WFTW Body: 

మనము పరలోకము వెళ్ళినప్పుడు భూమిమీద మనము చేసిన ప్రయాణములన్నిటిలో దూతలు మనలను ఏవిధముగా కాపాడారో చూచెదము. అంత్యదినమందు మన జీవితమంతయు వీడియో టేపులో చూచినప్పుడు, కొన్ని వేలమంది దూతలు మనకు సహాయం చేశారని కృతజ్ఞతలు చెప్పెదము. ఇప్పుడు కొన్ని రోడ్డు ప్రమాదములనుండి కాపాడబడియున్నామని మనకు తెలుసును. కాని ఆ రోజున అటువంటి ఎన్నో ప్రమాదములనుండి రక్షింపబడియున్నామని కనుగొనెదము. కాబట్టి కృతజ్ఞత కలిగియుండుము.

మన మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ప్రమాదము జరిగినప్పుడు నేను ఇట్లు అన్నాను, "ప్రభువా, సిలువ మీద నీవు నాకు చేసిన దానంతటి కొరకు నేను పూర్తిగా కృతజ్ఞతలు చెల్లించలేదు. కాబట్టి నేను కృతజ్ఞతలు చెల్లించుటకు మరికొంత సమయము దయచేయుము". అప్పుడు నేను ఈ మాటను గూర్చి ఆలోచించితిని, "ప్రభువు మనకొరకు సిలువ మీద చేసిన దానికొరకు, మన జీవితములు ఎల్లప్పుడు ప్రభువుకు కృతజ్ఞత వ్యక్తపరచేవిగా ఉండాలి".

ప్రతి విషయములో దేవునికి ఒక సంకల్పం ఉన్నది. యాకోబు గురించి ఈ విధముగా చెప్పబడింది, "విశ్వాసమునుబట్టి యాకోబు మరణకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను"(ఆ చేతికఱ్ఱ నిజానికి ఊతకఱ్ఱ, దేవుడు అతని తొడ ఎముక గూటిని కొట్టినందున, ఆ కఱ్ఱ లేకుండా ఇక అతడు నడువలేక పోయాడు) (హెబ్రీ 11:21). బలమైన స్వీయచిత్తం కలిగిన యాకోబుకు ప్రతి విషయము కొరకు నిస్సహాయముగా దేవునిపై ఆధారపడుమని ఆ చేతికఱ్ఱ జ్ఞాపకము చేయుచున్నది. ఆ విధముగా అతడు ఇశ్రాయేలుగా మారెను - అతడు యువరాజుగా దేవుని యెడలను మనుష్యుల యెడలను శక్తి కలిగియున్నాడు. ఆ వచనములో చెప్పినట్లుగా అతడు ఆ బలహీనమైన స్థితికి వచ్చినప్పుడు, ఇతరులకు ఆశీర్వాదముగా మారెను. మీరు కూడా అటువంటి అనుభవము కొంత పొందుకోవాలని ప్రార్థింస్తున్నాను- మీ మానవబలము విరగగొట్టబడి, దేవుని మీద మాత్రమే మీరు ఆధారపడినప్పుడు, మీరు అనేకులకు ఎన్నడూ లేనంత గొప్ప ఆశీర్వాదంగా ఉండెదరు. అటువంటి అనుభవము లేనట్లయితే ఆశీర్వాదముగా ఉండరు.

దేవుడు మన జీవితములో ప్రతి విషయమును గూర్చి ప్రణాళిక వేసియున్నాడు. సాతాను యేసు మీద దాడిచేయునట్లు అనుమతించినట్లే, సాతాను మీమీద కూడ దాడి చేయునట్లు దేవుడు అనుమతించును. కాని యేసు తన ఆత్మను పరిశుద్ధముగా ఉంచుకున్నట్లే, మీరు కూడా మీ ఆత్మను పరిశుద్ధముగా ఉంచుకోవచ్చు. "మీకు జరుగుతున్నదంతయు దేవుడికి తెలియును" (యోబు 23:10 ఆంగ్ల లివింగ్ బైబిల్). మీరు క్లిష్ట పరిస్థితులలో వెళ్ళుచున్నప్పటికిని ఆయన ప్రతి విషయమును గూర్చి ప్రణాళిక వేయును (రోమా 8:28). కాబట్టి దానిలో ఆదరణ పొందుడి. మానవుల యొక్క సహాయము వ్యర్థమని మీరు కనుగొని, దేవుని మీద మాత్రమే ఆధారపడే అనుభవము కలిగియుండుట ఎంతో మంచిది. ఆ విధముగా మాత్రమే ఆత్మీయముగా వృద్ధి పొందెదము. సి.టి.స్టడ్ ఒకసారి ఈ విధముగా చెప్పాడు, "నేను దేవునియొక్క అద్భుతములు చూడగలుగునట్లు కష్ట పరిస్థితులను ప్రేమించుచున్నాను".

దేవుడు మనలను ఏర్పరచుకొని యున్నాడని, దేవుని కుమారుడు తన రక్తము ద్వారా మనలను కొనియున్నాడని, పరిశుద్ధాత్ముడు దేవుని సొత్తుగా మనను ముద్రించియున్నాడని గుర్తించినప్పుడు మనకు గొప్ప విడుదల కలుగుతుంది (ఎఫెసీ 1:1-13). దేవుని కృపద్వారా మాత్రమే మనము రక్షణ పొందియున్నాము. మనము "అవును" అని చెప్పేవరకు దేవుడు వేచియుండి ఆ తరువాత సమస్తమును జరిగించియున్నాడు (ఎఫెసీ 2:1-8). మనము కేవలము రోబోలు కాదు గనుక మనము ఆయనను అనుమతించే వరకు ఆయన మనలను రక్షించలేడు.

ఈ ప్రపంచానికి పూనాది వేయకమునుపే, మనము మంచికాని చెడుకాని చేయకమునుపే, క్రీస్తుఆత్మ యొక్క ఆశీర్వాదములతో మనను ఆశీర్వదించుటకు దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు (రోమా 9:12). అందువలన, దానిగురించి ఇప్పుడు ఆయన తన మనస్సు మార్చుకోడు.