వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

1. దేవుడు యేసును ప్రేమించినట్లే మనలను ప్రేమించుచున్నాడు:

"నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివి" అని ప్రభువైన యేసు చెప్పారు(యోహాను 7:23). ఇది నేను బైబిలు కనుగొన్న అతి గొప్ప సత్యము. ఇది నన్ను ఒక భద్రతలేని, నిస్పృహ కలిగిన విశ్వాసిగా ఉండుటనుండి దేవునిలో పూర్తి భద్రతను కలిగి, ఎల్లప్పుడు ప్రభువుయొక్క ఆనందముతో నిండిన విశ్వాసిగా మార్చివేసింది. దేవుడు మనలను ప్రేమించుచున్నాడని చెప్పే వచనములు బైబిలులో అనేకమైనవి కలవుగాని ఇది ఒక్కటే ఆ ప్రేమ యొక్క విశాలతను గూర్చి చెప్పుచున్నది - దేవుడు యేసును ప్రేమించినంతగా మనలను కూడా ప్రేమించెను. మన పరలోకపు తండ్రి తన కుమారులలో ఎవరినైనను ప్రేమించు విధానములో పక్షపాతములేదు కనుక ఆయన కుమారులమైన మనకు ఆయన తన జ్యేష్ఠకుమారునికి చేసినవాటినన్నిటిని చేయుటకు ఆయన నిశ్చయముగా సిద్ధముగా ఉన్నాడు. ఆయన యేసుకు సహాయపడినట్లే మనకు సహాయపడును. ఆయన యేసును చూచుకున్నట్లే మనలను చూచుకొనును. ఆయన యేసు యొక్క జీవితమును యోచించుటలో కలిగియున్న ఆసక్తిని, మన అనుదిన జీవితము యొక్క వివరములను యోచించుటలో ఆసక్తి కలిగియుండును. మనకు జరుగునది ఏదియుకూడా దేవునిని ఆశ్చర్యపరచదు. ఆయన ప్రతి పరస్థితి కొరకు ఎప్పుడో ప్రణాళిక వేసెను. కాబట్టి మనము భద్రతలేనివారిగా ఉండవలసిన అవసరము లేదు. యేసు పంపించబడినట్టే మనము కూడా భూమికి ఒక ఖచ్చితమైన ఉద్దేశ్యముతో పంపబడితిమి. ఇదంతయు మీ విషయములో కూడా నిజమే - కాని మీరు దానిని నమ్మినప్పుడు మాత్రమే. దేవుని వాక్యమును విశ్వసింపని వానిలో వాక్యము పనిచేయదు.

2. దేవుడు నిజాయితి గలవారియందు ఆనందించును:

"ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము" (1 యోహాను 1:7). వెలుగులో నడచుట అనగా మొట్టమొదటిగా మనము దేవునియెదుట ఏదియు దాచిపెట్టకుండా ఉండుట. మనము ఆయనకు సమస్తమును ఉన్నది ఉన్నట్టు చెప్పుదుము. దేవునియొద్దకు వెళ్ళుటకు మెదటి మెట్టు నిజాయితీ అని నేను ఒప్పించబడియున్నాను. యధార్ధముగా లేనివారిని దేవుడు అసహ్యించుకొనును. యేసు వేషధారులకు వ్యతిరేకముగా మాట్లాడిన దానికంటే వ్యతిరేకముగా ఎవరి గురించి మాట్లాడలేదు. దేవుడు మనలను మొదటిగా పరిశుద్ధులుగా లేక పరిపూర్ణులుగా ఉండమని అడుగడు కాని యధార్ధముగా ఉండమని అడుగును. నిజమైన పరిశుద్ధతకు ఇదే ఆరంభము. ఈ ఊటనుండియే తక్కినవన్నియు ప్రవహించును. మనలో ఎవరైనను చేయుటకు సులువైనదేదైనా ఉన్నదంటే అది యధార్ధముగా ఉండుటయే. కాబట్టి, పాపమును వెంటనే దేవునితో ఒప్పుకొనుడి. పాపపు తలంపులను "యుక్తమైన" పేర్లతో పిలువకుడి. మీరు నిజానికి మీ కళ్లతో వ్యభిచరించు విధముగా మోహించి, "నేను కేవలము దేవుని సృష్టి యొక్క అందమును మెచ్చుకొనుచున్నాను" అని చెప్పవద్దు. కోపమును "న్యాయమైన అగ్రహము" అని పిలువవద్దు. మీరు యధార్ధముగా లేనియెడల మీరు పాపముపైన ఎప్పటికీ విజయము పొందలేరు. "పాపము"ను ఎన్నడు "పొరపాటు" అని పిలువకుడి, ఎందుకనగా యేసు రక్తము మిమ్ములను సమస్త పాపములనుండి పవిత్రపరుచును కాని, మీ పొరపాట్లనుండి పవిత్రపరచదు. ఆయన యదార్థవంతులు కానివారిని (నిజాయితి లేనివారిని) పవిత్రపరచడు. యదార్థవంతులైన వారికి మాత్రమే నిరీక్షణ కలదు. "అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు" (సామెతలు 28:13). దేవుని రాజ్యములో ప్రవేశించుటకు మతనాయకులకంటే వేశ్యలకు దొంగలకు ఎక్కువ నిరీక్షణ ఉన్నదని యేసు ఎందుకు చెప్పెను? (మత్తయి 21:31). ఎందుకనగా వేశ్యలు దొంగలు పరిశుద్దులైనట్లు నటించరు. అనేకమంది యౌవనస్తులు సంఘాలనుండి వెళ్లిపోవుదురు ఎందుకనగా తమకు ఎటువంటి ఇబ్బందులు లేవన్న భావనను సంఘస్తులు వారికి కలుగజేయుదురు. కాబట్టి "ఈ పరిశుద్ధులైన గుంపు మన సమస్యలను ఎప్పుడు అర్ధము చేసుకోరు" అని ఆ యౌవనస్తులు అనుకొందురు. ఇది మన విషయములో నిజమైతే, తన యొద్దకు పాపులను ఆకట్టుకొన్న క్రీస్తును పోలిన వారిగా మనము లేము.

3. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానియందు ఆనందించును:

"దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును" (2 కొరింథీ 9:7). ఈ కారణము చేతనే దేవుడు మానవునికి, రక్షణకు ముందు దాని తరువాత కూడా, పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత కూడా పూర్తి స్వేచ్ఛను ఇచ్చును. మనము దేవునివలే యున్నయెడల, మనము కూడా ఇతరులను నియంత్రించుటకు లేక ఒత్తిడి చేయుటకు ఆశించము. వారు మనకు వేరుగా ఉండుటకు భిన్నమైన అభిప్రాయములు కలిగియుండుటకు, వారికి తగిన విధముగా ఆత్మీయముగా ఎదుగుటకు వారికి సేచ్ఛ నిచ్చెదము. ఎటువంటి బలవంతమైనా అపవాది యొద్దనుండి వచ్చును. పరిశుద్ధాత్మ ప్రజలను నింపును, అయితే దయ్యములు ప్రజలను పట్టుకొనును. తేడా ఇదే: పరిశుద్ధాత్మ ఎవరినైనా నింపినప్పుడు, ఆ వ్యక్తి చేయాలనుకున్నది చేయుటకు అతనికి ఇంకా సేచ్ఛనిచ్చును. కాని దయ్యములు ప్రజలను పట్టినప్పుడు, అవి వారి సేచ్ఛను దొంగిలించి వారిని నియంత్రించును. ఆత్మతో నిండియుండుట యొక్క ఫలము ఆశానిగ్రహము (గలతీ 5:22,23). అయితే దయ్యము పట్టుటకు ఫలితము నిగ్రహమును కోల్పోవుట. మనము దేవుని కొరకు చేయు ఏ కార్యమైనను ఉత్సాహముగా, ఆనందముగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందముగా చేయనియెడల అది నిర్జీవక్రియయని మనము గుర్తుంచుకోవలెను. ప్రతిఫలము పొందుటకు లేక జీతము పొందుటకు దేవుని కొరకు చేసిన ఏ కార్యమైనను నిర్జీవక్రియయే. దేవుని దృష్టిలో ఇతరులనుండి ఒత్తిడివలన దేవునికిచ్చిన ఎంత డబ్బయినను విలువలేనిది. బలవంతమువలనో లేక మనస్సాక్షిని తృప్తిపరచుటకో చేసిన గొప్పకార్యములకంటే, ఆయన కొరకు ఉత్సాహముగా చేసిన చిన్న కార్యములకు దేవుడు విలువనిచ్చును.

4.లోకము ఘనముగా ఎంచునదంతయు దేవుడు అసహ్యించుకొనును:

"మనుష్యులలో ఘనముగా ఎంచబడేవి దేవుని దృష్టికి అసహ్యము" (లూకా 16:15). లోకములో ఘనముగా ఎంచబడేవి దేవుని దృష్టికి విలువలేనివేకాక, నిజానికి ఆయనకు అసహ్యము. ఈ లోక ఘనత అంతయు దేవునికి అసహ్యము గనుక అది మన దృష్టికి కూడా అసహ్యముగా ఉండవలెను. డబ్బును భూమి మీద ఉన్నవారందరు విలువైనదిగా ఎంచుదురు. కాని డబ్బును ప్రేమించువారు, ధనవంతులగుటకు అపేక్షించువారు ఈ క్రింది ఎనిమిది పరిణామాలను ఎప్పుడోకప్పుడు అనుభవింతురు (1తిమోతి 6:9,10). 1) వారు శోధనలో పడుదురు, 2) వారి ఉరిలో పడుదురు, 3) వారు అవివేక యుక్తములైన దురాశలో పడుదురు, 4) వారు హానికరమైన దురాశలలో పడుదురు, 5) వారు నష్టములో మునిగిపోవుదురు, 6) వారు నాశనములో మునిగిపోవుదురు, 7) వారు విశ్వాసము నుండి తొలగిపోవుదురు, 8) వారు నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొందురు. ప్రతిచోట విశ్వాసులకు ఇది మరల మరల జరుగుట నేను చూచితిని. ఈ రోజులలో మన దేశములో ప్రభువు యొద్దనుండి ఒక ప్రవచనాత్మకమైన సందేశము అరుదుగా వినబడుటకు కారణము ఎక్కువమంది బోధకులు డబ్బును ప్రేమించువారిగా ఉండుటయే. సత్యమైన ధనము (ప్రవచనవాక్యము అందులో ఒకటి) డబ్బు విషయములో అపనమ్మకముగా ఉన్న వారికి దేవుడు ఇవ్వడని యేసు చెప్పెను (లూకా 16:11). ఈ కారణముగానే సంఘకూడికలలో సమావేశములలో మనము ఎన్నో విసుగు పుట్టించే ప్రసంగాలను సాక్ష్యములను వినెదము.