (లూకా 15:16-18). ఇతరుల యొక్క ఘనతను కోరక మరియు ఇతరులను బట్టిగాని పరిస్థితులను బట్టిగాని ఫిర్యాదులు చేయుట ఆపివేసి మరియు తమ జీవితములో ఉన్న ఓటమిని బట్టి అలసిపోయినవారై ఆత్మీయముగా అభివృద్ధి చెందుదురు. ఇదియే నిజమైన మారుమనస్సు.

లేనట్లయితే అకాలముగా పుట్టిన బిడ్డలను ఇంక్యూబేటరులో పెట్టినట్లుగా ఇతరులు వారిని ఎల్లప్పుడు ప్రోత్సహించుచూ ఉండవలెను. మనయొక్క భద్రత సంఘములో కాదుగాని ప్రభువులో మాత్రమే ఉండవలెను. క్రొత్తనిబంధనలో ప్రభువైనయేసు అనుగ్రహించే సమృద్ధి జీవితము గూర్చి యెహెజ్కేలు 36:25-30లో ప్రవచించబడింది. మనము ఇటువంటి జీవితములోనికి ప్రవేశించిన తరువాత ఈ విధముగా చెప్పెదము, "అప్పుడు మీరు మీ దుష్టప్రవర్తనను మీరు చేసిన దుష్టక్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టియు హేయక్రియలను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు" (31వ వచనము). ఒక దైవజనునిలో అన్ని సమయములలో ఉండే ఒక ప్రాథమిక కోరిక ఏమనగా, "అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?" (రోమా 7:24). దుష్టత్వము నుండియు మరియు పాపముయొక్క వాసన నుండి విడుదల పొందుటకు అతడు ఎల్లప్పుడు ఆశపడును.

కష్టకాలములో నీవు ధైర్యముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు (సామెతలు 24:10). కాని ఆ సమయములో నీవు బలముగా ఉండవలెనని కోరినయెడల, నీవు సమాధానము ఉన్నప్పుడే ప్రభువుని ఎరుగుచుండవలెను.

దేవుని మార్గములు మన మార్గముల వంటివికావు. మొదటిగా ఆయన అనేక ఒత్తిడిలు మరియు ఓటముల ద్వారా విరగగొట్టును. ఆ విధముగా నీయెడల దేవునికున్న సంకల్పము ప్రకారము నీకు ఆత్మీయ గ్రహింపును ఇచ్చును.

మోషేను 40సంవత్సరములు అరణ్యములో గొఱ్ఱెలు కాయుటకు పంపించి మరియు తన మామ దగ్గర పనిచేసి, అవమానములు పొందుటద్వారా ఆ 40సంవత్సరములలో ఇశ్రాయేలు కొరకు గొప్ప నాయకుడను దేవుడు సిద్ధపరిచాడు. ఇది దేవుని యొక్క మార్గము. యాకోబును ఇశ్రాయేలుగా మార్చుటకు ముందు కూడా దేవుడు ఆవిధముగా చేసాడు. ఒక మనుష్యుని విరుగగొట్టుటయే దేవుడు చేయవలసిన కష్టమైన పని కాని ఒక వ్యక్తిని దేవుడు విరుగగొట్టినయెడల ఒక అణుబాంబులో నుండి వచ్చిన శక్తికంటే ఎంతో ఎక్కువ శక్తి అతనిలో నుండి వచ్చును.

"మేము పడద్రోయబడిన వారమైననూ మేము లేచి వెళ్ళుచున్నాము" (2కొరింథీ 4:9 లివింగ్ బైబిల్) అని పౌలు తన అనుభవమును చెప్తున్నాడు. అప్పుడప్పుడూ మనము పడిపోవునట్లు దేవుడు అనుమతించును. కాని ఇతరులవలే అక్కడే ఉండము. మనము లేచి మరియు వెళ్ళుచుండెదము మరియు దీనిని బట్టి సాతాను కలవరపడును. మనలను పడగొట్టుట ద్వారా దేవుడు మనలను పరిశుద్ధపరచి దానిని మనకు మేలుగా మార్చును. కాబట్టి ప్రభువు వచ్చు పర్యంతము ప్రభువైనయేసు జయమును మరియు సాతాను యొక్క ఓటమిని నేను వెళ్ళు ప్రతిచోట ప్రకటించెదను. హల్లెలూయా.