WFTW Body: 

రోమన్ క్యాథలిక్ సంఘములో గురువు దగ్గర పాపములు ఒప్పుకొనే ఆచారమున్నది. కొన్ని ప్రొటెస్టెంటు సంఘములు కూడా, ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొనవలెనని, ప్రతి విశ్వాసి తన గురించి 'లెక్క చెప్పు భాగస్వామి'ని కలిగి ఉండాలని మరియు వారికి క్రమముగా పాపములు ఒప్పుకోవాలని ఆ విధంగా పాపములు జయించగలమని చెప్పుచున్నవి. క్రొత్త నిబంధనలో ఇటువంటి బోధను కనుగొనము. ఈ బోధ మానవ సంబంధమైనదే గాని పరిశుద్ధాత్మ నుండి వచ్చినది కాదు. కాని అనేకమంది విశ్వాసులు గ్రుడ్డిగా ఈ తప్పుడు బోధను అంగీకరించి అనుసరించుచున్నారు.

బైబిలులో ఎక్కడ కూడా 'లెక్క చెప్పు భాగస్వామి'ని కలిగి ఉండాలని చెప్పలేదు. ఒక మనిషి ఎదుట అవమానంతో పాపమును ఒప్పుకొనవలసి ఉంది కాబట్టి కొందరు పాపం చేయకుండా పరిశుద్ధతను వెంబడిస్తారు. కాని మనుష్యుల భయంతో కాక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకొనవలెనని బైబిల్ చెప్తుంది (2కొరింథి 7:1). "మనము దేవునికి మాత్రమే లెక్క చెప్పవలసి ఉంది" (హెబ్రీ 4:13).

ప్రభువు యెదుట మాత్రమే మన పాపములు ఒప్పుకొనవలెను. "మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి" అని యాకోబు 5:16 అనే ఆజ్ఞను అనేకులు దుర్వినియోగపరచుచున్నారు. సంఘపెద్దలు ఒక రోగి అయిన విశ్వాసికొరకు ప్రార్థించే సందర్భంలో ఇది చెప్పబడింది. కొన్నిసార్లు పాపమును బట్టి రోగము వచ్చును గనుక (యోహాను 5:14లో చూచినట్లు) రోగి స్వస్థత పొందుటకు పాపములు (అతని రోగముకు కారణం కావచ్చు) ఒప్పుకొనవలెనని చెప్పబడింది. విశ్వాసులు ఇతర విశ్వాసుల ఎదుట పాపములు ఒప్పుకొనవలెనని ఇక్కడ చెప్పలేదు. సందర్భరహితంగా ఒక వచనం వాడటం ఎంతో అపాయకరము. ఒక వచనం సందర్భముతో సంబంధం లేకుండా తీసుకొనిన యెడల నకిళీ బోధ అగును. కాబట్టి మీరు వచనములు చదువునప్పుడు సందర్భమును చూడాలి మరియు ఆ వచనమును అటువంటి ఇతర సందర్భములలో ఉన్న వచనములతో పోల్చి చదువుటకు జాగ్రత్తవహించాలి.

ఒక వ్యక్తికి విరోధముగా మనం పాపము చేసినప్పుడు మాత్రమే దానిని అతని ఎదుట ఒప్పుకొనవలెను - ఉదాహరణకు, మనము అతని మోసగించినప్పుడు, గాయపరచినప్పుడు మొదలగునవి (మత్తయి 5:23,24). దీనిని ఎల్లప్పుడు గుర్తుంచుకొనుడి.

మన గత పాపముల గురించి ఇతరులకు వివరముగా చెప్పకూడదు. అలా చెప్పినచో (వాటిని చేసేలా చేసిన) సాతాను ఘనపరచబడతాడు మరియు వినేవారి మనస్సులు కలుషితమవుతాయి. ఇప్పుడు మనం క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడి నీతిమంతులుగా (ఒక్కసారి కూడా పాపం చేయని వారిగా) తీర్చబడియున్నామని ప్రకటించుట వలన దేవుని మహిమపరచెదము. మీ జీవితాంతం దీనిని గుర్తుపెట్టుకొనవలెను. అయితే మనం దేవుని కృపద్వారా రక్షణపొందిన పాపులము అని ఎల్లప్పుడు ఒప్పుకొనవలెను. అయితే మన పాపం గురించి వివరంగా దేవుని ఎదుట తప్ప మరి ఎవరి ఎదుట ఒప్పుకొనకుడదు. ఇది క్రొత్తనిబంధన పద్ధతి.

విశ్వాసులందరూ సాక్ష్యమిచ్చునప్పుడు వారిలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునిని మహిమపరచవలెను. మరియు వారు రక్షణ పొందకముందు చేసిన కార్యాలను వివరంగా చెప్పి సాతానును మహిమపరచకూడదు. మనం పాపులము, తిరుగుబాటు చేయువారము, వెనకకు జారిపోయిన వారమని మొదలగు వాటిని చెప్పినయెడల చాలు.

తాను ప్రభువుని ఎరుగనని బొంకిన విషయం కాక, తాను రూపాంతర కొండమీద పొందిన అనుభవము తాను వ్రాసిన పత్రికలో పేతురు వ్రాయుట వ్యక్తిగతంగా నాకెంతో ప్రోత్సాహమిచ్చింది (2పేతురు 1:17,18). అలాగే, పౌలు యూదులకు అగ్రిప్పకు సాక్షమిచ్చినప్పుడు (అపొ.కా. 22,26 అధ్యాయాలు) అతడు ప్రభువు దర్శనం గూర్చి ఎక్కువగా చెప్పి, క్రైస్తవులను హింసించుట గురించి చాలా తక్కువ చెప్పాడు. నిర్దిష్టమైన పాపమును ఒప్పుకొనే ఆచారము రోమన్ క్యాథలిక్ మరియు అన్యుల ఆచారము. ఈరోజులలో కొందరు ప్రొటెస్టెంటు రచయితలు కూడా దానిని ప్రోత్సహించడం దురదృష్టకరం. అవి 'స్వేచ్ఛారాధన, వినయ విషయంలో మనుష్యులయెదుట జ్ఞానరూపముగా ఎంచబడుచున్నవి గాని శరీరేచ్ఛానిగ్రహ విషయంలో ఏ మాత్రం ఎన్నిక చేయదగినవి కావు' (కొలస్సి 2:20). తమ్మును తాము అవమానపరచుకొనుట దీనత్వం కాదు మరియు జ్ఞానం కూడా కాదు. జ్ఞానం మనకు అత్యంత అవసరమై ఉన్నది.