WFTW Body: 

1. మన శరీరేచ్ఛలన్నింటిని జయించుటకు

2. ప్రతి పరీక్షలోను ఆయన సంకల్పం మనలో నెరవేరుటకు

3. ప్రతి పరిస్థితిలోను జయించువారిగా ఉండుటకు

4. కీడంతటి యెదుట క్రీస్తు గుణలక్షణములను వ్యక్తపరచుటకు

దేవుడు ఎల్లప్పుడు మనకు సహాయం చేస్తాడని మనం ఎప్పుడూ ప్రభువునందు నమ్మిక ఉంచాలి. అప్పుడు మనం ఎన్నడూ నిరాశచెందము.

మన కొరకు అద్భుతములు చేసే ప్రేమాస్వరూపియైన తండ్రి మనకున్నాడని అవిశ్వాసుల యెదుట మరియు రాజీపడుచున్న క్రైస్తవుల యెదుట మనం సజీవసాక్ష్యముగా ఉండవలెను. దేవునికి నీ యెడల ఒక ప్రణాళిక ఉన్నది. ప్రతిరోజు నీవు ఆయనను ఘనపరిచేకొలది, ఆ ప్రణాళికను నీవు కనుగొనగలవు. వాటి సమయం వచ్చినప్పుడు సహవాసం, ఉద్యోగం, ఇళ్ళు, వివాహ విషయాలలో ఆయన సరియైన ద్వారం తెరచును. కాలేజీలో ఎటువంటి గ్రేడ్ వచ్చినను, పలుకుబడిగాని ఆర్థిక వనరులుగాని లేనప్పటికిని మరియు ఏ దేశములో ఎటువంటి మాంద్యము(recession) ఉన్నప్పటికిని దేవుని ఘనపరచు వారు ప్రతి విషయంలో శ్రేష్ఠమైన దాన్ని పొందుతారు.

టీనేజర్లు, 20 సంవత్సరాల వయస్సు ఉన్న అనేక మందిలో మూఢత్వం ఎక్కువగా ఉంటుంది. జీవితాంతం బాధపడవలసిన పరిస్థితులను కలుగజేసే తీవ్రమైన పొరపాట్లనుండి దేవుని కృప మాత్రమే నిన్ను కాపాడగలదు. కాబట్టి అన్ని సమయములలో దేవునియెడల భయభక్తులు కలిగియుండి జాగ్రత్తగా ఉండవలెను.

నీ జీవితంలో దేవుని ప్రణాళికను పోగొట్టుకొనవద్దు. 19.5 సంవత్సరాల వయస్సులో నన్ను నేను సంపూర్ణముగా ప్రభువుకు సమర్పించుకొన్నాను. అనేక సంవత్సరాల తరువాత ఇప్పుడు నేను వెనుకకు తిరిగి చూసుకొంటే, 'నా దృష్టిలో మంచివి' అనుకొనిన వాటిని చేసియుండిన దానికంటే ఎంతో ఎక్కువగా శ్రేష్ఠమైన విధముగా దేవుడు చేసినందుకు నేను సంతోషించుచున్నాను. అనగా నేను ఎప్పుడైనను పాపము చేయలేదనిగాని లేక బుద్ధిహీనమైన పనులు నేను చేయలేదనిగాని లేక ఈ సంవత్సరాలన్నింటిలో నేను పొరపాట్లు చేయలేదనిగాని కాదు. వీటన్నింటిని నేను చేశాను. వెనకకు తిరిగి చూసినప్పుడు, నేను చేసిన బుద్ధిహీనమైన పనులను బట్టి, పొరపాట్లను బట్టి నేను సిగ్గుపడుతున్నాను. కాని దేవుడు నా యెడల కనికరము చూపించి వాటన్నింటిని తీసివేసి, నన్ను నడిపించాడు. నేను అనేక తప్పులు చేసినప్పటికి, ఆయన చిత్తమును మాత్రమే చేయవలెనని కోరుకున్నానని ఆయన చూచాడని తలంచుచున్నాను. వారు అనేక పొరపాట్లు చేసినప్పటికి, ఆయనను పూర్ణహృదయముతో వెదకేవారికి ఆయన ఫలమిచ్చును. అవే కృపాక్షేమములు నీ జీవితకాలమంతయు నిన్ను వెంబడించునని నేను నమ్ముచున్నాను (కీర్తన 23:6).

నీవు ఆయనను ఘనపరచవలెనని కోరినయెడల, 'ప్రేమతో ఆయన నీ గురించి సమస్తమును ప్రణాళిక వేయుచున్నాడు' (జెఫన్యా 3:17 వివరణ) గనుక అనేక సంతోషకరమైన విషయములు నీకొరకు వేచియున్నవి. ఆత్మసంబంధమైన మరియు భూలోక సంబంధమైన నీ భవిష్యత్తును గూర్చిన ప్రతి విషయము అందులో ఉన్నది. నీవు ప్రతిరోజు దేవుణ్ణి ఘనపరచవలెనని నిర్ణయించుకొనినయెడల, దేవుని అతి శ్రేష్ఠమైన దానిని పొందెదవు. లోకస్థుల వలె మనం భవిష్యత్తును గూర్చి ప్రణాళిక వేసుకొనము. దేవుడు మన పక్షముగా పనిచేయుచూ మనం అర్హులము కానివాటిని మనకు అనుగ్రహించును. ఉద్యోగంవంటి భూసంబంధమైన విషయాలను కూడా ఆయన అనుగ్రహించును. కాబట్టి భవిష్యత్తును గూర్చి మనం కొంచెం కూడా చింతించము. యేసుప్రభువు చెప్పినట్లు, ఆకాశమందున్న పక్షులవలె చింతలు ఉద్రిక్తలు లేక ఏరోజుకు ఆరోజు జీవించెదము. దేవునికి స్తోత్రం.

సంతోషంగా తనయొక్క పరిచర్యను ముగించుటయే తప్ప తన జీవితము విలువైనదని పౌలు ఎంచుకొనలేదు (అపొ.కా. 20:24). తల్లితండ్రులు తమ చిన్నబిడ్డను స్కూలులో చేర్చినప్పుడు, ఆ స్కూలు విద్యను అతడు ముగించే రోజు కొరకు ఎదురుచూచుదురు. దేవుడు కూడా అదే విధముగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఒక ప్రణాళిక కలిగియున్నాడు. దేవుడు మన కొరకు నిర్ణయించిన సంకల్పమును ఈ భూమిమీద మనం నెరవేర్చాలి. మన జీవితములలో అనేక పొరపాట్లను తప్పులను చేయుచు బుద్ధిహీనముగా మన సమయమును వృథాచేసుకొందుము. కాని స్కూలులో లెక్కలలో అనేక తప్పులు చేసినట్లే ఇవి కూడా ఉన్నవి గనుక దేవునికి వందనాలు. మన జీవితములలోని ముఖ్యవిషయములలో అనగా ఉద్యోగం, వివాహం మొదలగు వాటిలో దేవునికి పరిపూర్ణమైన ప్రణాళిక కలదు. కాని ఇవన్నియు పరిశుద్ధత విషయంలో ఆయన చిత్తమును నెరవేర్చవలెనని మనం కోరినప్పుడు మాత్రమే నెరవేరును. మనం పూర్ణ హృదయంతో దేవుని పరిశుద్ధతను అనుసరిస్తే, మన జీవితములో భూసంబంధమైన విషయములన్నిటిలో ఆయన చిత్తము నెరవేరునట్లు దేవుడు చేయును.