WFTW Body: 

ఆత్మీయముగా కొన్ని విషయాలు నేర్పించుటకు మనను కొన్ని కష్టపరిస్థితుల ద్వారా ప్రభువు నడిపించును. ఉదాహరణకు, మన విశ్వాసమును ఎగతాళి చేయువారిని దేవుడు అనుమతించును. మనను ఎగతాళి చెసేవారిలో అనేకులు ఆత్మనూన్యతలో చిక్కుబడి ఉన్నారు కనుక వారు మనమీద అసూయపడెదరు. కాబట్టి మనము వారి మీద జాలి పడవలెను. కాని వారు చేసిన ఎగతాళిని బట్టి మనలో జరిగే మంచి ఏమిటంటే, మనము మనుష్యుల అభిప్రాయమునుండి విడుదల పొందెదము. నా గత జీవితమును చూచినయెడల నేను యౌవనస్తుడుగా ఉన్నప్పుడు నావికదళములో నా విశ్వాసమును ఎగతాళి చేసిరి. మరియు దాని తరువాత జరిగిన విషయములు కూడా మనుష్యులను సంతోషపెట్టుట నుండి నన్ను విడిపించెను. ఆవిధముగా ప్రభువు నన్ను పరిచర్యకొరకు సిద్ధపరచెను.

కుటుంబముగా మనము ఎదుర్కొన్న ప్రతీ పరీక్షలో విజయం సాధించడానికి కావలసిన కృపను అనుగ్రహించినందుకు ప్రభువుకి కృతజ్ఞత కలిగియున్నాను. అనేకమంది మన విషయములో అసూయపడినందున మనలను ఇబ్బంది పెట్టుటకు సాతాను వారిని ప్రేరేపించాడు. కాని మనము దేవునియొక్క కృపద్వారా సాతానును జయించి మరియు మన గురించి చెడుగా మాట్లాడి మరియు కీడు చేయవలెనని కోరినవారి యెడల మంచి వైఖరిని కలిగి ఉన్నాము. ఒక్కరు కూడా కీడు చేయలేకపోయిరి. రోమా 8:28లో వాగ్ధానం చేసిన ప్రకారము, సమస్తము సమకూడి మన మేలు కొరకే జరిగినవి.

ఇతరులు మన గురించి చెడ్డ మాటలు చెప్పినప్పుడు మనము చెడ్డవారము కాలేము మరియు మన గురించి మంచి విషయములు చెప్పినప్పుడు మనము మంచివారము కాలేము. మనము ఏమి అవుదుమో మన నిర్ణయాలలోనే ఉంటుంది - ఇతరులు మన గురించి ఏమి చేసినను లేక ఏమి చెప్పినను ప్రతి దినము మన సిలువనెత్తుకొని ప్రభువైన యేసును వెంబడించుచూ మరియు ఆయన వలె మనము స్పందించిన యెడల మనము ఆయన వలె అగుదుము.

ఇప్పుడు మనము పూర్ణహృదయముతో దేవుని వెంబడించాలని నిర్ణయించుకొనిన యెడల, అనేకమైన గొప్పవైన మన పొరపాట్లు మరియు ఓటములు దేవుని యొక్క సంకల్పం మన జీవితములో నెరవేర్చబడకుండా ఆపలేవు.

నేను క్రొత్తగా జన్మించిన తరువాత అనేకసార్లు ప్రభువుని బాధించితిని. కాని 1975వ సంవత్సరములో నాకు 36 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు, మన ఇంటిలో సంఘముగా కలుసుకొనుట ఆరంభించినప్పుడు, నావలె ప్రభువుని బాధించని వారి కంటే ఎక్కువగా పూర్ణహృదయముతో ఉండవలెనని నిర్ణయించుకున్నాను. ఈనాడు అనేక సంవత్సరముల తరువాత దేవుడు నాకు ఎంతో ఎంతో ఎక్కువగా కృపను అనుగ్రహించుట ద్వారా నేను తీసుకొనిన నిర్ణయము ఘనపరిచెను. కాబట్టి ఏ నేరము చేయనివారిని గాని లేక ఎప్పుడైననూ పడిపోని వారిని గాని లేక ఓడిపోనివారిని గాని దేవుడు ఏర్పరచుకోడని నా వ్యక్తిగత అనుభవము ద్వారా తెలుసుకొన్నాను. నిజానికి, ఎక్కువగా ఓడిపోయిన వారినే దేవుడు ఎక్కువగా వాడుకొనును. మన సంఘమునకు వచ్చే అత్యంత ఘోర పాపుల విషయంలో కూడా ఇదే నాకు గొప్ప నిరీక్షణను కలిగించింది.

తన బిడ్డ చనిపోయినప్పుడు, షూనేమీయురాలైన స్త్రీని ఎలీషా - నీవును నీ బిడ్డను బాగున్నారా అని అడిగినప్పుడు, 'బాగున్నామని' ఆమె చెప్పింది (2రాజులు 4:8,26). ఎంత అద్భుతమైన విశ్వాసముతో ఆమె ఆవిధంగా చెప్పింది. తన బిడ్డను తిరిగిలేపుట ద్వారా దేవుడు ఆమె విశ్వాసమును ఘనపరిచాడు. ఆయనను నమ్మిన వారికి ఆయన ఎన్నో అద్భుతకార్యాలు చేయును. ఎటువంటి పరిస్థితులలో అయిననూ దేవుడు వారిని సిగ్గుపరచడు. మీరు ఎంతో ఎక్కువగా ఓడిపోయినప్పటికి లేక కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులలో వెళ్ళినప్పటికిని ఎల్లప్పుడు దేవునియందు అటువంటి విశ్వాసముతో జీవించెదరు గాక.

ఎటువంటి చనిపోయిన పరిస్థితిలో అయినా ప్రభువు పునరుత్థానము తేగలడని గుర్తుంచుకొనుము. యథార్థముగా ఉండుట ఒక్కటే మీరు చేయవలసినది. ఏ మనిషికి మీ పాపాలు ఒప్పుకొననవసరము లేదు. కాని ప్రభువు యెదుట యథార్థముగా ఉండవలెను.