WFTW Body: 

మనం మోసకరమైన రోజులలో జీవించుచున్నాము. అనేకుల ప్రేమ చల్లారి, సహోదరునికి వ్యతిరేకముగా సహోదరుడు మోసగించే రోజులలో ఉన్నాము. కాబట్టి మనం ఎల్లప్పుడు ప్రేమలో నిలిచియుండుటయే కాక ఘర్షణ పోరాటము కలిగియున్న వ్యక్తుల విషయములో మనం జ్ఞానము కలిగి ఉండాలి.

క్రైస్తవులముగా మనం ఎవరికీ కీడు చేయము మరియు మనుష్యులతో పోరాడము. కాని తప్పుడు సిద్ధాంతములను బహిర్గత పరచెదము.

మనం తప్పకుండా, "మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము జరుగునట్లు మనం నోరు తెరవాలి. దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగించాలి" (సామెతలు 31:8,9). అహితోపేలు దావీదుకు వ్యతిరేకముగా అబ్షాలోముతో కలిసి పథకం వేసినప్పుడు, వారికి గందరగోళాన్ని కలిగించాలని దావీదు దేవునికి ప్రార్థించాడు (2సమూయేలు 15:31) మరియు దేవుడు అతని ప్రార్థన వినెను (2సమూయేలు 17:23). తనను గాయపరచిన వారిని క్షమించమని యేసుప్రభువు తండ్రికి ప్రార్థించాడు. కాని ఇతరులను గాయపరచు వారిని కనికరము లేకుండా ఖండించాడు (మత్తయి 23లో పరిసయ్యులను ఖండించుటను చూడండి).

బుద్ధిగల కన్యకల ఉపమానం గురించి ఒక మాట:

ఈ ఉపమానము గురించి ఒక విధమైన వివరణ మనం విన్నప్పుడు, దాని గురించి ప్రభువు మరొక వివరణ ఇవ్వలేనంతగా మనము ఆ వివరణ మన మనస్సులో ఉంచుకొందుము. కొంతకాలం క్రితం ఈ విధమైన పరిస్థితినుండి విడిపింపమని ప్రభువుని వేడుకొని ఈ ఉపమానం సందర్భ సహితముగా అర్థం చేసుకొనుటకు ప్రార్థించాను. ఏ ఉపమానమునైనను దాని సందర్భములో అర్థం చేసుకొనుట శ్రేష్ఠమైన పద్ధతి.

యేసుప్రభువు మత్తయి 24:12లో, అంత్యదినములలో అనేకుల ప్రేమ చల్లారుననియు మరియు అంతము వరకు (వారి ప్రేమ చల్లారిపోకుండా) సహించిన వాడే రక్షణ పొందునని(లేక దేవుని ఇంటిలో ప్రవేశించునని) చెప్పారు (మత్తయి 24:13). తరువాత 10మంది కన్యకల ఉపమానమును చెప్పారు - ఐదుగురి దివిటీలు ఆరిపోయినవి మరియు ఐదుగురు చివరివరకు సహించి వారు ఇంటిలోపలికి ప్రవేశించారు (మత్తయి 25వ అధ్యాయం). కాబట్టి ఇక్కడ నూనె అనగా ఒక అర్థం పరిశుద్ధాత్మ ద్వారా పొందే దైవికమైన ప్రేమ అయియున్నది. కాబట్టి దేవుని ఇంటిలోకి ప్రవేశించవలెనంటే, పెళ్ళికుమారుడు వచ్చినప్పుడు మనం ఈ దైవిక ప్రేమలో అంతము వరకు నిలిచియుండవలెను. మన దీపాలను చివరి వరకు వెలిగించే "ఎక్కువ నూనె" కలిగి ఉండటం అంటే ఇదే.

"వారు నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి" అని యేసుప్రభువు చెప్పారు (యోహాను 15:25). కాని దానికి ప్రతిఫలముగా ఆయన వారిని నిర్హేతుకముగా ప్రేమించెను. ఆయనయొక్క మాదిరిని వెంబడించి అంతము వరకు ప్రేమించెదము. లేనియెడల అనేకమంది బోధకులకు ఉన్నట్లుగా స్వయమునకు చనిపోవుట ఒక వ్యర్థమైన సిద్ధాంతముగా ఉండును. సిలువ మార్గమును గురించి మాట్లాడుతున్న అనేకమంది విశ్వాసులలో ప్రేమ కొదువగా ఉండుట మాత్రమే కాక కనీసం మర్యాదలు కూడా లేనివారిని చూచాను. వారి పవిత్రమైన సిద్ధాంతం గురించి గర్వించెదరు గాని వారి జీవితం కంపు కొట్టుచున్నది. మన సిద్ధాంతం నిజంగా స్వచ్ఛమైనదైతే అప్పుడు మన జీవితాల నుండి క్రీస్తు యొక్క ప్రేమ సువాసన ప్రసరిస్తుంది.

19వ శతాబ్ధపు క్వేకర్ మిషనరీ, స్టీఫన్ గ్రెల్లెట్ ఒకసారి ఈ విధంగా చెప్పాడు, "ఒకసారి ఈ లోకములో గుండా వెళ్ళాలని కోరుచున్నాను. ఇక్కడ నేను చేయగలిగిన ఏదైనా మంచి పని చేయాలని, లేక ఇతరులయెడల నేను చూపగలిగిన కనికరమంతటిని ఇప్పుడే చూపించాలని కోరుచున్నాను. నేను మరల ఈ జీవితమును జీవించను కాబట్టి దీనిని వాయిదా వేయను, నిర్లక్ష్యం చేయను". ఆ సలహాను అనుసరించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.