వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము తెలిసికొనుట
WFTW Body: 

మనము ఈ సంవత్సరము చివరిలోనికి వచ్చాము గనుక మనము ఏవిధముగా జీవించామో పరిక్షీంచుకొనుట మంచిది. "నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుము" అని హగ్గయి ప్రవక్త హెచ్చరించాడు. హగ్గయి 1:5,6లో దేవుడు ఈవిధముగా హెచ్చరించాడు.

"కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను అకలి తీరకయున్నది. పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది".

ఆత్మీయ ఫలాలు ఏమైనా ఉన్నాయా? నీవు విస్తారముగా విత్తియున్నను కొంచెమే పండింది. నీవు అనేక కూటములకు వెళ్ళినను, అనేక క్రైస్తవ పుస్తకములు చదివినను మరియు అనేక క్రైస్తవ ప్రసంగములు వినినను, మీ గృహము ఆత్మీయముగా ఉన్నదా? ఈరోజు మీ ఇంటిలో సమాధానము ఉన్నదా? నీ భార్యపై లేక భర్తపై అరిచే విషయములో విడుదల పొందియున్నావా? లేనట్లయితే నీవు విస్తారముగా విత్తనను కొంచెమే పండెను. నీవు బట్టలు ధరించినప్పటికిని నీవు వెచ్చగా లేవు, నీవు చాలా డబ్బు సంపాదించినప్పటికినీ నీ జేబులో రంద్రము ఉండుటవలన చాలా డబ్బు వృధా అయిపోయెను.

మనము మాటిమాటికి అనేకసార్లు పూర్తిగా ఓడిపోయినప్పటికిని, దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు గనుక ఇప్పటికిని తన యొక్క సంపూర్ణ చిత్తములోనికి ఆయన మనలను నడిపించగలడు. కేవలం మన అవిశ్వాసమే దానికి ఆటంకముగానుండును. "నేను అనేకసార్లు నా జీవితమును పాడుచేసుకొనియున్నాను. తనయొక్క పరిపూర్ణమైన చిత్తములోనికి నన్ను నడిపించుట దేవునికి అసాధ్యమని" నీవు చెప్పినట్లయితే, దేవుడు సమస్తమును నీకొరకు చెయ్యగలడని నీవు విశ్వసించలేనందున, దేవుడు నీ కొరకు చేయలేడు. కేవలం మనము విశ్వసించినట్లయితే దేవుడు మనకొరకు సమస్తమును చేయగలడనియు, ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదనియు ప్రభువైనయేసు చెప్పారు.

సమస్త విషయములలో దేవుని నియమమేమనగా, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును (మత్తయి 9:29). మనము దేనినైతే విశ్వసించెదమో దానినే పొందెదము. ఏదైనా ఒక విషయమును దేవుడు మన జీవితములో చేయలేడని నమ్మినట్లయితే, అప్పుడు అది మన జీవితములో నెరవేరదు. మరొక ప్రక్కన నీకంటె మరి ఎక్కువగా తన జీవితమును అనేకసార్లు పాడు చేసుకొనిన వేరొక వ్యక్తి - దేవుడు తన జీవితములో ఆయన సంపూర్ణచిత్తమును నెరవేర్చగలడని విశ్వసించినందువలన తన యొక్క ఓటములనే దేవుడు చాలా మంచివిగా మార్చియున్నాడని క్రీస్తుయొక్క న్యాయపీఠము ఎదుట ఒకరోజు నీవు కనుగొందువు. ఆ రోజున నీవు నీ అవిశ్వాసమే గాని నీవు ఎన్నిసార్లు ఓడిపోయినను, నీ ఓటములు దానికి కారణము కాదని తెలుసుకొని నీవు చింతించెదవు.

"అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను"(1 యోహాను 3:8). మన జీవితములో అపవాది కలుగజేసిన బంధకములన్నిటిని విరగగొట్టి, తీసివేయుటకే ప్రభువైనయేసు వచ్చెనని ఈ వచనము చెప్పుచున్నది. దీనిని ఈ విధముగా ఊహించుకొనుము: మనము పుట్టినప్పుడు, దేవుడు మనకు పరిపూర్ణమైన త్రాడును ఇచ్చెను. మనము ఒక్కొక్కరోజు జీవించుచుండగా పాపము చేయుటను బట్టి మనము ఆ తాడును ముడులు చుట్టినట్టుండును. అనేక సంవత్సరముల తరువాత అనేక ముడులు ఆ త్రాడుకు చుట్టుకొనియుండును. కాని ప్రభువైనయేసు ఆ ముడులన్నిటిని విప్పుటకు వచ్చెను. కాబట్టి నీ జీవితములో అధికమైన ముడులు (చిక్కులు) ఉన్నప్పటికిని నీకు నిరీక్షణ ఉన్నది.

ప్రభువు నీ జీవితములో ప్రతియొక్క ముడిని(చిక్కును) తీసివేసి మరియు మరొకసారి నీకు పరిపూర్ణమైన త్రాడును ఇవ్వగలడు. ఇదియే సువార్త యొక్క సందేశము. నీవు మరలా ఆరాధించవచ్చును. కానీ నీవు, "ఇది అసాధ్యము" అని చెప్పుదువు. అప్పుడు నీ విశ్వాసమును బట్టియే నీకు జరుగును. నీ విషయములో అది జరుగుట అసాధ్యము. నీకంటే మరి ఎక్కువగా చెడిపోయిన మరియొక వ్యక్తి, "అవును, దేవుడు నాజీవితములో దీనిని చేయగలడు" అని చెప్పాడు. అతని విశ్వాసమును బట్టి అతని జీవితములో దేవుని యొక్క సంపూర్ణ సంకల్పము నెరవేరుతుంది.

నీ ఓటములన్నింటి గూర్చి నీవు దైవచిత్తానుసారమైన దుఃఖమును కలిగియున్నయెడల నీ పాపము రక్తము వలె ఎఱ్ఱనిదైనను కెంపువలె ఎఱ్ఱనిదైనను పాతనిబంధనలోని వాగ్ధానము ప్రకారము నీ పాపములు హిమమువలెను మరియు గొఱ్ఱె బొచ్చువలె తెల్లనివగును (యెషయా 1:18). మరియు "నీ పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొనని" క్రొత్తనిబంధనలో దేవుడు వాగ్ధానము చేసియున్నాడు (హెబ్రీ 8:12). నీవు ఎటువంటి ఘోరపాపము చేసినప్పటికినీ లేక ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికిని, దేవునితో నీవు క్రొత్తగా ఆరంభించవచ్చును మరియు నీవు గతములో వెయ్యిసార్లు తీర్మానము చేసుకొని ఓడిపోయినప్పటికినీ, ఈరోజు వెయ్యినొకటోసారి నీవు ఆరంభించవచ్చును. అప్పుడు నీ జీవితమును దేవుడు మహిమకరముగా మార్చగలడు. మనము తుది శ్వాస విడిచే వరకు మనకు నిరీక్షణ ఉన్నది. కాబట్టి నీవు దేవునిని అనుమానించక నిరంతరము ఆయనను విశ్వసించుము. అనేకమంది దేవుని పిల్లలలో ఆయన గొప్పకార్యములు చేయకపోవుటకు కారణము వారి ఓటములు కాదుకాని ఇప్పుడు ఆయనను విశ్వసించకపోవుటయే కాబట్టి అవిశ్వాసము వలన దేవుని వాగ్ధానము సందేహింపక విశ్వసించి దేవుని మహిమపరచెదము (రోమా 4:20). ఇప్పటి వరకు మనము అసాధ్యము అనుకున్న వాటిని కూడా ఆయన చేయగలడని రాబోవు దినములలో విశ్వసించెదము. ప్రజలందరును - చిన్నవారుగాని, పెద్దవారుగాని దీనులై దేవుని యందు విశ్వాసముంచి, గతములో వారు ఎంతగా ఓడిపోయినప్పటికిని, వారి ఓటములను ఒప్పుకొనువారికి దేవునిలో నిరీక్షణ గలదు.