WFTW Body: 

యేసును సిలువ వద్దకు వెళ్ళవద్దని మంచి మనస్సుతో పేతురు చెప్పాడు. కాని అది సాతాను సలహా అని ప్రభువు వెంటనే గుర్తించి, "సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని" పేతురుతో చెప్పెను (మత్తయి 16:23).

దేవుని సంగతుల మీద మన మనస్సుని పెట్టినప్పుడు మాత్రమే దేవుని స్వరమేదో మరియు సాతాను స్వరమేదో గుర్తించగలము. ప్రాముఖ్యంగా మన మనస్సులు సొంత విషయముల మీదనే ఉండినట్లయితే సాతాను స్వరమును దేవుని స్వరము అని పొరపాటు పడగలము. కాబట్టి మనము చేయువాటన్నింటిని అనగా చదువుట, పనిచేయుట మరియు ఆడుట మొదలగునవి పరలోక దృష్టితో చేయవలెను. సమస్తము దేవుని మహిమ కొరకే చేయవలెను.

ఎరిక్ లిడిల్ ఒలంపిక్ బంగారు పతకం పోయినప్పటికి అతడు ఒప్పుకొనిన దాని విషయంలో రాజీపడలేదు - ఆవిధముగా కాలేజీలో బాగా చదవండి, గ్రౌండులో బాగా ఆడండి, ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరచండి. మీరు కొన్ని క్రైస్తవ ప్రమాణాలు కలిగియున్నారని ఇతరులు తెలుసుకొనినప్పుడు మీరు సిగ్గుపడవద్దు. ప్రభువు మీకు సహాయం చేయునుగాక.

స్కుల్‍లోగాని, కాలేజీలోగాని, పనిచేసే చోటగాని, ఇంట్లోగాని మీరు ఎదుర్కొనే పోరాటములలో దేవుణ్ణి ఘనపరచవలెనని బలమైన కోరికను సాధకము చేయండి. మీరు రాజీపడునట్లు సాతాను చేసే దాడులను ఎదుర్కొనుటకు, దేవుడు మీకు కృపను మరియు బలమును అనుగ్రహించును. సాతానుకు విరోధముగా దేవుడు ఎల్లప్పుడు మీ పక్షమున ఉన్నాడు మరియు మిమ్మును కీడును జయించేవారిగా చేయును.

మనము భూమిమీద ఉన్నవాటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించుచున్నామని రుజువుపరచునట్లు, భూమిమీద అనేకమైన వాటిని ఆకర్షణీయమైనవిగా దేవుడు ఉంచియున్నాడు. ఆ విధముగా మనము సాతానుని సిగ్గుపరచెదము. సృష్టికర్త, సృష్టింపబడిన వాటి కంటే ఎంతో గొప్పవాడు, ఎంతో అద్భుతమైనవాడు, ఎంతో సంతృప్తిని ఇచ్చువాడు. ఇది సత్యము కాబట్టి దీనిని మనము విశ్వసించవలెను. మనయొక్క ఈ విశ్వాసము ద్వారానే లోకములో ఉన్న ఆకర్షణీయమైన వాటిని జయించెదము. మనము గుడ్డిగా ఈ విశ్వాసము ద్వారా జీవించుచున్న యెడల, మన అనుభూతులు సరియైన సమయములో దీనిని వెంబడించును. మనము మొదటిగా అనుభూతుల కొరకు చూడకూడదు.

సాతానుతో పోరాడుట మన ఆత్మలకు మంచిది. ఆవిధముగా మనము బలవంతులమయ్యెదము. క్రీస్తుయొక్క మంచి సైనికుడుగా ఉండుము. ప్రభువు మీ మీద ఆధారపడుచున్నాడు. ప్రభువు నామము ఎప్పటికి అవమాన పరచబడకుండా, ప్రభువు జెండా ఉన్నతంగా, విజయముతో ఎగురుటకు మేము కూడా మీమీద ఆధారపడుచున్నాము.

తమ దేశము స్వతంత్రముగా ఉండునట్లు సైనికులు వారి దేశము కొరకు ఎంతో త్యాగము చేయుచుండగా, సాతాను అవమాన పరచబడి ప్రభువు నామము మన జీవితములో ప్రతి విషయము ద్వారా మహిమపరచబడునట్లు మనము ఇంకెంతగా అన్నింటిని (మన జీవితములను కూడా) త్యాగము చేయవలెను.