WFTW Body: 

నీవు నడుచునప్పుడు, దేవుడు నీ యెదట ఒక్కొక్క ద్వారమును తెరుచునని సామెతలు 4:12(పారాప్రేజ్‍)లో ఉన్నది. తరువాత ఏమి జరుగబోవుచున్నదో నీకు తెలియనవసరములేదు. నీవు చూచుచున్న దానిలో గుండా వెళ్ళుము తరువాత విషయమును అప్పుడు చూస్తావు. ఆ విధముగా దేవుడు నిన్ను నడిపించును. నీ యెదుట ద్వారములు మూసుకొనియున్నట్లుగా ఉండవచ్చును కాని నీవు దగ్గరకు వెళ్ళే కొలది, వాటంతట అవే తెరుచుకొనును. కాని నీవు వాటి దగ్గరకు సమీపించు వరకు అవి తెరుచుకోవు. ఆ విధముగా దేవుడు నిన్ను నడిపించును. కాబట్టి నీ యెదుట ద్వారము మూసుకొనియుండగా నీవు తొందరపడవద్దు లేక భయపడవద్దు. దేవుడు చూపించిన మార్గమున వెళ్ళుము, "ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచియున్నానని ప్రభువు చెప్పుచున్నాడు దానిని ఎవడును వేయనేరడు" (ప్రకటన 3:8).

దేవుడు నీ మార్గమును అంతకంతకు తేజరిల్ల చేయునని సామెతలు 4:18లో వ్రాయబడింది. క్రొత్తగా జన్మించుట సూర్యోదయముతోను మరియు క్రీస్తు రాకడ పట్టపగలుతో పోల్చబడింది. నీవు క్రొత్త జన్మించి మరియు క్రీస్తు మరలా వచ్చువరకు, ప్రతిరోజు కొద్దిగా క్రీస్తు సారూప్యము నీలో ఏర్పడాలని దేవుని యొక్క సంపూర్ణచిత్తమైయుంది. ఇదియే నీతిమంతుల మార్గము. ఈ మార్గములో నీవు దేవుని వాక్యము యొక్క ప్రత్యక్షతను అంతకంతకు పొందుకొనుచు, నీ స్వజీవము యొక్క భ్రష్టత్వము మీద కూడా అంతకంతకు ప్రత్యక్షతను పొందుచు, నీ జీవితములో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనుటకు కావలసిన జ్ఞానమును పొందకొనెదవు. ఈ మార్గములో నీవు వెళ్ళుచున్నయెడల, ఆకాశములోని సూర్యునివలె నీవు వెనుతిరుగవు.

మనము దేవునిని ఆరాధించేవారముగా ఉండాలని దేవుడు మొదటిగా పిలిచియున్నాడు అనగా ఆయననే మొదటిగా కోరుకొనుట. అప్పుడు నీవు యెషయావలే దేవుని మహిమను చూచెదవు. వెంటనే, యెషయా తన సొంత పాపమును చూచియున్నాడు మరియు నీవు కూడా చూచెదవు (యెషయా 6:1-5). నీవు ఆరాధించే వాడుగా ఉండుము. అప్పుడు నీ జీవితములో క్రీస్తువలె లేని విషయములను కడుగుకొనవచ్చును. అప్పుడు ఆయన స్వభావములో ప్రతిరోజు కొద్దిగా పాలివారమగునట్లుగా దేవుడు చేయును. దేవుని వాక్యములోని ప్రభువైనయేసు మహిమను మనము చూచే కొలది, పరిశుద్ధాత్ముడు మనలను మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించే కొలది ఆయన పోలికలోనికి మార్పు చెందదము (2 కొరింథీ 3:18). మరొకవిధంగా చెప్పాలంటే, మనము ఆత్మకు సంపూర్ణముగా లోబడినట్లయితే, గత సంవత్సరముల కంటే మరియు 30 సంవత్సరముల క్రితం ఉన్న దానికంటే అధికమైన అభిషేకం కలిగియుందువు.

ప్రతిరోజు దేవుని చిత్తమును చేయవలెనని మనము కోరినట్లయితే, ప్రతిరోజు దేవునియొద్ద నుండి వినాలి. ప్రభువైనయేసు మరియతో చెప్పినట్లుగా (లూకా10:42), క్రీస్తు యొక్క వాక్యము అన్నిటికంటే ఎక్కువగా అవసరమైయున్నది. బైబిలులోని మొదటి అధ్యాయములో, ప్రతిరోజు దేవుడు మాట్లాడియుండగా - ప్రతిరోజు భూమి కొద్ది కొద్దిగా రూపాంతరము పొందియున్నది. ఈ సంవత్సరములో మనము క్రీస్తువలె రూపాంతరము పొందగోరినయెడల, ప్రతిరోజు దేవుని స్వరము విని మరియు విధేయత చూపాలి. అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుతో సన్నిహిత సహవాసము కలిగియుండుట ద్వారా బైబిలును అర్ధము చేసుకొనుటలో ఉన్న రహస్యమును తెలుసుకొనెదము. దేవుని వాక్యములోని మర్మమును పరిశుద్ధాత్ముడు మనకు వివరించును. కాబట్టి ఆదిమ శిష్యులవలె యేసుతో నడచుచు మరియు వారివలె వినుటకు ఆసక్తి కలిగియుండుము. అప్పుడు వారివలె నీ కన్నులు తెరువబడును మరియు వారివలె నీ హృదయము ఉండును.

మన నాలుక మన శరీరములో ఎక్కువగా ఉపయోగించే అవయవము. ప్రభువైనయేసు తన నాలుకతో ఇతరులను ప్రోత్సహించి, జీవాన్ని ఇతరులకు సరఫరా చేయుటకు దేవుని చేత వాడుకోబడియున్నాడు. అలసినవారిని ఊరడించే మాటలచేత పురికొల్పియున్నాడు. ప్రభువైనయేసు ప్రతి ఉదయమున తండ్రియొద్ద నుండి వినుట వలన, తనను కలసిన వారి అవసరానికి సరిపోయిన మాటలు కలిగియుండెనని యెషయా 50:4 చెప్పుచున్నది. మనకు కూడా ప్రతిరోజు దేవుని నుండి వినే అలవాటున్నట్లయితే, మన చుట్టుప్రక్కలనున్న అలసిపోయినవారికి మనము కూడా ఆశీర్వాదముగా ఉండవచ్చును. మన మాటలలోనుండి నీచమైనవాటిని, వ్యర్థమైనవాటిని విసర్జిస్తూ మరియు విశ్వాసాన్ని కలుగజేసే అమూల్యమైన మాటలను మాట్లాడలని నిర్ణయించుకుంటే, దేవుడు ఆయన మాటలను మనకిచ్చి మరియు మనలను తన నోటిగా చేసుకొనునని యిర్మీయా 15:19లో చెప్పబడింది.