WFTW Body: 

గోధమల వలె పేతురును జల్లించుటకు దేవుని అనుమతిని సాతాను కోరెను. జల్లింపబడని ఇతరుల కంటే దేవుడు పేతురు యెడల అత్యంత ప్రాముఖ్యమైన పరిచర్య కలిగియున్నందున దేవుడు సాతానును అనుమతించెను. పేతురు నమ్మిక తప్పిపోకుండా మాత్రమే ప్రభువు ప్రార్థించారు. పేతురు ప్రభువుని ఎరుగనని మూడుసార్లు బొంకియున్నాడు. దాని ఫలితంగా అతడు ఎంతో విరుగగొట్టబడి దీనుడై పశ్చాత్తాపడి మారుమనస్సు పొందాడు. ఆవిధంగా అతడిలో గర్వం అనే పొట్టు తీసివేయబడి అతనిలో దేవుని సంకల్పం నెరవేర్చబడింది. దానికోసం దేవుడు సాతానును ఉపయోగించాడు. ఆ కారణం బట్టియే దేవుడు సాతానును నాశనం చేయలేదు. దేవునికి స్తోత్రం.

పునరుత్థానం తరువాత, దేవుడు ఒక దూత ద్వారా ఒక సమాధి యొద్ద నుండి ఒక ప్రత్యేకమైన వర్తమానం పంపెను, "మీరు వెళ్ళి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని.. ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను" (మార్కు 16:7). ఇక్కడ "పేతురుతోను" అనే మాట గమనించదగినది. పేతురు కూడా శిష్యుడే కదా, ప్రభువు అతని పేరుని ఎందుకు ప్రత్యేకంగా చెప్పాడు? ఎందుకనగా అతని ఘోర పరాజయమును బట్టి, 'ఆయన శిష్యులలో' ఇక ఎంతమాత్రము తాను ఒకడిని కాదని అతడు అనుకుంటు ఉండవచ్చు. అతని పేరును చెప్పుట ద్వారా, ప్రభువు తనను ఇంకా తన అపొస్తలునిగానే చూచుచున్నానని చెప్తున్నాడు.

కాని ఆ వర్తమానం వచ్చినప్పటికి, పేతురు ఎంతో నిరాశపడుట వలన తన పాత వృత్తి అయిన చేపలు పట్టుటకు తిరిగి వెళ్ళుటకు నిర్ణయించుకొన్నాడు (యోహాను 21:3). కాబట్టి ప్రభువు అతని యొద్దకు వ్యక్తిగతంగా వెళ్ళి, పేతురును అపొస్తలునిగా పిలిచియున్నాడు. ప్రభువు ప్రేమ అటువంటిది. ఆయన మన వెనక వస్తూనే ఉంటాడు. ఆవిధంగా పేతురు మరల వెనుకకు వచ్చాడు మరియు అతని 'నమ్మిక తప్పిపోలేదు'. అంటే పేతురు ఓడిపోలేదని గాని లేక పొరపాటు చేయలేదని గాని కాదు.

దేవుడు ప్రేమైయున్నాడు కాబట్టి మనం నిజంగా క్రొత్తగా జన్మించి మరియు యేసుప్రభువుకి శిష్యులమైన యెడల, దేవుడు క్రీస్తులో మనలను అంగీకరించియున్నాడని, షరతులు లేని ప్రేమతో ప్రేమించుచున్నాడని నమ్మవలెను. రెండు రకాల విశ్వాసులు ఉన్నారు:

1. షరతులులేని ప్రేమతో వారి పరలోకపు తండ్రి ప్రేమించుచున్నాడని నమ్మే విశ్వాసులు.

2. షరతులు గల ప్రేమతో వారి పరలోకపుతండ్రి ప్రేమించుచున్నాడని నమ్మే విశ్వాసులు.

మొదటి రకానికి చెందిన వారు సత్యమును నమ్ముట వలన విశ్రాంతిలో ఉండెదరు. మిగిలిన వారు దేవుని చేత ప్రేమించబడుటకు తగిన విధంగా జీవించవలెననే ఉద్దేశ్యంతో నిరంతరం అవిశ్రాంతిలో ఉందురు. దేవుని ప్రేమ షరతులతో కూడినదని, మన పనితీరుపై అధారపడుతుందని- మనం మంచిగా ప్రవర్తించినప్పుడు మాత్రమే దేవుడు మనలను ప్రేమించునని ఈలోకంలో తప్పుడు మతములు బోధించుచున్నవి. కాని ప్రభువు వచ్చి దానికి వ్యతిరేకంగా బోధించెను. అయినప్పటికీ అనేక మంది విశ్వాసులు అన్యులవలె ఆలోచించెదరు. సాతాను అబద్ధమును మనం తప్పక బహిర్గతం చేయాలి ఎందుకనగా దేవుడు, తన పిల్లలను షరతులులేని ప్రేమతో ప్రేమించుచున్నాడనేది సత్యం. అయితే మనం ఆ ప్రేమను సంపూర్ణంగా తృణీకరించి దేవునికి దూరంగా వెళ్ళి నశించవచ్చు. కాని ఆయన బిడ్డల విషయంలో ఆయన ప్రేమ షరతులు లేనిదై ఉండును. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో తండ్రి ప్రేమ దీనిని పరిపూర్ణంగా విశదపరచుచున్నది.

దేవుడు అనేక స్థాయిలలో ప్రజలను ప్రేమించుచున్నాడు అనునది నిజమే. దేవుడు లోకస్తులను ఒక స్థాయి వరకు ప్రేమించును (యోహాను 3:16). కాని తిరిగి జన్మించిన బిడ్డలను ఆయన మరి ఎక్కువగా ప్రేమించును. ఆయన తన పిల్లలలో కొందరిని అందరికంటే ఎక్కువగా ప్రేమించును - ఎందుకంటే వారు కొన్ని షరతులు నెరవేర్చారు. ఇది ప్రభువు యోహాను 14:21లో చెప్పెను, "నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను". సమస్తమును విడిచిపెట్టి ప్రభువు శిష్యులైన వారిని దేవుడు వీరందరికంటే ఎక్కువగా ప్రేమించును. దేవుడు యేసును ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించును (యోహాను 17:23).

అయితే దేవుని ప్రేమ షరతులు లేనిది.

దేవుని ప్రేమయొక్క ఒక విశిష్టమైన గుర్తుని లూకా 6:35లో "తిరిగి ఏమి కోరనిది"గా చెప్పబడింది. మానవ ప్రేమ తిరిగి గౌరవాన్ని, ప్రేమను, బహుమతులను కోరును. కాని దైవిక ప్రేమ తిరిగి ఏమి కోరదు. ఆ ప్రేమ తాను ప్రేమించువారి నుండి అంతర్గతంగా ఏమి ఆశించదు. దేవుడు, మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని ఉదయింపచేయుచున్నాడు, చెడ్డవారి యెడల కృతజ్ఞత లేనివారి యెడల దయకలిగి కనికరం చూపిస్తున్నాడు. మనం ఈ దైవిక ప్రేమలో నివసించినప్పుడు మాత్రమే అన్ని విధాల పరిసయ్యతత్వం నుండి రక్షింపబడుదుము.