WFTW Body: 

ప్రకటన 18:4లో చెప్పినరీతిగా, ఈనాడు అనేకమంది దేవుని బిడ్దలు బబులోనులో ఉన్నారు. "నా ప్రజలారా, దానియొద్దనుండి బయటకు రండి" అని ఈ వచనములో దేవుడు పిలుచుచున్నాడు. ప్రజలను తప్పిపోవునట్లుగా చేసే నాయకులు మరియు పాస్టర్లదే సమస్య. ప్రభువైన యేసు కాలంలో ఉన్నట్లే, ఈనాడు కాపరిలేని గొఱ్ఱెల వలే ప్రజలున్నారు (మత్తయి 9:36). యెరూషలేములోని దేవాలయములో ప్రతి సంవత్సరమునకు మూడుసార్లు మరియు నజరేతులోని సమాజమందిరములో ఆయనకు 12 సంవత్సరముల నుండి ముప్పైసంవత్సరముల వరకు దేవునినామము ఏవిధముగా అవమానించబడుటను ప్రభువు చూచియున్నాడో ఆలోచించుము. దేవుని సమయము ఇంకను రాలేదు గనుక ఆయన దానిని గురించి ఏమియు చేయలేదు మరియు ఏమియు చెప్పలేదు, కాని తాను చేయబోయే పరిచర్యకొరకు నజరేతులో ఈయొక్క అనుభవములద్వారా ఆయన వెళ్ళుట ముఖ్యమైయున్నది. కాబట్టి ఇప్పుడు మన విషయములో కూడా అలాగే జరుగును.

"దానిలోనుండి మనము ఏమి పొందెదము?" మత్తయి 19:27 (లివింగు బైబిలు)లో పేతురు ప్రభువైన యేసుతో చెప్పినమాటలే బబులోను ఆత్మ యొక్క మూలమైయున్నది. మనము కూడా అనేక విషయములు దేవునికి సమర్పించుకొనిన తరువాత, ఈ లోకములోను తరువాత పరలోకములోను ఏవిధముగా దేవుడు బహుమానమిచ్చును. అనగా దైవభక్తి, మన స్వలాభము కొరకు ఉన్నదనుకొని మరియు స్వార్థపరులమై యున్నామని అది ఋజువు చేయుచున్న కొందరు తమ బోధద్వారాను మరియు ప్రభువు కొరకు చేసే పరిచర్యద్వారాను డబ్బును లేక ఘనతను కోరుచున్నారు. మరికొందరు పరలోకములో బహుమానముగాని లేక క్రీస్తుయొక్క పెండ్లికుమార్తెగా ఉండవలెనని కోరుచున్నారు. మన స్వంతముకొరకు మనము కోరుచున్నంత కాలము, మనలో బబులోను ఆత్మ ఉన్నట్లే. ఈ కల్మషమునుండి మన ఆత్మను పవిత్రపరచుకొనవలెను.

ప్రభువును సేవించుటవలన మేము ఏమి పొందుదుమని పేతురు యేసును అడిగినప్పుడు మత్తయి 20:1-16లో ప్రభువు ఒక ఉపమానము చెప్పారు. ఇందులో రెండు రకముల పనివారిని గురించి చెప్పారు. 1. జీతము కొరకు పనిచేయువారు కొందరు ఒక దేనారము కొరకు (2వ వచనము) మరియు కొందరు న్యాయమైన దానిని పొందుటకొరకు (4వ వచనము). 2. జీతమును గురించిన వాగ్దానము లేకుండా వచ్చినవారు (7వ వచనము). మొదటి రకపు పనివారు గంటకు దేనారము చొప్పున ఎక్కువ జీతము పొందిరి. మిగిలిన వారందరు తక్కువ జీతము పొందిరి. మొదటివారు 12 గంటలు పనిచేసినందుకు ఒక దేనారము గనుక వారు గంటకు 0.08 దేనారము పొందిరి. ప్రభువు మానవుని యొక్క పరిచర్యలో నాణ్యతను మరియు ఉద్దేశ్యమును పరీక్షించును గనుక నిత్యత్వములో అనేకులు మొదటివారు కడపటివారు అగుదురని ప్రభువైనయేసు చెప్పారు (1 కొరింథీ 3:13 మరియు 4:5). మరియు ఆయన పరిచర్యయొక్క పరిమాణమును చూడడు.

యెరూషలేములోని సంతలో డబ్బు సంపాదించుకొను వారిని ప్రభువైన యేసు వెళ్ళగొట్టలేదు. ఎందుకనగా డబ్బు సంపాదించుకొనుటకు అది సరియైనస్థలము. క్రైస్తవులు కష్టపడి ఎంతైనను సంపాదించుకోవచ్చునని జాన్ వెస్లీ చెప్పారు. నేను దానిని అంగీకరించుచున్నాను. దేవుని మందిరములో తమ స్వలాభము పొందుట కొరకు ప్రయత్నించు వారిని ప్రభువైన యేసు వెళ్ళగొట్టారు. ఈనాడు సంఘములో కూడా ఎవరైతే ఘనతను లేక డబ్బును లేక ఇతర స్వలాభములను కోరువారినుండి ప్రభువైనయేసు సంఘమును పవిత్రపరచుచున్నారు. సంఘము త్యాగములు చేసే స్థలము. ప్రభువైన యేసు మరలా వచ్చినప్పుడు "దేవుని మందిరములో వర్తకులు ఉండరని" జెకర్యా గ్రంథము చివరిలో చెప్పబడింది. (జెకర్యా 14:21 లివింగు బైబిలు). ప్రభువు కొరకు మనము చేసే పరిచర్యలో మన స్వంతము కొరకు దేనిని కోరకూడదు.

ప్రభువును నమ్మకముగా సేవించిన వారికి బహుమానములు ఉన్నవని క్రొత్త నిబంధనలో మత్తయి నుండి ప్రకటన గ్రంథము వరకు ప్రభువైన యేసు చెప్పినప్పటికిని, మనము బహుమానముకొరకు పరిచర్య చేయకూడదు. కలువరిలో ప్రభువైన యేసు మనకొరకు చేసి ముగించిన దానినంతటిని బట్టి కృతజ్ఞతతో పరిచర్య చేసెదము. కేవలము బహుమానము పొందుట కొరకే పరిచర్య చేసేవారు దానిని పొందరు.