WFTW Body: 

ఎఫెసీ 1:3లో ఇలా ఉన్నది, "మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను". ఈ ఆశీర్వాదములన్నియు ఆత్మసంబంధమైన ఆశీర్వాదముల గురించి వాగ్ధానము ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయములో దీనిని మనము చదువగలము. మోషే తెచ్చిన ధర్మశాస్త్రముకును మరియు ప్రభువైన క్రీస్తు తెచ్చిన కృపకును తేడా ఇదియే. ఇటువంటి వచనము పాతనిబంధనలో ఉండినయెడల ఇలా ఉండేది: "సర్వశక్తిగల దేవుడు(తండ్రికాదు) మోషేలో భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించెను". కాబట్టి శరీర స్వస్థత, ఈ లోక సంబంధ ఆశీర్వాదములు కోరే విశ్వాసులు పాతనిబంధనలోనికి వెళ్ళుచున్నారు. అటువంటి విశ్వాసులు ఇశ్రాయేలీయులే కాని క్రైస్తవులు కాదు. వారు మోషేను వెంబడిస్తున్నారు కాని, క్రీస్తును వెంబడించుట లేదు.

అనగా ఈనాడు దేవుడు విశ్వాసులను భూలోకసంబంధమైన విషయములలో ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. కాని మరియొక విధానములో, వారు దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని మొదటిగా వెదికేకొలది వారి యొక్క భూలోకసంబంధమైన ప్రతి అవసరము తీర్చబడుతుంది. పాతనిబంధనలోని వారు భూలోకసంబంధమైన వాటినే వెదికారు మరియు వారు సమృద్ధిగా పొందారు - అనేకమంది పిల్లలు, ఎంతో ఆస్థిపాస్థులు, ఎంతో ధనము, భూలోకసంబంధమైన శత్రువులను జయించుట, ఈలోకములో పేరుప్రతిష్టలు పొందుట మొదలగునవి. కాని క్రొత్తనిబంధనలో మనము ఆత్మసంబంధమైన ఆశీర్వాదముల కొరకు వెదుకుతాము. అనగా ఆత్మసంబంధమైన పిల్లలు, ఆత్మసంబంధమైన ఐశ్వర్యము, ఆత్మసంబంధమైన ఘనత, ఆత్మసంబంధమైన జయములు (సాతానుమీదను, శరీరేచ్ఛల మీదను జయము పొందెదము కాని మనుష్యుల మీద, ఫిలిష్తీయుల మీద కాదు). దేవుని చిత్తము నెరవేర్చుటకు అవసరమైన ఆరోగ్యమును మరియు ధనమును అనుగ్రహించబడును. పాతనిబంధనలో కొందరిని కోటీశ్వరులుగా చేశాడు. అది మనలను పైన ఉన్నవాటిని వెదకకుండా చేసి మనలను నాశనం చేయవచ్చును గనుక దేవుడు మనకు ఆవిధంగా ఇవ్వడు.

ఎఫెసీ 1:3లో ఉన్న ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పరిశుద్ధాత్మయొక్క ఆశీర్వాదముగా చెప్పవచ్చును. క్రీస్తులో ఉన్న సమస్తాన్ని పరిశుద్ధాత్మలో ఉంచి, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించుట ద్వారా ఆయనలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభువైనయేసు నామములో వాటినన్నిటిని అడిగి పొందుకోవాలి. రోడ్డు ప్రక్కన ఒక భిక్షగత్తె భిక్షము అడుగుకొనుట ఊహించండి. ఒక ధనవంతుడైన రాజకుమారుడు ఆ మార్గము గుండా వచ్చి ఆమెను పెండ్లి చేసుకోవాలని నిర్ణయించి, ఆమెయొక్క బ్యాంకు ఖాతాలో అనేకకోట్ల రూపాయలు వేశాడు. ఆ బ్యాంకు ఖాతాలోనుండి ఆమెకు కావలసినంత డబ్బును ఎన్నిసార్లు అయినను తీసుకొనవచ్చును. ఆమె ఎంత అదృష్టవంతురాలు! ఒకప్పుడు ఒక గిన్నెలో కొన్ని నాణెములు తప్ప ఏమియులేదు కాని ఇప్పుడు ఎంతో ఖరీదైన వస్త్రములు ధరించుకొని, సౌఖ్యముగా జీవించుచున్నది. రాజకుమారుడు సంతకము పెట్టిన అనేక బ్యాంకు చెక్కులు ఆమెయొద్ద ఉన్నవి గనుక ఆమె బ్యాంకులోనుండి ఎంత ధనము అయినను తీసుకొనవచ్చును. ఆత్మీయముగా మనముకూడా అలాగే ఉన్నాము.

ప్రభువైనయేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మలో ఉన్న సకల ఆశీర్వాదములను ప్రార్థించుట ద్వారా పరలోక బ్యాంకు దగ్గరకు వెళ్ళి పొందుకొనవచ్చును. మనము ఆయనకు నమ్మకమైన పెండ్లికుమార్తెగా ఉన్నయెడల, పరలోకమందున్న క్రీస్తులో ఉన్న సమస్తము మనవి అవుతాయి. మనము ప్రభువుతో ఇలా చెప్పాలి, "ఓ యేసుప్రభువా, నీ పెండ్లి కుమార్తెగా నేను భూమి మీద ఉన్న దినములన్నియు యధార్థముగా ఉండాలని కోరుచున్నాను". అప్పుడు పరిశుద్ధాత్మలో ప్రతి ఆశీర్వాదము మన స్వంతమవుతుంది. మనము వాటిలో దేనికిని పాత్రులము కాదు. గనుక వాటిని పొందుటకు మనము అర్హులమని దేవుని ఒప్పించుటకు ప్రయత్నించనవసరము లేదు. ఆ బిక్షగత్తె తాను ఉచితముగా పొందిన ఐశ్వర్యమును పొందుటకు అర్హురాలని ఆమె అనుకొందని మీరు ఊహించగలరా? ఎన్నటికి కాదు. కేవలము దేవుని కనికరము మరియు కృపద్వారానే ఆయనలో ఉన్న సమస్తమును మనము పొందియున్నాము. క్రీస్తులో పరలోకములో ఉన్న సమస్తము మనకు ఉచితముగా ఇవ్వబడింది. ఉపవాసము ఉండుటద్వారా గాని లేక ప్రార్థన చేయుటద్వారా గాని వాటిని మనము సంపాదించలేదు. కొందరు ఈ మార్గములో సంపాదించాలని ప్రయత్నించుట ద్వారా పరిశుద్ధాత్మయొక్క ప్రతి ఆశీర్వాదమును వారు ఉచితముగా పొందుకొనలేరు. మనము వాటిని ఆవిధముగా పొందుకొనలేము. క్రీస్తు మనకొరకు చేసి ముగించినదానినంతటిని విశ్వసించి మరియు అంగీకరించుట ద్వారా పొందుకుంటాము.

నేను భూసంబంధమైన విషయమై ప్రార్థించుచున్నప్పుడు ప్రభువు ఈ పాఠమును నాకు నేర్పించినట్లు గుర్తున్నది. నేను ఇట్లన్నాను, "ప్రభువా! చాలా సంవత్సరముల నుండి నిన్ను సేవించుచున్నాను, కాబట్టి దయచేసి దీనిని చేయుము". ప్రభువు ఇట్లన్నాడు, "నీవు నీ నామములో వచ్చినట్లయితే, నేను చెయ్యను". ప్రభువైన యేసు నామములో ప్రార్థించుట అనగా ఏమిటో నేను అప్పుడు నేర్చుకొనియున్నాను. అప్పుడే రక్షణపొందిన క్రొత్త విశ్వాసి మరియు 1959 సంవత్సరములో రక్షణ పొందిన నేను ఇద్దరము ప్రభువైనయేసు క్రీస్తు నామములో మాత్రమే దేవుని యొద్దకు రాగలమని (ప్రార్థించగలమని) గుర్తించాను. ప్రభువైనయేసు క్రీస్తు సంతకము పెట్టిన చెక్కుతో మాత్రమే పరలోకపు బ్యాంకు దగ్గరకు అతడు రావలెను. నేను కూడా ప్రభువైనయేసు క్రీస్తు సంతకము పెట్టిన చెక్కుతో మాత్రమే అక్కడకు రాగలను. అనేక సంవత్సరముల నుండి నేను నమ్మకముగా ఉన్నానని చెప్పి దేవుని దగ్గరకు వచ్చినచో, అప్పుడు నా సంతకము కలిగిన చెక్కుతో పరలోకపు బ్యాంకు దగ్గరకు వచ్చుచున్నాను. మరియు పరలోకపు బ్యాంకు దానిని విసర్జించింది. అందువలననే అనేక ప్రార్థనలకు జవాబు రావటం లేదు. మనము ప్రభువైనయేసు నామములో వెళ్లుట లేదు. మనము మన నామములో వెళ్ళుచున్నాము. మనము దేవుని కొరకు చాలా త్యాగము చేసియున్నాము గనుక ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడని అనుకొనుచున్నాము. మనము 70 సంవత్సరములు నమ్మకముగా జీవించినప్పటికీ, ఒక క్రొత్త విశ్వాసివలె, కేవలము ప్రభువైనయేసు నామములో మాత్రమే ప్రభువు యొద్దకు రావలెను. ఆ ప్రత్యక్షతను ఇచ్చినందుకు నేను దేవునికి వందనములు చెల్లించుచున్నాను. ఎందుకనగా తరువాత నా సంతకముతో ఎప్పుడైనను నేను దేవుని యొద్దకు వెళ్ళలేదు. ఆవిధముగా చేయ్యవలెననే శోధన వచ్చినప్పుడు నేను ఇట్లనుకుంటాను, "ఆ చెక్కు చెల్లదు కాని ప్రభువైనయేసు యొక్క అత్యున్నత నామములో మాత్రమే వెళ్లెదను". కాబట్టి క్రీస్తులో మాత్రమే పరలోకసంబంధమైన ఆత్మసంబంధమైన సకల ఆశీర్వాదములు మన సొంతమగును.