వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము
WFTW Body: 

కొలస్సీ 2:2లో "వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగినవారై దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలుసుకొన్నవారై, తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను" అని పౌలు చెప్పుచున్నాడు. క్రొత్త నిబంధనలో కొన్నిసార్లు మర్మమని చెప్పబడింది మరియు అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే దేవుడు ఆ సత్యమును బయలుపరచును. 1 కొరింథీ 2:9,10 లో ఈవిధంగా ఉన్నది, "దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు".

బైబిలులో రెండు మర్మములే గొప్ప మర్మములైయున్నవి. ఒకటేమనగా, దేవుడు శరీరధారిగా వచ్చెను (1 తిమోతి 3:16): "నిరాక్షేపముగా దైవభక్తికి గూర్చిన మర్మము గొప్పదైయున్నది: ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను". దీనినే దైవభక్తిని గూర్చిన మర్మము లేక భయభక్తులు కలిగిన జీవితము అని అంటారు. సంఘమే క్రీస్తు యొక్క శరీరము మరియు పెండ్లికుమార్తె అనునది రెండవ మర్మము. ఎఫెసీ 5:32 "వారిద్దరును ఏకశరీరమగుదురు. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు మరియు సంఘమునుగూర్చియు" అని చెప్పుచున్నది. రెండవ మర్మమేదనగా క్రీస్తుతో సంఘము ఏక శరీరమైయున్నది.

ప్రభువైనయేసు శరీరధారిగా వచ్చుటను గురించియు, ఆయన మనవలె శోధించబడి మరియు జయించుటను గురించియు మరియు మనము ఆయన అడుగుజాడలలో నడుచుచూ, పాపమును జయించుచు మరియు ఆ విధంగా జీవించువారితో కలిసి క్రీస్తు యొక్క శరీరముగా నిర్మించబడుటను గురించిన ప్రత్యక్షత మనకు కావలెను. క్రీస్తు శరీరముగా సంఘ నిర్మాణం కొరకు చేసే పరిచర్యయే, ఈ భూమిమీద ఎవరైనను చేయగల గొప్ప పరిచర్య. దీనికంటే గొప్ప పరిచర్య లేనేలేదు. పౌలు తన జీవితాంతము సంఘ నిర్మాణం కొరకు పరిచర్య చేశాడు.

గొప్ప దేవుని సేవకులు క్రీస్తుతో కలసి ఆయన సంఘమును నిర్మించెదరు. దైవభక్తి కలిగి జీవించుట మంచిదే, కాని అది సరిపోదు. పౌలు సంఘ నిర్మాణంలో పాలు పొందినట్లు మనము కూడా చేయవలెను. సమాజ సేవ చేయుట కొరకు పౌలు జీవించలేదు. భూసంబంధమైన విషయాలలో బీదలకు సహాయపడుట మంచిదే, అది దేవుని నిత్యసంకల్పముకాదు. ఇతరుల జీవితాలు సౌఖర్యవంతముగా ఉండునట్లు నీవు వారికి చదువుకునే విషయంలోను మరియు వైద్య చికిత్స విషయంలో మాత్రమే సహాయపడినయెడల, నిజానికి వారు నరకానికి వెళ్ళుటకు మార్గమును సులభము చేసినట్లగును. ఆరంభములో వారు నరకానికి వెళ్ళే మార్గములో ఉన్నారు. అయితే నీవు దానిని మరికొంచెం సులభంగా చేశావు. ప్రజలను క్రీస్తుయొద్దకు నడిపించుటయు మరియు వారిని దైవభక్తిలోనికి నడిపించుటయు మరియు తరువాత వారు ఒక శరీరముగా నిర్మించబడునట్లుగా చేయుటయే పరిచర్యలన్నిటికంటే గొప్ప పరిచర్య అని పౌలు గుర్తించియున్నాడు. ఇదియే ఎవరైనను చేయగలగిన గొప్ప పరిచర్య.

క్రీస్తునామములో బీదలకు సమాజ సేవ చేయుచు, సహాయపడుచున్న వారందరిని మనము గౌరవిస్తాము. ఆ పరిచర్య చేయుటకు పిలువబడిన వారందరిని దేవుడు దీవించును గాక. పౌలు కాలములో కూడా ప్రపంచములో అటువంటి పరిచర్య ఎంతో అవసరమైనప్పటికీ, పౌలు ఆ పరిచర్య చెయ్యలేదు. బీదలకు సహాయపడువారికి నోబెల్ శాంతి బహుమానమనే లోకసంబంధమైన ఘనత రావచ్చును. కాని ప్రభువైనయేసుకు మరియు పౌలుకు అటువంటి నోబెల్ శాంతి బహుమతి వచ్చెడిది కాదు. సంఘమును నిర్మించిన వారికెవరికైనను నోబెల్ బహుమతి ఇవ్వబడదు.

కొలస్సీ 4:17లో పౌలు అర్ఖిప్పతో చేసిన అద్భుతమైన హెచ్చరికను చదివెదము, "ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్తపడుమని చెప్పెను". దేవుడు ఇతరులకు ఇచ్చిన పరిచర్యలను గురించి చింతించకండి. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన పరిచర్యను అనుగ్రహించాడు. దానిమీదనే నీవు దృష్టిని పెట్టి మరియు ఎంతవెలైనను చెల్లించి దానిని చేయుము. అర్ఖిప్ప అను పేరు ఉన్న చోట నీ పేరు పెట్టుకొని మరియు ఆ వాక్యము హృదయపూర్వకముగా స్వీకరించుము. నేను యౌవ్వనస్థుడుగా ఉన్నప్పుడు, ఆ వచనమును చదివాను మరియు అర్ఖిప్ప ఉన్న చోట నా పేరు పెట్టుకొని, ప్రభువు నాతో ఈ విధంగా చెప్పియున్నాడు, "నేను నీకు అప్పగించిన పరిచర్యను నెరవేర్చుటకు జాగ్రత్తపడి మరియు దానిని నెరవేర్చుము. నీవు దారి తప్పి వేరొక పరిచర్య చేయవద్దు". నేను మీ అందరితో చెప్పెదేమిటింటే, దేవుడూ నిన్ను సంఘ నిర్మాణము చేయుటకు పిలిచినయెడల, నీవు సమాజ సేవ చేయవద్దు. దేవుడు నిన్ను ప్రవచించుటకు పిలిచినయెడల, నీవు ఒక క్రైస్తవ సంస్థలో ఒక డాక్టరుగా కూర్చొనవద్దు. దేవుడు నీకు అనుగ్రహించిన పరిచర్య విషయములో జాగ్రత్తపడి మరియు దానిని నెరవేర్చుము.