అపొస్తలుల కార్యములు 1:1 మనకు ఒక ముఖ్యమైన విషయం బోధిస్తుంది. పౌలు యొక్క జతపనివాడైన లూకాచే అపొస్తలుల కార్యములు వ్రాయబడ్డాయి. అతను అపొస్తలుల కార్యములు వ్రాయడానికి ముందు లూకా సువార్తను వ్రాశాడు. అతను ఈ రెండింటినీ థెయొఫిలా అనే వ్యక్తికి వ్రాసాడు. అపొస్తలుల కార్యముల ప్రారంభంలో, అతను గతంలో వ్రాసిన సువార్తను సూచిస్తూ, "థెయొఫిలా, నేను వ్రాసిన మొదటి వృత్తాంతం, యేసు చేసిన మరియు బోధించిన వాటి గురించి..." అని చెప్పాడు. తన సువార్తకు ఒక శీర్షిక ఇవ్వమని మీరు లూకాను అడిగితే, అతను "యేసు చేయటకు మరియు బోధించుటకు ప్రారంభించినవి" అని చెప్పేవాడు. "యేసు బోధించినవన్నీ" కాదు, "ఆయన చేసినవి మరియు బోధించినవన్నీ". తాను చేయనిది బోధించకూడదనేది యేసు జీవితంలోని ఒక నియమం. ఇదే నియమం: చేయండి మరియు బోధించండి. బోధించి చేయడం కాదు, చేసి బోధించడం. యేసు తాను బోధించిన దానిని ఆచరించలేదు; తాను ఇంతకుముందే ఆచరించినవాటిని ఉపదేశించి, వాటిని ఆచరిస్తూనే ఉన్నాడు. అదే నియమం.
దాని ఆధారంగా, మీరు అపొస్తలుల కార్యములకు శీర్షిక ఇవ్వమని లూకాను అడిగితే, అతను ఏ శీర్షిక ఇస్తాడని మీరు అనుకుంటున్నారు? లూకా సువార్త "భూమిపై తన భౌతిక శరీరంలో యేసు చేయుట మరియు బోధించుట ప్రారంభించడం" అయితే, అపొస్తలుల కార్యములు "యేసు తన ఆత్మీయ శరీరమైన సంఘం ద్వారా చేయుట మరియు బోధించుట కొనసాగించినవన్నీ" అని చెప్పవచ్చు. ఆయన ముప్పై మూడు సంవత్సరాలు భూమిపై జీవించినప్పుడు ఆయన ఏమి చేయడం మరియు బోధించడం ప్రారంభించాడో, వాటినే మనం చేస్తూ బోధించుట కొనసాగించడమే మన పరిచర్య. అందుకే సంఘాన్ని యేసుక్రీస్తు శరీరం అని పిలుస్తారు. అందుకే యేసు బోధించిన వాటన్నింటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే మనం దానిని చేయాలి మరియు దానిని బోధించాలి.
అపొస్తలుల కార్యములలో దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఉంది. అపొస్తలుల కార్యములు 10:4లో, దేవుడు రోమా శతాధిపతి కొర్నేలీ వద్దకు ఈ సందేశంతో ఒక దేవదూతను పంపాడు, "దూత, నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి". అయితే దూత అతనికి సువార్త ఎందుకు ఇవ్వలేదు? "నువ్వు పాపివని, క్రీస్తు నీ పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని, ఆయనను నీ ప్రభువుగా స్వీకరించి, మారుమనస్సుపొంది నమ్మాలని నీకు తెలుసా?" అని అతను కొర్నేలీని ఎందుకు అడగలేదు. దూత దానిని చెప్పలేకపోయాడు. దేవదూత అతనికి చెప్పగలిగింది ఏమిటంటే, "నీ ప్రార్థనలు మరియు దానధర్మాలు పైకివెళ్ళాయి, ఇప్పుడు పేతురుని పిలవడానికి ఎవరైనా పంపు; అతను యొప్పే అనే మరొక దూర ప్రదేశంలో నివసిస్తున్నాడు. పేతురు ఇక్కడికి రావడానికి కొన్ని రోజులు పట్టవచ్చు, కానీ నీవు వేచి ఉండాలి". దేవదూత అప్పుడు వెళ్ళిపోయాడు. పేతురు కొర్నేలీతో ఏమి చెబుతాడో దేవదూత అతనికి ఖచ్చితంగా దానిని చెప్పగలడని మీరు ఊహించగలరు? దేవదూతకు సువార్త చాలా స్పష్టంగా తెలుసు. సర్వశక్తిమంతుడైన దేవుడు కొర్నేలీకి సువార్త ప్రకటించడానికి దేవదూతను అనుమతించకపోవడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది. కొర్నేలీ సువార్త వినడానికి పేతురు వచ్చే వరకు చాలా రోజులు వేచి ఉండవలసి వచ్చింది, ఎందుకంటే దేవదూతకు సువార్త అనుభవ పూర్వకంగా తెలియదు. అతను పేతురు వలె, "నేను పాపిని, కానీ యేసు నా కోసం చనిపోయాడు, ఆయన రక్తం నా పాపాన్ని కడిగింది, నేను క్షమించబడ్డాను" అని చెప్పలేడు.
దేవదూత దానిని చెప్పలేకపోయాడు కాబట్టి, అతను దానిని బోధించలేకపోయాడు. తన మనసులో మాత్రమే తెలిసిన సత్యాన్ని బోధించలేకపోయాడు. బహుశా అతను పేతురు కంటే మెరుగ్గా బోధించగలిగి ఉండవచ్చు; అది ప్రాముఖ్యం కాదు. అతను దానిని బోధించడానికి అనుమతించబడలేదు ఎందుకంటే అతను దానిని అనుభవించలేదు, ఇది మనకు ఒక ప్రాథమిక సూత్రాన్ని బోధిస్తుంది: మనం అనుభవించని వాటిని బోధించడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వలేదు. వారు ఆచరించని లేదా అనుభవించని వాటిని బోధించే వ్యక్తులకు కొత్త నిబంధనలో ఒక పదం ఉంది, "వేషధారి". వేషధారులైన బోధకులు చాలా మంది ఉన్నారు.
యేసు మనం చేయాలని తరువాత బోధించాలని, చేయనిది బోధించకూడదని కోరుకుంటున్నాడు. మనం బోధించడం ద్వారా ప్రారంభించము; మనం చేయడం ద్వారా ప్రారంభిస్తాము. మీరు మీ స్వంత జీవితంలో యేసు ఆజ్ఞాపించినది చేయకపోతే, మీరు బైబిలు కళాశాలకు వెళ్లి, అక్కడ మూడు సంవత్సరాలు గడిపి, డిగ్రీని పొందిన తరువాత మీరు ప్రజలకు బోధించగలరని భావించకండి. ఒక బైబిలు కాలేజీలో నాలుగు సంవత్సరాల బైబిలు కాలేజీ కోర్సు తర్వాత గ్రాడ్యుయేట్ అయిన ఒక వ్యక్తితో మాట్లాడటం నాకు గుర్తుంది. అతను తన తరగతిలో ఉన్నత విద్యార్థి. నేను మాట్లాడుతున్న స్నాతకోత్సవంలో, అతను నన్ను చూడటానికి వచ్చాడు. నేను అతనిని ఇలా అడిగాను, "ఈ నాలుగు సంవత్సరాల చదువు చివరిలో, నీ అంతర్గత జీవితంలో నీ ఆత్మీయ స్థితి ఏమిటి?". అతను, "నేను వచ్చినప్పటికంటే ఘోరంగా ఉంది, పాపంలో ఎక్కువగా ఓడిపోయాను" అన్నాడు. అతను నిజాయితీగా చెప్పాడు. నేను అతనితో, "ఇప్పుడు నువ్వు డిగ్రీతో వెళ్ళి ఎక్కడో ఒకచోట పాస్టరువు అవుతావు, ప్రజలకు ఏమి నేర్పిస్తావు? వివిధ వచనాలయొక్క హీబ్రూ మరియు గ్రీకు వివరణనా, లేదా నేత్రాశను ఎలా అధిగమించాలో? కోపాన్ని ఎలా అధిగమించాలో నేర్పించగలవా? వారు వినవలసింది అదే. ఎందుకంటే యేసు బోధించినది అదే. నీ స్వంత జీవితంలో జయించుటను నీవు అనుభవించకపోతే, కేవలం సిద్ధాంతాన్ని బోధిస్తావు" అని చెప్పాను.
ఇది అనేక మంది బోధకుల మరియు పాస్టర్ల యొక్క విచారకరమైన స్థితి, అందుకే మీరు చాలా సంవత్సరాలుగా బోధిస్తున్న ప్రముఖ బోధకుడు లేదా పాస్టర్, చాలా సంవత్సరాలుగా వ్యభిచారం చేస్తున్నానని అకస్మాత్తుగా అంగీకరించడం మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు. ఈ వ్యక్తి ఆత్మలోని అపవిత్రతను సంఘంలోని ప్రజలు ఎలా గుర్తించలేకపోయారు? ఎందుకంటే వారు అతని బోధలోని వాగ్ధాటికి, అతనికున్న జ్ఞానానికి ముగ్ధులయ్యారు. యేసు, "నేను ఆజ్ఞాపించినవన్నీ చేయమని వారికి నేర్పించండి" అని చెప్పాడు.
యేసు తన గొప్పపనిలో, "నేను మీకు ఆజ్ఞాపించినదంతా చేయమని వారికి బోధించండి" అని చెప్పినప్పుడు, ఆయన మనల్ని వేషధారణ లేకుండా ఉండమని చెప్తున్నాడు. మనం చేయని దాని గురించి ఎప్పుడూ మాట్లాడకూడదని ఆయన చెప్తున్నాడు. మనం మొదట చేసినవి మాత్రమే ఇతరులకు నేర్పించాలి.