WFTW Body: 

పాత నిబంధనలో, దేవుని ప్రజలలో ఉన్న శేషమును గూర్చి ప్రవక్తలు చెప్పిరి. దేవుని ప్రజలలోని కొందరు ఆత్మీయంగా దిగజారినప్పుడు కొందరు దేవునికి నమ్మకస్థులుగా ఉండిరి. వారిని తిరిగి సమకూర్చుటయే ప్రవక్తల ఉద్దేశ్యము.

ఉదహరణకు, హోషేయ వారి యొక్క వ్యభిచారము గూర్చియు మరియు దేవుని యొక్క ప్రేమను గూర్చి మాట్లాడెను. వారికి విశ్వాసపోరాటము గూర్చియు మరియు విశ్వాసము ద్వారా పొందే జయము గూర్చియు హబక్కూకు మాట్లాడెను. దేవుని ప్రజలు బబులోనునుండి యెరూషలేమునకు వెళ్ళవలెనని జెకర్యా భారము కలిగియుండెను. దేవుని యొక్క మందిరము నిర్మించవలెనని హగ్గయి భారము కలిగియుండెను. ప్రతి యొక్క ప్రవక్త దేవునిచేత ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన భారము కలిగియుండెను - కానీ దేవుని ప్రజల యొక్క పరిశుద్ధతలోపము గూర్చి వారు శ్రద్ధకలిగియుండెను.

పరిశుద్ధత మరియు దేవునియొక్క మారని ప్రేమ ప్రవక్తలందరి యొక్క భారముగా ఉండెను. దేవుని ప్రజలలో పరిశుద్ధత మరియు దేవుని ప్రజలు తప్పిపోయి ఆత్మీయ జారత్వములో ఉన్నను వారిపట్ల దేవుని మారని ప్రేమ. ఆయన ప్రజలను తిరిగి ఆయన యొద్దకు తీసుకురావాలని దేవుడు ఎల్లప్పుడు ఆశించుచున్నాడు. ఆయన వారిని శిక్షించును కాని శిక్ష పూర్తైన తరువాత వారిని తన యొద్దకు తీసుకురావాలని కోరుకొనును.

సంఘములో కూడా నిజమైన ప్రవచనాత్మక పరిచర్య ఇలాగే పనిచేయాలి. పాత నిబంధన ప్రవక్తలు దేవుని ప్రజల మధ్య పరిశుద్ధత కొరకు కలిగియున్న భారమునే ఈ రోజున సంఘములో ఒక నిజమైన ప్రవక్త కలిగియుంటాడు. అతడు వారివలెనే దిగజారిపోయిన ఆయన ప్రజలను తిరిగి ఆయన యొద్దకు మరియు నిజమైన పరిశుద్ధలోనికి తీసుకురావాలనే దేవుని మారని దీర్ఘశాంతము మరియు కనికరముతో కూడిన ప్రేమచేత కదిలింపబడతాడు. ఒక సంఘము సజీవముగా ఉండి దేవుని కొరకు పనిచేయవలసిన విధముగా పనిచేయాలంటే దానిలో ప్రవచనాత్మక పరిచర్య ఉండవలెను.

దేవుడు నీ హృదయములో పెట్టిన భారమే నీ యెడల దేవునికున్న పరిచర్య గురించి సూచించును కాబట్టి ఆయనలోనుండి భారము పొందుటకు కనిపెట్టుము. నీవు భారము లేకుండా ప్రభువుకు పరిచర్య చేసినట్లయితే, కొద్దికాలము తరువాత విసుగు కలిగి మరియు చివరకు డబ్బును మనుష్యుల ఘనతను లేక ఇహలోక సుఖమును కోరెదరు. ఈనాడు ప్రభువును సేవించుచున్నాము అని చెప్పువారు అనేకులు వారి పరిచర్య విషయమై దేవుని యొద్ద నుండి భారము పొందక పోవుట దురదృష్టకరము.

దేవుడు ఒక వ్యక్తికి పిల్లల మధ్యపరిచర్య చేయుటకు మరియు మరొకరికి సువార్త ప్రకటించుటకును భారము నిచ్చును. మరొకరికి దేవుని ప్రజలకు బోధించుటకును భారమునిచ్చును. క్రీస్తుయొక్క శరీరములో ఉన్న అనేకమందికి దేవుడు అనేక భారములు ఇచ్చును. మనము వేరొకరి పరిచర్యను అనుకరించకూడదు లేక అతని యొక్క భారమును కలిగియుండుటకు ప్రయత్నించకూడదు. నీకున్న భారమును వేరేవారు కలిగియుండాలి అని బలవంతపెట్టకూడదు. మరియు వేరొకరి భారమును నీకు ఇచ్చుటకు నీవు అనుమతించకూడదు. దేవుడు నీకొరకు ప్రణాళిక వేసిన పరిచర్యను చేయుటకు దేవుని యొద్దనుండి భారము పొందవలెను.

మనము దేవుని హృదయముతో ఎంత సహవాసములోకి వస్తామో అంతగా ఆయన భారాన్ని మనము పంచుకుంటాము. దేవుడు నిన్ను ఒక సువార్తికునిగా ఉండుటకు పిలచినట్లయితే ఆయన నీకు నశించుచున్న ఆత్మల కొరకు కనికరాన్నిస్తాడు. దేవుడు నిన్ను ఒక బోధకునిగా ఉండుటకు పిలచినట్లయితే గ్రుడ్డివారైన మోసపోయిన విశ్వాసుల కొరకు జయజీవితములోకి ప్రవేశించని విశ్వాసులకొరకు కనికరాన్నిస్తాడు. మనము మన పరిచర్యను ప్రభావంతముగా నెరవేర్చవలెనంటే దేవుని హృదయముతో సహవాసము కలిగి ఆయనకున్న కనికరాన్ని పంచుకోవడం అతిముఖ్యము.

అనేకులు వారు చేసే సువార్త పరిచర్యను చేయమని నన్ను కోరియున్నారు. కాని నేను ఎల్లప్పుడు వాటిని విసర్జించాను. దేవుడు ఇతరులకు ఇచ్చిన భారమును నేను కలిగియుండాలి అనుకొనుటలేదు. దేవుడు నాకు ఒక ప్రత్యేక భారమును ఇచ్చియున్నాడు మరియు ఆ పరిచర్యను మాత్రమే చేయవలెనని నేను నిర్ణయించుకొనియున్నాను. దేవుడు వారికి అనుగ్రహించిన భారము నుండియు మరియు పరిచర్యనుండియు తొలగిపోవుటకు వారు ఎవరిని అనుమతించలేదు.

నీకు ఎటువంటి భారము లేనియెడల, నీవు దేవుని యొద్దకు వెళ్ళి మరియు భారము నిమ్మని ప్రార్థించాలి. క్రీస్తుయొక్క శరీరములో నీకొక ప్రత్యేకమైన పరిచర్యయున్నది మరియు నీవు దానిని తెలుసుకోవాలి.

అనేకమంది బోధకులు ఒక పరిచర్యనుండి మరొక పరిచర్యకు వెళ్ళెదరు. ఎందుకనగా వారికి ఎక్కువ జీతమిచ్చే క్రైస్తవ సంస్థలలో చేరెదరు. ఉదాహరణకు వారు రేడియో పరిచర్యను ఆరంభించెదరు కాని చిన్నపిల్లలమధ్య సువార్త చేయుటకు ఒక సంస్థవారు ఎక్కువ జీతము ఇచ్చినయెడల వెంటనే వారు పిల్లలు సువార్తకొరకు భారమును కలుగజేసుకొందురు. తరువాత క్రైస్తవ పుస్తక పరిచర్యవారు ఎక్కువ జీతము ఇచ్చినయెడల వెంటనే వారు ఆ పరిచర్యలోనికి వెళ్ళెదరు. అటువంటి బోధకులు ప్రభువుని సేవించుట లేదు అటువంటి వారు మతానుసారులై బబులోను సంబంధమైన వ్యాపారము చేయుదురు.

దేవుడు నీకొక భారము ఇచ్చినయెడల వేరే సంస్థవారు ఎక్కువ జీతమును సదుపాయమును ఇచ్చినప్పటికిని నీకు వచ్చిన ఆ పరిచర్యను విడిచిపెట్టెదవు.