WFTW Body: 

1కొరింథీ 11లో మనము రొట్టె విరుచునప్పుడు ప్రభువుయొక్క మరణమును మనము గుర్తు చేసుకొనవలెనని పౌలు చెప్పాడు. ప్రభువైనయేసు భూమి మీదకు వచ్చి మరియు తన జీవితము ద్వారా మనకు చూపించి బోధించినది ఏమనగా, "దేవుని జీవమును పొందుటకు మరణమే మార్గము" (2కొరింథీ 4:10 చూడండి). కాబట్టి ప్రభువు యొక్క మరణములోని ప్రతి విషయమును ధ్యానించి మరియు స్పష్టముగా అర్థము చేసుకొని ఆయన మరణములో పాలివారగుట (విరవబడిన రొట్టెను తినుట) మరియు క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట అనగా ఏమిటో తెలుసుకోవాలి.

ఆయన చేయని దానికొరకు క్రీస్తు సిలువమీద అవమానము పొందియున్నాడు. అనగా ఆయన చేయని దానికి శిక్ష అనుభవించి యున్నాడు (నేను ఎప్పుడూ చేయనిదానికి నేను శిక్షించబడ్డాను మరియు నేను ఎప్పుడూ దొంగిలించని దాన్ని ఇవ్వవలసివచ్చెను -కీర్తన 69:4 ఆంగ్ల లివింగ్ బైబిల్). ఇది ఆదాము చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకముగా ఉన్నది. అతడు తాను చేసిన దానికి నిందను భరించక మరియు భార్యను నిందించాడు (ఆది.కా. 3:12). ఈ విధముగా ఆదాము యొక్క పిల్లలు మరియు దేవునియొక్క పిల్లలు వ్యతిరేక మార్గములలో నడిచెదరు.

ఆదాముయొక్క పిల్లలు తమ తండ్రివలె సమర్థించుకొనెదరు. ప్రభువైనయేసు పరిసయ్యులతో 'మీరు మనుష్యుల యెదుట నీతిమంతులని అనిపించుకొనువారు' అనెను (లూకా 16:15). ఆదాము తన యొక్క అవసరమును గాని లేక తనయొక్క పాపమును గాని చూడలేకపోయెను. అతడు ఇతరుల పాపములనే చూడగలిగెను. ఎవరైననూ ఇతరులను నిందించుచూ మరియు తమలోని తప్పులను చూడలేనియెడల, వారు నిజానికి నేరారోపణ చేసే సాతానుతో సహవాసము కలిగియున్నారు.

"ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసుకొనుము" అను మాటను బట్టి మాత్రమే దొంగ రక్షణ పొందలేదు. ఆ మాటలను చెప్పుటకు ముందుగా తన పాపములయొక్క నింద తానే తీసుకున్నాడు.

ఇతరులను తీర్పుతీర్చుటకు దేవునికి మనయొక్క అవసరము లేదు. దాని అంతటిని ఆయనే స్వయముగా చేయగలడు. మనలను మనమే తీర్పుతీర్చుకొనవలెనని ఆయన కోరుచున్నాడు. ఒక్క దానిని చేయుటకు మాత్రమే దేవుడు మనలను పిలచుచున్నాడు - "నీ అతిక్రమములు ఒప్పుకొనుము" (యిర్మీయా 3:13). ఈ లోకములో అటువంటి విశ్వాసులు అత్యంత సంతోషము గలవారై యుండెదరు.

ఉత్తర రాజ్యములోని ఇశ్రాయేలీయుల ఓటముల ద్వారా యూదా దేశము పాఠములు ఏమియు నేర్చుకొనలేదని యిర్మీయా ద్వారా దేవుడు చెప్పాడు (యిర్మీయా 3:6-8). మరియు యూదా కంటే ఇశ్రాయేలు శ్రేష్టమని ఆయన చెప్పాడు. మృతమైన డినామినేషన్ నుండి బయటకు వచ్చిన అనేక క్రైస్తవ గుంపులు ఆ మృతమైన డినామినేషన్ నుండి పాఠము నేర్చుకొనరు. అందువలన వారు మరిఎక్కువ పరిసయ్యులుగా మారి, ఆ డినామినేషన్ కంటే ఎక్కువగా మరణించెదరు.

ఎల్లప్పుడు ప్రభువైనయేసును మాత్రమే చూచుచూ ఆయన సన్నిధిలో జీవించండి. అప్పుడు మిమ్మును మీరే తీర్పుతీర్చుకొనెదరు. ఆ విధముగా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందెదము. అక్కడ మీరు వెళ్ళుచున్న ఏ సంఘములో అయిననూ ఈ వర్తమానము చెప్పరు. కాబట్టి మీకు మీరే బోధించుకొనవలెను. ఎక్కువ ఆలోచించకండి, ఎందుకనగా అది నేరారోపణలోనికి నిరాశలోనికి నడిపించును. కాని ఎల్లప్పుడు యేసును మాత్రమే చూడండి మరియు మీరు ఆయనను చూచుచుండగా యెషయా, యోబు మరియు యోహానుల వలె మీ భ్రష్టత్వమును చూచెదరు. అప్పుడు మిమ్మును మీరు తీర్పుతీర్చుకొనవచ్చును.

నేను ఎప్పుడైననూ నాలోపలికి చూడను. నేను ఎల్లప్పుడు యేసుప్రభుయొక్క పవిత్రతను(మనిషిగా నావలె శోధించబడెను) ఆయన ప్రేమను ఆయన దీనత్వమును చూచెదను. అది ఎల్లప్పుడూ నాయొక్క అవసరమును చూపించును.