WFTW Body: 

అబ్రాహాము "అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన బలమునొందెను" (రోమా 4:20, 21).

అసాధ్యమైన పరిస్థితులలో మనము దేవుని నమ్మినయెడల, దేవుని మహిమపరచెదము. దేవుడు పరిష్కరించలేని సమస్య ఏదియులేదు. ఎక్కడైనను సాతాను కలుగజేసే సమస్యలన్నింటిని ఆయన పరిష్కరించగలడు. అధికారి హృదయముకూడా దేవుని చేతిలో ఉన్నది మరియు ఆయన దానిని మనకు అనుకూలముగా త్రిప్పగలడు (సామెతలు 21:1).

కాబట్టి ఏది జరిగినను, ఎల్లప్పుడు దేవునియందు విశ్వాసముంచుము మరియు నీ విశ్వాసమును నోటితో ఒప్పుకొనినయెడల, దేవుడు సాతానును మీ కాళ్ళక్రింద త్రొక్కిపట్టును. అప్పుడు అతడు మీకు ఏమి చేసినను, సాతానును జయించుదువు. నా జీవితములో ఇలాగు జరుగుట అనేకసార్లు చూచితిని.

భూమిమీద దేవుడు నీకు ఆత్మీయ విద్యను నేర్పాలని చూచుచున్నాడు గనుక, కాలముగడిచే కొలది పెద్ద సమస్యలు వచ్చును. అనగా స్కూలులో నీవు పై తరగతులకు వెళ్ళే కొలది పెద్ద పరీక్షలు వచ్చినట్లుండును. కాని నీవు ఆ పెద్ద సమస్యను తప్పించుకొనుటకు, క్రింది తరగతులకు వెళ్ళవలెనని నీవు కోరవు. కాబట్టి నీవు కృపలో ఎదిగే కొలది పెద్దసమస్యలు వచ్చినయెడల నీవు ఆశ్చర్యపడవద్దు. ఆ విధముగా నీవు బలమైన మరియు ధైర్యము గల క్రైస్తవుడవగుదువు.

ఏ విషయములోనైనను నీ మనస్సాక్షి నేరారోపణ చేయకుండునట్లు జాగ్రత్తపడుము. అప్పుడు మాత్రమే నీవు దేవుని దగ్గరకు ధైర్యముగా వెళ్ళి మరియు నీ సమస్యలను పరిష్కరించమని అడిగెదవు (1 యోహాను 3:21, 22). శ్రమలలో ఉన్నప్పుడు జ్ఞానము కొరకు దేవుని అడుగుట, నీవు ఎదుర్కొనుచున్న సమస్యకు పరిష్కారమడుగుటయే (యాకోబు 1:1-7). ప్రతి సమస్యకు దేవుని దగ్గర పరిష్కారమున్నది గనుక వాటిని బట్టి సంతోషించమని యాకోబు చెప్పుచున్నాడు. ఎందుకనగా ఆ విధముగా దేవునిని నూతనముగా అనుభవించెదవు.

మనము రెండు సార్లు మాత్రమే "యేసు ఆశ్చర్యపడెను" అని చదువుతాము. ఒకటి ఆయన విశ్వాసమును చూచినప్పుడు మరియు రెండవది అవిశ్వాసమును చూచినప్పుడు. ప్రభువా నీవు మాట మాత్రమే సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడునని శతాధిపతి చెప్పినప్పుడు ప్రభువు అతని విశ్వాసము చూచి ఆశ్చర్యపడెను (మత్తయి 8:9-10). మరియు ఆయన కపెర్నహూములో వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడెను (మార్కు 6:5). ప్రభువైనయేసు, తన ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడు కానని చెప్పి, తనను తాను ఎంతో తగ్గించుకొనెను.

ఒక కనాను స్త్రీ కూడా తన కూతురిని స్వస్థపరచమని అడిగినప్పుడు, ఆమె యొక్క గొప్ప విశ్వాసమును ప్రభువు కొనియాడెను (మత్తయి 15:28). పిల్లలయొక్క ఆహారమును కుక్కలకు పెట్టనని ప్రభువు చెప్పినప్పుడు, ఆమె ఎంతో దీనురాలై, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లక్రిందపడు రొట్టెలను తినునని ఎంతో దీనురాలై చెప్పెను. ఆమె అభ్యంతరపడలేదు. ఈ రెండు సంఘటనలలో ఒకే విషయము చూచెదము. దీనత్వము మరియు విశ్వాసమునకు మధ్య సంబంధమున్నది. మనము ఎంత దీనులమైతే, మన మీద మనకు ఎంత తక్కువ నమ్మకముంటే మరియు మనము చేసిన వాటిని గురించిగాని మరియు మన తలాంతులు గురించిగాని ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువ విశ్వాసము కలిగియుండెదము. ఎంత గర్విష్టులమైతే అంత తక్కువ విశ్వాసము కలిగియుండెదము. ప్రభువు యెదుట నిలువబడుటకు మనము అయోగ్యులమని ఎల్లప్పుడు గుర్తించవలెను. ఆయన యొక్క అద్భుతమైన కృపనుబట్టి ఆయన సన్నిధిలోనికి మనలను అనుమతించుచున్నాడు. మనము దానిని చులకనగా చూడకూడదు. కాబట్టి హృదయమంతటితో దీనత్వమును కోరుకొనుము.