ఆత్మ విషయమై దీనులైన వారిది పరలోక రాజ్యమని యేసు చెప్పెను (మత్తయి 5:3). ఆత్మలో దీనులైన వారు ఎప్పుడూ వారి యొక్క మానవ పరమైన లోటు ఎరిగియుండుట చేత సంపూర్తిగా దేవుని చిత్తముకు లోబడియుందురు.
ఈ విధముగా చూసినట్లయితే యేసు ఎప్పుడూ ఆత్మ విషయంలో దీనుడుగా ఉండెను. దేవుడు మానవుణ్ణి ఎలా జీవించాలని ఉద్దేశించారో ఆయన అలా జీవించారు - దేవునిపై నిరంతరం ఆధారపడుతూ, దేవునికి వేరుగా ఆయన మనసిక శక్తులను ఉపయోగించుటకు తిరస్కరిస్తూ జీవించారు. ఆయన మాటలను ఆలోచించండి:
"కుమారుడు తనంతట తాను ఏమియు చేయడు... నా అంతట నేను ఏమియు చేయలేను,నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను... నా అంతట నేనే వచ్చి యుండలేదు,ఆయన నన్ను పంపెను... నేనేమనవలెనో యేమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ ఇచ్చియున్నాడు... నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు; తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు" (యోహాను 5:19,30; 8:28,42; 12:49;14:10).
యేసు ఎప్పుడూ అవసరమును చూచుట వలన వెంటనే ఏపని చేయలేదు. ఆయన అవసరమును చూచి, దాని గూర్చి పట్టింపు కలిగి ఉండేవారు, కాని ఆయన తండ్రి చెప్పిన తరువాత మాత్రమే దాని విషయమైన పని చేసేవారు.
లోకము రక్షకుని గూర్చి ఎంతో అవసరతతో ఉండగా, ఆయన పరలోకములో కనీసము నాలుగు వేల సంవత్సరములు వేచియుండి, తండ్రి పంపినప్పుడు ఆయన భూమిపైకి వచ్చెను (యోహాను 8:42). "సరియైన సమయం వచ్చినప్పుడు, దేవుడు నిర్ణయించిన సమయములో, ఆయన తన కుమారుని పంపాడు" (గలతీ 4:4 TLB). దేవుడు ప్రతిదానికి ఒక సమయము నిర్ణయించాడు (ప్రసంగి 3:1). ఆ సమయమెప్పుడనేది దేవునికే తెలియును. మనము యేసువలె ప్రతి విషయములో దేవుని చిత్తమును వెదకినట్లయితే మనము దానిని తప్పిపోము.
యేసు భూమిపైకి వచ్చిన తరువాత, ఆయన కేవలము అటూ ఇటూ తిరుగుతూ ఆయనకు మంచి అని తోచినది చేయలేదు. ఆయన మనసు పరిపూర్ణమైన పవిత్రతతో నుండినా ఆయన మనసుకు తట్టిన క్రొత్త ఆలోచనలను బట్టి ఆయన ఏ కార్యము చేయలేదు. అలా కాకుండా ఆయన తన మనసును పరిశుద్ధాత్మకు సేవకునిగా చేసెను.
ఆయనకు పన్నెండు సంవత్సరముల వయసు వచ్చునప్పటికి లేఖనాలన్ని బాగుగా తెలిసినా, తరువాత పద్దెనిమిది సంవత్సరములు ఒక వండ్రంగిగా, కుర్చీలు, బల్లలు మొదలైనవి చేసుకుంటూ తన తల్లితో కలిసియుండెను. చుట్టూ మరణిస్తూ ఉండిన వారికి అవసరమైన సందేశము ఆయన కలిగియుండినా, ఆయన బోధించు పరిచర్యలోనికి వెళ్లలేదు. ఎందుచేత? తండ్రియొక్క సమయమింకను రాలేదు.
యేసు వేచియుండుటకు భయపడలేదు.
"ఆయన యందు విశ్వాసముంచు వాడు ఆతురత (కలవర) పడడు"(యెషయా 28:16).
తండ్రి సమయమొచ్చినప్పుడు ఆయన తన వడ్రంగి కొట్టునుండి బయటకు వెళ్లి బోధించుట ప్రారంభించెను. అటుతరువాత తరచూ ఆయన ఏదైనా విషయం గూర్చి "నా సమయమింకను రాలేదు" (యోహాను 2:4; 7:6) అని చెప్పుచుండెను. యేసు జీవితములో ప్రతి విషయం తండ్రి చిత్తము మరియు సమయము ప్రకారము జరుగుచుండెను.
కేవలము మనుష్యుల అవసరము, కార్యము చేయుటకు ఒక పిలుపుగా యేసు ఎప్పుడూ తీసుకొనలేదు, అలా చేసినట్లయితే అది తనకు తానుగా తన మనస్సు నుండి వచ్చినదిగా ఉండును. మనుష్యుల యొక్క అవసరత లెక్కలోనికి తీసుకోవాలి, కాని అక్కడ దేవుని చిత్తము జరగాలి.
మనుష్యుల మాటలు విని, చూచుటకు మంచిది అని తెలిసిన పనులు చేసినట్లయితే, తన తండ్రి తన కొరకు ఉంచిన శ్రేష్టమైన దానిని పోగొట్టుకొనునని తెలియుటచేత తన స్నేహితులు సలహా ఇచ్చిన ఎన్నో మంచి పనులను యేసు చేయలేదు.