వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము శిష్యులు
WFTW Body: 

మలాకీ 2:15లో దేవుడు భార్యభర్తలను ఒకటిగా చేసినది వారి ద్వారా ఆయన దైవికమైన పిల్లలను పొందడానికని చెప్పబడినది. ఎవరైనా పిల్లలను పెంచవచ్చును కాని యేసుప్రభువు యొక్క శిష్యులు మాత్రమే భక్తి గల బిడ్డలను పెంచగలరు. దీనికిగాను మొదటిగా కావలసిన ముఖ్యమైన విషయము తల్లితండ్రులలో ఒకరైనా వారి హృదయమంతటితో ప్రభువును ప్రేమించు నిజమైన యేసు శిష్యుడై యుండవలెను. సగము హృదయముతో క్రైస్తవులుగానుండువారు భక్తిగల బిడ్డలను పెంచలేరు. రెండవ ముఖ్యమైన విషయము భార్యాభర్తల మధ్య ఐకమత్యము. ఇద్దరిలో ఒకరు శిష్యుడు కానట్లయితే ఇది సాధ్యము కాకపోవచ్చును. అప్పుడు వేరొక భాగస్వామి తన బిడ్డల కొరకు ఒక్కరే సాతానుతో పోరాడవలసి వచ్చును. కాని ఇద్దరూ నిజమైన శిష్యులైతే ఆ పని సుళువవుతుంది. అందుచేతనే వివాహా భాగస్వామిని ఎంచుకొనుట ఎంతో ముఖ్యమైనది. భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ తగువులాడుకుంటూ ఒకరిపై ఒకరు నింద వేసుకొనుచున్నట్లయితే బిడ్డలను దైవికముగా పెంచుట చాలా కష్టము. నీవు దైవికమైన గృహమును కట్టదలచినట్లయితే బిడ్డలను దైవికముగా పెంచుట చాలా కష్టము. నీవు దైవికమైన గృహమును కట్టదలచినట్లయితే నీ భార్య(భర్త)తో అది నీకు ఎంత నష్టమైనా, కష్టమైనా చివరకు దానిని బట్టి నీకున్న ఎన్నో హక్కులను కోల్పోవలసి వచ్చినా ఐకమత్యమును వెదకు. నీ బిడ్డలు ప్రభువును వెంబడించుట నీవు చూచినప్పుడు, దాని కొరకు ఎంతో కాలము గడచినా నీ నిర్ణయమునకు తగిన విలువయున్నదని నీవు తెలుసుకొందువు. ఇద్దరు శిష్యుల మధ్యయుండిన ఐకమత్యమునకు గొప్ప శక్తి యున్నది. ఇద్దరు శిష్యులు భూమిపై ఏకీభవించినప్పుడు, వారికి ఆకాశమండలమందున్న (ఎఫెసీ 6:12) దురాత్మల కార్యకలాపములను బంధించగలిగే అధికారముండునని యేసుప్రభువు చెప్పెను(మత్తయి 18:18-20). ఆ విధముగా మన యిండ్లను మరియు మన పిల్లలను పాడు చేయకుండా దురాత్మలను దూరముగా పారద్రోలవచ్చును. ఎఫెసీ 5:22 - 6:9లో పరిశుద్ధాత్ముడు ఇంటిలోనుండిన, భార్యభర్తల మధ్య పిల్లలు తల్లితండ్రుల మధ్య సేవకులు యజమానుల మధ్య నుండిన సంబంధము గూర్చి మాట్లాడెను. వెంటనే దాని తరువాత 10వ వచనము నుండి పరిశుద్ధాత్ముడు ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుట గూర్చి చెప్పెను. అది మనకు ఏమి బోధిస్తుంది? అది సాతాను యొక్క దాడి ముఖ్యముగా ఇంటిలో నుండిన సంబంధాలపైనే అనునదియే. ఇక్కడనే మనము అన్నింటికంటె ముందు సాతానును జయించవలెను.

భార్యభర్తలు ఎవరైతే పోట్లాడుకుంటూ ఉందురో వారు సాతానువచ్చి వారి బిడ్డలపై దాడిచేయునట్లు తలుపులు తెరచుచున్నారని(వారి మధ్య దూరము ఏర్పడుట ద్వారా) గ్రహించరు. తల్లితండ్రులకు దురుసుగా సమాధానమిచ్చు ఒక బిడ్డ ఆ అలవాటును అటువంటి పరిస్థితులలో అతడి తల్లి ఆమె భర్తతో మాట్లాడిన దానిని బట్టియో లేక తండ్రి ఏదొక విషయములో దేవునిని ఎదురించిన దాని నుండియో నేర్చుకొనును. మొదటిగా ఇంటిలోనికి అటువంటి అంటురోగమును తల్లితండ్రులు తెచ్చియుండగా ఆ పిల్లవాడిని నిందించి ప్రయోజనము లేదు!! ఆ విషయములో తల్లితండ్రులు మొదట పశ్చాత్తాప పడవలెను. నీ యిల్లు ఎంత ఉన్నది లేక దాని అందము లేక నీ యింటిలో నుండిన వస్తువుల కంటె నీ ఇంటిలో నుండిన ఐక్యత ఎంతో ప్రాముఖ్యమైనది. మొదటిగా ఒక కుటుంబములోని వారు యేసుప్రభువుయొక్క శిష్యులైనట్లయితే ఆ కుటుంబము ఒక గుడిసెలో నివసించినా దేవుని యొక్క మహిమ అక్కడ ప్రత్యక్షపరచబడును. నిజమైన యేసుయొక్క శిష్యులు ఏదేను వనములో ఆదాము హవ్వలు ఏ అంటురోగము కలిగియుండిరో ఆ నిందమోపుకొనుట అనే భయంకర రోగమునుండి విడుదల పొందుదురు. ఆదాము అతడి పాపము కొరకు హవ్వను, హవ్వ ఆమె పాపము కొరకు సర్పమును నిందించెను. ఆత్మ విషయమై దీనులైన వారిదే దేవుని రాజ్యము (మత్తయి 5:3). ఆత్మలో దీనులైన వారియొక్క మొదటి లక్షణమేమనగా అటువంటి వారికి వారియొక్క లోపము మరియు అవసరము మొదట కనపడును. ఆత్మలో దీనులైన భార్యభర్తలు వారి ఇంటిని ఈ భూమిపై చిన్నపాటి పరలోకముగా మార్చుకొందురు. అటువంటి ఇంటిలో భార్యాభర్తలిద్దరు నిందించుకోకుండా ఎవరికి వారు తీర్పుతీర్చుకొనుచుందురు. అపవాదికి అటువంటి ఇంటిలోనికి ప్రవేశించు అవకాశమే ఉండదు. అటువంటి ఇంటిలో ఉండిన బిడ్డలు ఎటువంటి దీవెనలను స్వాస్థ్యముగా పొందుదురో ఊహించగలరా?

పనిచేసే తల్లులను గూర్చి ఒక మాట చెప్పనివ్వండి. మన రోజుల్లో జీవనపు ఖర్చు ఎక్కువైనందువలన కొన్ని పట్టణాలలో దురదృష్టవశాత్తు ఇది తప్పనిసరి అయినది. కాని అటువంటి తల్లుల మనసుల్లో కొన్ని సూత్రములు ఉంచుకొనవలెను. స్త్రీ యొడల దేవుని చిత్తము "ఇంటిలో నుండి పని చేయువారుగా నుండుట" యని తీతుకు 2:4 చెప్తుంది. కనుక ఏ తల్లి కూడా ఇంటి బయట పని కొరకు ఇంటిలో బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభువు, తన భర్త, తన పిల్లలు - ఈ క్రమంలో ఎప్పుడును ఆమె యొక్క అభిమానము, శ్రద్ధ చూపవలెను. ఆమె ఉద్యోగము పై మూడు విషయముల తరువాత నాల్గవదిగా నుండవలెను. వివాహమై పిల్లలు లేని స్త్రీలు ఎటువంటి సమస్య లేకుండా ఉద్యోగము చేసుకోవచ్చును. సాధారణముగా చిన్న బిడ్డలుగల తల్లులు రెండు కారణాలవలన పనిచేయుటకు వెళ్ళుదురు. 1) భర్తయొక్క జీతము ఇంటి అవసరములకు సరిపోనప్పుడు జీవన అవసరము కొరకు. 2) విలాసము కొరకు, భార్యభర్తలు ఎక్కువ స్థితిగల జీవితము జీవించుటకు. నీవు దేవుని యెదుట యధార్థముగా నీ కారణము, జీవన అవసరము గూర్చి అని చెప్పగలగినట్లయితే, అప్పుడు దేవుడు నీ కుటుంబ బాధ్యతలకన్నిటికిని కావాల్సిన కృపను ఇచ్చును. కాని నీ నిజమైన కారణము గొప్ప(విలాసాల) కోసమైనట్లయితే, నీవు నిజమైన ప్రమాదములో నుంటివని హెచ్చరిస్తున్నాను. ఎన్నో సంవత్సరాల తరువాత నీ బిడ్డలు నిన్ను విడిచి వెళ్ళి బాధ్యత లేకుండా మొండిగా తయారై దేవునికి ఉపయోగము లేకుండా అయినప్పుడు నీవు ఇప్పటి పరిస్థితి పర్యవసానాన్ని పొందుదువు. అప్పుడు ఏమి చేయుటకైనా సమయము మించిపోయి యుండును. నేనేమి ఆచరిస్తున్నానో అదే భోధిస్తున్నాను. దానికి నాకు దేవుడే సాక్షి. 1969లో మా మొదటి కుమారుడు జన్మించినప్పుడు నా భార్య డాక్టరుగా పనిచేసేది. ఆ సమయములో మా సంపాదన నాకు ప్రతి నెలా వచ్చే కొద్ది మొత్తము మాత్రమే. మాకు దాచుకున్న సొమ్ము ఏమీ లేదు. కాని అప్పుడు నా భార్య ఇంటి దగ్గర ఉండి కుటుంబమును చూచుకొనవలెనని మేము నిర్ణయించుకొన్నాము. అటు తరువాత 28 సంవత్సరములు ఆమె ఎప్పుడూ ఉద్యోగము చెయ్యకుండా ఇంటిలోనే ఉండి మా నలుగురు అబ్బాయిలు ప్రభువును ప్రేమించి ఆయనను వెంబడించునట్లు పెంచినది. దాని ఫలితమేమిటి? మా నలుగురు కుమారులు తిరిగి జన్మించి బాప్తిస్మము తీసుకొని, ప్రభువును వెంబడిస్తూ ఆయన కొరకు సాక్ష్యమిచ్చుట చూచుట మాకెంతో సంతోషముగానున్నది. అటువంటి ఆశీర్వాదము నా భార్య డాక్టరుగా ఉద్యోగము చేసి 28 సంవత్సరాలలో సంపాదించవలసిన 30 లేక 40 లక్షల రూపాయల కంటె ఎంతో గొప్పది. ఈ రోజున దాని గూర్చి ఎటువంటి విచారము లేదు. ఈ విషయములో దేవుని చిత్తమును వెదకే ఇతర తల్లులకు ప్రోత్సాహముగా నుండునట్లు మా సాక్ష్యమును ఇక్కడ చెప్పాము.

నిజమైన శిష్యుడు తన ఇంటిలోనికి తెచ్చు పత్రికలు, పుస్తకములు, చూచే టెలివిజన్ కార్యక్రమములు మరియు వీడియో ప్రోగ్రాముల విషయమై జాగ్రత్త కలిగియుండును. ఇంటికి యజమానిగా భర్త తన ఇంటిలోనికి లోకపుతత్వము ఏమీ ప్రవేశింపకుండా ఖచ్చితమైన ద్వార పాలకునివలె జాగ్రత్త కలిగియుండవలెను. అతను ఒక పరిశ్రమలో నాణ్యతను పరీక్షించే విభాగముయొక్క అధిపతి, ప్రతి వస్తువుని పరీక్షించి దృవీకరించునట్లుగా ఉండవలెను. తమ బిడ్డలు శిష్యులు కావాలని కోరుకొనే తల్లితండ్రులు వారు అడిగిన ప్రతీది వారికి ఇవ్వకూడదు. అటువంటి విషయములో అది ప్రేమ కాదు కాని తెలివి తక్కువతనము మరియు దేవుని యెడల అపనమ్ముకత్వము అయి ఉన్నది. ఏ సంఘము యొక్క బలమైనా అందులో నుండిన కుటుంబముల యొక్క బలముపై ఆధారపడి యుండును. గృహములు బలహీనమైనట్లయితే సంఘము బలహీనమగును. సంఘము యొక్క బలము, గట్టిగా చేయు శబ్దముపైన లేక వినసొంపైన పాటలు లేక చివరకు మంచి ప్రసంగములపై ఆధారపడియుండదు కాని సంఘములో గల కుటుంబముల యొక్క భక్తిపై ఆధారపడియుండును. మన దేశములో మన ప్రభువుకు మహిమ తెచ్చు గృహములను కట్టుకొందుము గాక.