WFTW Body: 

లేఖనాల్లోని చివరి వాగ్ధానాలలో ఒకటి ఏమిటంటే, ప్రభువు "మనల్ని తొట్రిల్లకుండ కాపాడగలడు" (యూదా 1:24). ఇది నిజం - ప్రభువు ఖచ్చితంగా మనల్ని తొట్రిల్లకుండ కాపాడగలడు, కానీ మనల్ని మనం పూర్తిగా ఆయనకు లోబరచుకుంటే తప్ప, ఆయన మనల్ని పడిపోకుండా కాపాడలేడు - ఎందుకంటే ఆయన తన చిత్తమును ఎవరిపైనా బలవంతంగా రుద్దడు.

విశ్వాసులుగా మన సంబంధము, క్రీస్తుతో నిశ్చితార్థం చేసుకొని వివాహం కోసం వేచియుండే కన్యకతో పోల్చబడింది (2కొరింథీ 11:2; ప్రకటన 19:7). తరువాత వచనంలో (2కొరింథీ 11:3), సాతాను హవ్వను మోసగించినట్లే, మనలను కూడా మోసం చేసి, క్రీస్తుపట్ల ఉన్న సరళమైన భక్తినుండి మనలను దూరం చేస్తాడని తాను భయపడుతున్నానని పౌలు చెప్పాడు. హవ్వ పరదైసులో ఉండి సాతానుచే మోసగించబడింది - దేవునిచే పరదైసులో నుండి తరిమివేయబడింది. నేడు, క్రీస్తుతో "నిశ్చితార్థం" చేసుకున్న మనం పరదైసుకు వెళ్తున్నాం. అయితే సాతాను మనల్ని మోసం చేయడానికి మనం అనుమతిస్తే, మనం ఎప్పటికీ పరదైసులోకి ప్రవేశించలేము.

వధువు లోకంతో వ్యభిచరిస్తూ పాపం చేస్తుంటే, ఆమె వరుడు ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. ఇది బబులోను అని పిలవబడే వేశ్య సంఘము (ప్రకటన 17). ఇది చివరకు ప్రభువుచే తిరస్కరించబడింది.

మీరు ప్రభువును ప్రేమిస్తే, మీ చుట్టూ ఉన్న ఇతర విశ్వాసులు లోకంతో వ్యభిచరిస్తూ పాపం చేస్తున్నట్లు మీరు కనుగొన్నప్పుడు కూడా, మీరు ఆయన కోసం పరిశుద్ధంగా ఉంటారు. చివరి రోజులలో "అనేకమంది ప్రేమ చల్లారిపోతుంది (ఈ వాక్యం స్పష్టంగా విశ్వాసులను సూచిస్తుంది, ఎందుకంటే వారు మాత్రమే ప్రభువును ప్రేమిస్తారు) కాని అంతము వరకు సహించేవాడు రక్షింపబడతాడు" అని యేసు మనలను హెచ్చరించాడు (మత్తయి 24:11-13).

సాతాను మనందరినీ మోసం చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ మనం "రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకపోయినట్లయితే" అబద్ధమును నమ్మునట్లు మోసగింపబడుటకు దేవుడు మనలను అనుమతిస్తాడని (2 థెస్స 2:10,11) బైబిల్ మనలను హెచ్చరిస్తుంది.

దేవుని వాక్యంలో వ్రాయబడిన సత్యాన్ని మనం అంగీకరించినట్లయితే మరియు పరిశుద్ధాత్మ మనకు చూపించే మన స్వంత జీవితంలో పాపాల గురించిన సత్యాన్ని మనం ఎదుర్కొంటే, ఆ పాపాలన్నిటి నుండి రక్షించబడాలని మనం ఆసక్తిగా ఉంటే, అప్పుడు మనం ఎప్పుడూ మోసపోము.

కాని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడిన వాటిని మనం అంగీకరించకపోతే, లేదా పాపం నుండి రక్షించబడాలని మనం కోరుకోకపోతే, "నిత్యభద్రత" విషయంలో మాత్రమే కాదు ఇతర విషయాలలో కూడా దేవుడు మనల్ని మోసం చేయడానికి మరియు అబద్ధాన్ని నమ్మడానికి అనుమతిస్తాడు.

ఈ మొత్తం విషయం యొక్క ముగింపు ఇక్కడ ఉంది:

మనము ప్రభువును ప్రేమిస్తున్నాము, ఎందుకంటే ఆయన మొదట మనలను ప్రేమించాడు మరియు మన పాపలన్నిటిని ఆయన క్షమించాడు. కాబట్టి, ఆయన కృపతో, మనం మన మనసాక్షిని ఎల్లవేళలా స్పష్టంగా ఉంచుకుంటాము. మనం ఆయనను ప్రేమిస్తాము మరియు చివరి వరకు ఆయనను వెంబడిస్తాము - కాబట్టి మనం నిత్యభద్రత కలిగియుంటాము.

యేసును వెంబడిస్తున్న ప్రతి శిష్యుడు నిత్యభద్రత కలిగియుంటాడు.

అయితే తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను (1కొరింథీ 10:12).

వినడానికి చెవులు గలవాడు వినును గాక.