WFTW Body: 

మన క్రైస్తవ జీవితమును గ్రాఫ్‍గా (రేఖా చిత్రము) గీసిన యెడల తిన్నగా ఉండక పైకి క్రిందకి ఉండును. ప్రతీ ఒక్కడి క్రైస్తవ అనుభవం కూడా ఈ విధముగా ఉండును కాని సంవత్సరము గడిచే కొలది గ్రాఫ్ పైకి వెళ్ళుచుండును. మనం నెమ్మదిగా అనుభవములో పైకి వెళ్ళుచుండవలెను. క్రమక్రమముగా మన ఓటములు తగ్గుచుండవలెను. నెమ్మదిగా పైకి పైకి వెళ్ళుచుండవలెను. కాని కొందరు దేవుని వాగ్దానములు విశ్వసించనందువలన లేక దేవుడియెడల భయభక్తులు లేనందున లేక జయము పొందుటకు ఆసక్తితో వెదకనందున గ్రాఫ్ క్రిందకు వెళ్ళుచుండును.

పాపమును తీవ్రముగా తీసుకొని మరియు పాపములో పడిపోయిన ప్రతిసారి ప్రశ్చాత్తాపపడుము. ఆ విధముగా నీవు దేవునియెడల భయభక్తులు కలిగియున్నావని తెలియును. నేను అనేకసార్లు చెప్పిన రీతిగా మనము పాపములో పడిపోవుటకంటే దాని గూర్చి పశ్చాత్తాప పడుటను తీవ్రముగా తీసుకొనుము. మీరు పాపములో పడిన వెంటనే లేక ఏ విషయములోనైనను దేవుని దుఃఖపరిచిన యెడల వెంటనే మారుమనస్సు పొంది పశ్చాత్తాపపడుటకు మిమ్ములను సవాలు చేసిన యెడల నా బాధ్యత నెరవేర్చినట్లే అగును.

2 రాజులు 4వ అధ్యాయములో ఎలీషా తన యొద్దకు వచ్చిన విధవరాలుతో పొరుగు వారి యొద్దనుండి పాత్రలను తెమ్మని చెప్పి మరియు వాటిలో ఆ నూనెను పోయమని చెప్పెను. ఆ విధముగా ఆమె యొక్క అప్పును తీర్చెను. ఆమె ఆ విధముగా చేసినప్పుడు, పాత్రలన్నియు నిండినవని ఆమె యొక్క కుమారుడు చెప్పెను. అప్పుడు నూనె కూడా ఆగిపోయెను. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవములో చాలామంది ఆ విధముగానే ఉన్నారు. ఆరంభములో వారు నింపబడియున్నారు. కాని కాలముగడిచే కొలది కొంత మందిలో పరిశుద్ధాత్మ యొక్క అవసరతను కలిగియుండుట లేదు. అనగా నింపబడుటకు పాత్రలు లేవు. ఆవిధముగా వారిలోనుండి ఆత్మ ప్రవహించుట ఆగిపోవును. మనము క్రీస్తువలె లేని విషయములు, ఈ ఖాళీ పాత్రలను చూపించుచున్నవి. మన జీవితములో ఆవిధముగా నింపబడవలసిన అనేకవిషయములు ఉన్నవి.

కొన్ని విషయములలో అనగా నీవు పాపముమీద జయముపొందని విషయములలో నీవు పాక్షికముగా నింపబడుటవలన క్రీస్తువలె మార్పు (లేక దేవునిస్వభావములో పాలివారగుట) చెందుటలేదు. ఉదాహరణకు ఒక వ్యక్తిని ద్వేషించకుండా ఉండుటకును మరియు ప్రేమించకుండుటకును తేడా ఉంది. మొదటిది కేవలము పాపమును జయించుట మాత్రమే రెండవది దేవుని స్వభావములో పాలుపొందుట. అదే విధముగా కోపపడకుండుటకును మరియు మృదువుగా మాట్లాడుటకును చాలా తేడా ఉన్నది. మిగతా విషయములలో కూడా ఆవిధముగానే ఉండును. ఒక విషయములో పాపము జయించామని తృప్తిపడినయెడల, అది ఖాళీ పాత్రలు లేవని సూచించుచున్నది. అప్పుడు నూనె ప్రవహించుట ఆగిపోయి మరియు మనము వెనుకకు దిగజారెదము.

మనము ఇతరులను తీర్పుతీర్చక ఎల్లప్పుడు మారుమనస్సు పొందెదము. ఎల్లప్పుడు నింపబడుటకు ఖాళీపాత్రలు ఉండునట్లు మనము చూచుకొనవలెను, అప్పుడు మాత్రమే మనము ఆ విధవరాలువలె అప్పులు తీర్చెదము. రోమా 13:8లో ప్రేమించే విషయములో మనము అందరకు ఋణపడియున్నామని చెప్పబడింది. ఆవిధముగా మనము ఇతరులకు ఆశీర్వాదముగా ఉండెదము. మన స్వయమునుండి విడుదలపొంది మరియు ఇతరులకు ఆశీర్వాదముగా ఉండుటకు దేవుడు ప్రతి పరిస్థితిని అనుమతించును. మన యొక్క ఖాళీ పాత్రలు మొదటిగా నింపబడనియెడల మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడరు.