వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

మన జీవితములో దేవుడు అనుమతించే ప్రతి విషయములో దేవునికి ఒక మహిమకరమైన ఉద్దేశ్యము కలదని మనము చూసినప్పుడు మన జీవితము అద్భుతమైనదిగా మారుతుంది. మన ప్రార్థనకు "కాదు" అని ఆయన జవాబు ఇచ్చినప్పటికిని అది కూడా పరిపూర్ణముగా ప్రేమించే హృదయమునుండి వచ్చినదే.

"నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్ధేశ్యములే గాని హానికరమైన ఉద్దేశములు కావు; ఇదే యెహోవా వాక్కు." (యిర్మియా 29:11). మనము దేవుని వైపు తిరుగునట్లు ఆయన ఈ లోకములో రోగములను, బాధలను మరియు విషపూరితమైన పాములను మొదలగు వాటిని ఉండనిచ్చి ఈ లోకము మనకు అనననుకూలముగా ఉండునట్లు దేవుడు అనుమతించాడు. సాతాను చేసే కీడును కూడా దేవుని ఉద్దేశ్యములు మనలో నెరవేరునట్లు దేవుడు ఉపయోగిస్తాడు. మనము నిత్యత్వములోనికి వెళ్ళి అక్కడ అనేక సాక్షములు వినినట్లయితే దేవుడు వారి జీవితములొ పాముకాటులను ఆర్థిక ఇబ్బందులు క్యాన్సర్లు మొదలగు వాటి ద్వారా ప్రజలు పాపమునుండి వెరై ఆయన స్వభావములో పాలివారమగునట్లు శ్రమలద్వారా ఆయన బిడ్డలను ఏ విధముగా పవిత్రపరిచాడో తెలుసుకుంటాము. ఈ భూలోకములో అర్థముకాని అనేక విషయములు, ఆ దినమున తెలుసుకొని దేవునికి దేవునికి వందనములు చెల్లిస్తాము. కాని విశ్వాసముగల వ్యక్తి ఆ దినము వరకు వేచియుండనక్కరలేదు. దేవుని యొక్క జ్ఞానమును మరియు ఆయన యొక్క ప్రేమను అతడు ఇప్పుడే విశ్వసించుచున్నాడు - కాబట్టి సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట ఆరంభిచాడు. దేవునియొక్క స్వభావములో మనము పాలివారము కావడమే అంతిమ ప్రయోజనంగా దేవుడు మనతో వ్యవహరిస్తున్నాడు. మనము క్రీస్తు సారూప్యములోనికి రుపాంతరము పొందునట్లు అనగా మన మేలుకొరకే దేవుడు అన్ని విషయములను జరిగించుచున్నాడు.

దేవుని సంకల్పము చొప్పున పిలవబడిన వారికిని మరియు దేవుని ప్రేమించు వారికిని సమస్తము సమకూడి జరుగునట్లు దేవుడు చేయుచున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారుప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను (రోమా 8:28, 29).

మనము ధనమును పొగొట్టుకొనునట్లును లేక భయభక్తులు లేని వారి ద్వారా మోసపోవునట్లును కొన్నిసార్లు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు. మనలో అనేకమంది రైళ్ళలోగాని బస్సులలో గాని వెళ్ళుచున్నప్పుడు వారి జేబులో ఉన్న ధనము కోల్పోయారు. అటువంటి పరిస్థితులలో దొంగ కొరకును లేక మోసము చేసిన వారికొరకు ప్రార్థించాలని నేను నిర్ణయించుకున్నాను. అది మాత్రమే కాకుండా ధనము విషయములోను మరియు వస్తు వాహన విషయములోను మనకున్నటువంటి మితిమీరిన సంబంధాన్ని తీసివేయాలని దేవుడు కోరుచున్నాడు. మనము తీవ్రముగా లెక్కించువారుగా ఉండి, పొగొట్టుకొనిన ప్రతిరూపాయి కొరకు బాధపడి మరియు సంపాదించిన ప్రతి రూపాయి విషయములో సంతోషించాలని దేవుడు కోరుటలేదు. మనము వస్తువాహానాలు సంపాదించికొన్నప్పుడు ఎక్కువవుతూ లేక వాటిని పోగొట్టుకున్నప్పుడు తగ్గిపోతూ ఉండే సంతోషాన్ని కాకుండా, ఆయనలోనే మన సంతోషాన్ని కనుగొనాలని ఆయన కోరుచున్నాడు.

భూమిమీద ప్రభువైనయేసు ఆవిధముగా నడుచుకున్నారు మరియు మనము కూడా ఆయనవలె నడుచుకొనుటకు పిలవబడ్డాము. "క్రీస్తుయేసుకు కలిగిన వైకరిని మీరునూ కలిగియుండుడని" బైబిలు చెప్పుచున్నది (ఫిలిప్పు 2:5). తన పరిచర్యకొరకు కృతజ్ఞతతో ఎవరైనా పదివేల దినారములు ఆయనకు ఇచ్చిన యెడల అది ఆయన సంతోషమును కొంచెమైనా ఎక్కువచేయదు. ఆయన యొక్క తండ్రిలో ఆయన సంతోషము పరిపూర్ణమైయుండి మరియు అది ప్రవహించుచున్నది. అదేసమయములో ఆయన ఎదైనా వస్తువు పోగొట్టుకొనినప్పుడు ప్రభువుయొక్క సంతోషము తగ్గలేదు. ప్రభువైన యేసుకు కానుక రుపము వచ్చిన సొమ్మును ఇస్కరియోతు యూదా దొంగతనము చేయుచూ వచ్చుచుండెను. ప్రభువైనయేసుకు ఆవిషయము తెలియును మరియు ఆయన యూదా విషయములో చింతించినప్పటికిని ఆ సొమ్ము పోయినందుకు ఆయన ఒక్కసారి కూడా నిరాశపడలేదు.

నీవు నిజముగా ప్రభువైనయేసు జీవమును పొందుకొని దానిలో పాలివాడవైయుండాలని కోరినట్లయితే, నిన్ను వస్తువాహానాల ప్రేమనుండియు, మనుష్యులయెదుట ఘనతకోరుటనుండియు, నీ మీద నీవు జాలిపడుటనుండియు మరియు క్రీస్తువైకరికి విరోధమైన వాటన్నిటినుండియు విడిపించుటకును దేవుడు నీ జీవితములో అనేక విషయములను అనుమతించును. నీవు కోరనట్లయితే దేవుడు నిన్ను బలవంతము చేయడు. నీవు ఇప్పుడు ఉన్న ఆత్మీయ స్థితిలోనే ఉండుటకు మరియు అనేకమంది విశ్వాసులవలె నీవు ఓడిపోయిన జీవితముతో నీవు తృప్తిపడినట్లయితే దేవుడు ఆవిధముగానే ఉండనిస్తాడు. కాని దేవుడు నీలో చేయవలెనని కోరిన అతిశ్రేష్ఠమైన దానికొరకు నీవు దాహము గొనివున్నట్లయితే ఆయన నీ విషయములో కఠినముగా వ్యవహరించి నిన్ను పాడుచేయుచూ నాశనము చేయుచున్న విగ్రహములు అనే క్యాన్సర్లను ఆయన నీలోనుండి తీసివేయును. నీవు ఎప్పటికీ చలించకుండునట్లు దేవుడు నీ జీవితములో బాధను, నిరాశను, నష్టమును, అవమానమును, అన్యాయముగా తీర్పుతీర్చబడుటను, నెరవేరని కోరికలను మొదలగువాటిని దేవుడు అనుమతిస్తాడు.

అప్పుడు నీవు ధనవంతుడవైనను లేక బీదవాడవైనను నిన్ను విమర్శించినను లేక పొగడినను ఘనపరిచినను అవమాన పరిచినను నీవు ఒకే రీతిగా ఉండగలవు. ఈ లోక సంగతులు అన్నిటి విషయములో నీవు క్రీస్తుతో కూడా మరణించి ఈ లోకములో రాజువలె జీవించునట్లు నీవు యేసుయొక్క జీవములో పాలివాడవు అయ్యావు. "యేసుయొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మన శరీరమందు ఎల్లప్పుడునూ వహించుకొనిపొవుచున్నాము" (2కొరంథీ 4:10). స్వజీవానికి పూర్తిగా చనిపోయి వెలచెల్లించువారు కొంతమందే ఉన్నారు గనుక వారు మాత్రమే క్రీస్తుయొక్క సమృద్ధి జీవాన్ని అనుభవిస్తారు. మనము స్వయానికి మరణించనట్లయితే విశ్వాసమూలముగా జీవించలేము క్రీస్తుతో కూడా సిలువవేయబడుటకు మనము ఇష్టపడనియెడల దేవుడు మనలను పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు అను విషయము మనకు కేవలము వేదాంతము అయివుంది. లోకసంబంధమైన అంతటిని మనము విసర్జించనియెడల మనము యేసు ప్రభుయొక్క శిష్యులము కాలేము. యేసుప్రభు ఇలా చెప్పారు, "మీలో తనకు కలిగినదంతయు వెడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు (లూకా 14:33)".

"నేను నీలోను మరియు నీవు నాలోను ఉన్నామనియు వారు ఐక్యతలో సంపూర్ణులగునట్లు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివిఅనియు లోకము తెలుసుకొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని" అని యోహాను 17:23లో చదువుతాము. లోకము కొరకు గాని లేక శరీరసంబంధమైన క్రైస్తవుల కొరకు కాని యేసుప్రభువు ప్రార్థించుటలేదు. ఆయనను వెంబడించుటకొరకు సమస్తము విడిచిపెట్టిన 11 మంది శిష్యుల కొరకు ప్రార్థించాడు. లోకస్తులకును మరియు నామకార్థ క్రైస్తవులకును తెలియని తండ్రి యొక్క ప్రేమను వారు తెలుసుకొని దానిలో భద్రత కలిగియుందురు. ఒక క్రైస్తవుడు నామకార్థ క్రైస్తవుడుగా ఎందుకు ఉండును? ఎందుకనగా వారు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొనకుండానే "రెండు లోకములలో ఉన్న శ్రేష్ఠమైన వాటిని(వారు చెప్పునట్లుగా)" పొందుటకు ప్రయత్నించుట ద్వారా వారు ఆనందించెదరని అపవాది వారిని మోసపరచాడు. వారు చెప్పుచున్న రీతిగా ఆ విధముగా వారు సంతోషముగా ఉండవచ్చునని అపవాది వాటిని మోసగించాడు. ఇది మోసకరము. దేవుని పరిపూర్ణమైన ప్రేమను విశ్వసించిన యెడల సమస్తమును సంతోషముతో విడిచిపెట్టెదము. అప్పుడు చింతించుటనుండి పూర్తిగా విడుదల పొందెదము. పిలిప్పు 4:6, 7ఇట్లు ఆజ్ఞాపించుచున్నది "దేనిని గూర్చియు చింతింపకుడి కాని ప్రార్థన విజ్ఞాపములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదములకును మీ తలంపులకును కావలియుండును".