WFTW Body: 

నీ జీవితములో దేవునియొక్క పరిపూర్ణమైన ప్రణాళికను నెరవేర్చుటకంటే ఈ భూమి మీద గొప్ప విషయము ఏమీలేదు. నీ జీవితము ద్వారాను మరియు పరిచర్యద్వారాను ఈ లోకములో ఏదో ఒక ప్రాంతములో నీ ద్వారా ఆయన సంఘమును నిర్మించుటకు దేవుడు మిమ్ములను వాడుకొనవలెనని ప్రార్థించుచున్నాను. భూసంబంధమైన మీయొక్క అవసరములు తీర్చుకొనుటకు మాత్రమే మీరు చదువుకొనవలెను కానీ దేవుని కొరకు జీవించుటయే మీ పిలుపైయున్నది. కాబట్టి మీరు చేసే ఉద్యోగము మీకు ఒక విగ్రహము కాకూడదు.

దేవుడు ఇప్పటికే నీ జీవితములో ప్రతివిషయమును ప్రణాళిక వేసియున్నాడు. అనగా స్కూలులో, కాలేజీలో మీరు చేరి మీరు చదవవలసిన వాటిగురించి దేవుడు ప్రణాళిక వేసియున్నాడు. దేవుడు తనయొక్క సార్వభౌమాధికారముతో నీ జీవితములో అన్నిటినీ సమకూర్చి చివరకు నీవు మంచి వృత్తిని చేపట్టునట్లు చేయును. కాబట్టి కొన్ని సందర్భములలో మీరు కోరుకొనిన కోర్సులు మీరు ఎంత ప్రయత్నించినను రానియెడల, నిరాశపడక దేవునిని స్తుతించుము. కొన్ని సంవత్సరముల తరువాత దేవుడు నీమీద తన దృష్టిని ఉంచి, నీవు గ్రహించనప్పటికిని సమస్తమునూ సమకూర్చి నీ మేలు కొరకే జరిగించుచున్నాడని తెలుసుకొనుము (రోమా 8:28). దేవునియొక్క ఈ వాక్యమును విశ్వసించి జీవించుము.

ఈ భూమిమీద యేసుయొక్క జీవమును నీ జీవితము ద్వారా బయలుపరచవలెనని దేవుడు ముఖ్యముగా కోరుచున్నాడు. కాబట్టి నీవు భూసంబంధమైన గురిని కలిగియుండకూడదు. జీవితాన్ని తీవ్రముగా తీసుకొనుము. దేవునియొక్క సంపూర్ణ చిత్తాన్ని వెదకుము. తీర్పు దినమున నీవు ప్రభువుయెదుట చింతించకుండునట్లు నీవు ఇక్కడ జీవించవలెను. ఆ అంత్యదినమందు ముఖ్యమైన గ్రేడ్ పాయింట్(GPA), మీ కాలేజీలో గ్రేడ్ పాయింట్ సరాసరి(GPA) కాదు గాని దేవునియొక్క మెప్పు మరియు అంగీకారమైయున్నది (1 కొరింథీ 4:5). ఇది మాత్రము నిత్యత్వమును నిలుచును.

అటువంటి అద్భుతమైన విధానమును దేవుడు మన జీవితములో ప్రణాళిక వేసియున్నాడు. నా జీవితములో దీనిని అనేకసార్లు కనుగొనియున్నాను. అందువలన రాబోయే దినములలో నా పూర్ణహృదయముతో ఆయనకు పరిచర్య చేసి "నా కొరకు శ్రమపొందిన దేవుని గొఱ్ఱెపిల్ల కొరకు" జీవించాలని కోరుకొనుచున్నాను. 18వ శతాబ్ధములో జింజన్ డోర్ఫ్ అనే నాయకుని ద్వారా మోరావియన్ క్రిస్టియన్స్ ఆయొక్క గురితో పరిచర్య చేసిరి. ఇప్పుడు అది జెకోస్లోవియాలో ఉంది.

దేవునికి నీ జీవితములో ఉన్నటువంటి పరిపూర్ణ ప్రణాళిక నెరవేర్చుటకు భూసంబంధమైన అర్హతలు అవసరములేదు. నీ మనస్సులో మరియు విశ్వాసములోను దీనుడవైన యెడల చాలు కాబట్టి నీవు ఎల్లప్పుడూ ఆ గుణలక్షణములు కలిగియుండవలెను.

మన జీవితములో బుద్ధిహీనమైన కొన్ని పొరపాట్లు చేయకుండుట అసాధ్యము. మనము దీనులమైయుండి మన పాపములను ఒప్పుకొని మరియు ఇతరులను నిందించక విశ్వాసముతో ఇట్లు చెప్పిన యెడల, "ఓ యేసు ప్రభువా, నేను బుద్ధిహీనమైన పొరపాట్లు చేసినప్పటికిని నీయొక్క కనికరము ద్వారా నా జీవితములో నీ చిత్తము నెరవేరునట్లు చేయగలవని నమ్ముచున్నాను". అప్పుడు దేవుడు నీవు చేసిన బుద్ధిహీనమైన పనులన్నిటిని క్షమించును. అనేకమంది విశ్వాసులు వారి ఓటమిని బట్టి నిరాశపడి మరియు దేవుని కనికరమందు విశ్వసించరు. ఆ విధముగా వారు వారి ఓటములనే హెచ్చించి దేవునియొక్క శక్తిని మరియు కనికరమును అగౌరవపరిచెదరు. నీవు దేవుణ్ణి విశ్వసించి మరియు ఆయన గొప్ప కనికరమును బట్టి ఆయనను మహిమపరచవలెను. అప్పుడు నీకు సంవత్సరము తరువాత సంవత్సరము గొప్ప మేలు కలుగును.