వ్రాసిన వారు :   Jeremy Utley విభాగములు :   గృహము తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

జెరెమీ అట్లీ

(NCCF సంఘ పెద్ద, శాన్ జోస్, USA)

నిజమైన విశ్వాసుల మానవ సంబంధాలలో కూడా విభేదాలు అనివార్యం. క్రైస్తవులుగా, కష్ట సమయాల్లో మనం పరిగణించకూడని కొన్ని విషయాలు ఉన్నాయని మనం నమ్ముతాము. ఉదాహరణకు, మనం కలత చెందినప్పుడు కూడా, మన ప్రత్యర్థిని చంపడం గురించి ఆలోచించము. సాధ్యమైన వాటిలో అది ఒకటని అనుకున్నా నవ్వు వస్తుంది. అదే విధంగా, వివాహంలో, మన విభేదాలను పరిష్కరించడంలో విడాకులను ఒక ఎంపికగా పరిగణించము. ఒక వాదనలో స్నేహితుల మధ్య హత్య చేయటం ఎలా ఊహించలేనిదో, అలాగే వివాహబంధంలో భార్యాభర్తల మధ్య విడాకులు అంత ఊహించలేని ఎంపికగా ఉండాలి.

కష్ట సమయాల్లో ఏమి చేయకూడదో తెలుసుకోవడంతో పాటు, ఏమి చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. మన వైరుధ్యాలను ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మక పద్ధతిలో పరిష్కరించడానికి సాధనాల కోసం వెతకాలి.

నా స్వంత వివాహంలో, ఈ క్రింది రెండు విషయాలను గుర్తుంచుకోవడం గొప్పగా సహాయపడింది:

మొదటగా నాకు నేను ఖచ్చితంగా చనిపోవాలి

100% నింద ఒక్కరిపైనే ఉండే పరిస్థితి దాదాపు ఎప్పుడూ ఉండదు. ఏ విభేదానికైనా ఇద్దరు వ్యక్తులు కొంత భాగం బాధ్యత వహిస్తారు. "కుటుంబ పెద్ద"గా, 99.9% నింద తన భార్యపైనే ఉన్నట్లు భావించినప్పటికీ, ముందుగా తన వంతుగా క్షమాపణలు చెప్పడం ద్వారా పురుషుడు నాయకత్వం వహించాలని నేను నమ్ముతున్నాను. (ఇక్కడ ఊహించిన నిష్పత్తి వాస్తవికతను ప్రతిబింబించే అవకాశం ఖచ్చితంగా లేదు).

నేను నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే, మరల తిరిగి క్షమాపణ అడుగుటను ప్రేరేపించాలనే ఆశతో నేను క్షమాపణ చెప్పకూడదు. నా భార్య "తిరిగి క్షమాపణ చెప్పడం" నా లక్ష్యం కాదు, నిజాయితీగా ఒప్పుకోవడం మరియు నా బాధ్యతను నెరవేర్చటమే నా లక్ష్యం. అవును, నా భార్య క్షమాపణ చెప్పాలని నేను కోరుకోవచ్చు, కానీ అది శారీరక కోరిక. నేను నా ఇష్టానికి, నా స్వంత కోరికలకు చనిపోవాలి మరియు అనుమానం ఉన్న విషయంలో నా స్వంత లోపాల గురించి మాత్రమే బాధ్యత వహించాలని మరియు ఆందోళన చెందాలని కోరుకుంటాను.

ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో, "ఆత్మీయ నాయకుడు"గా భర్త ఉండుట గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను తరచుగా కొత్తగా పెళ్లయిన సహోదరులకు చెప్పినట్లుగా, ఆత్మీయ నాయకత్వం అనేది ప్రధానంగా, మీ సంబంధాలలో మీకు మీరు మరణించే విషయంలో మొదటి వ్యక్తిగా ఉండుటలో ఉంది. పురుషుడు తలగా ఉండడమంటే ఏమిటో అనే దాని గురించి క్రైస్తవ ప్రపంచంలో అన్ని రకాల ప్రాపంచిక ఆలోచనలు వ్యాపించి ఉన్నాయి: గౌరవించాలని ఆజ్ఞాపించడం, విధేయత చూపించాలనడం, ఇంటిని పరిపాలించేవాడిగా ఉండటం మొదలైనవి. ఇవన్నీ తప్పుడు భావనలు. నిజమైన ఆత్మీయ నాయకత్వం అంటే ఏమిటో తెలుసుకోవడానికి, మనం మన ఆత్మీయ అధిపతి మరియు తన సంఘం యొక్క భర్తయైన యేసుక్రీస్తును చూడాలి. మన స్వంత శిరస్సు వైపు, ఆయన తన సంఘాన్ని ఆత్మీయంగా ఎలా నడిపించాడో చూసినప్పుడు, యేసు యొక్క ఆత్మీయ నాయకత్వం - ప్రతిరోజూ తన స్వంత చిత్తాన్ని తిరస్కరించడంలో, తనకు తానుగా చనిపోవడంలో, తన తండ్రి వైపు చూడటంలో, పరిశుద్ధాత్మపై ఆధారపడటంలో, ఆయన సిలువను మోయటంలో, సేవించుటకు మరియు ప్రేమతో మనకంటే క్రింది స్థాయికి రావడంలో నిర్వచించబడడాన్ని మనం చూస్తాము. ఆయన ఎప్పుడూ గౌరవం కోరలేదు, లేదా బలవంతంగా విధేయతను కోరలేదు, కానీ తండ్రియైన దేవుని చిత్తానికి వినయపూర్వకంగా లోబడుటకు మరియు విధేయతకు ఉదాహరణగా నిలిచాడు.

ఇంటిలోని పురుషులుగా మనం కూడా చేయవలసినది ఇదే: మన ఆత్మీయ నాయకత్వ క్రియగా దేవునికి వినయపూర్వకంగా లోబడుటను మాదిరిగా ఉండనివ్వండి.

ముందుగా దేవునితో నా సంబంధాన్ని పునరుద్ధరించుకొనుటకు చూడాలి

నా స్వంత వివాహంలో విభేదాలు/అభిప్రాయ బేధాలను పరిష్కరించడం గురించి ఆలోచించడంలో నాకు నిజంగా సహాయపడిన ఒక చిత్రం ఏమిటంటే, చేతులు పియానోను వాయించడం. ఈ చేతులను వివాహంలో భార్యాభర్తలతో పోల్చవచ్చు. సంగీతకారుని చేతులు అందంగా వాయించుటను ఆలోచించండి. తమ స్వంత ప్రయత్నాలు, కంగారుసంచిలో కలిసి గడిపిన సమయం మొదలైన వాటి ద్వారా కాకుండా, అవి రెండూ సంగీతకారుని తలతో సంపూర్ణంగా అనుసంధానించబడినందున సమన్వయం చేయబడతాయి.

వివాహంలో, "ఒకే నిర్ధారనకు రావడం" మొదలైన వాటికి చాలా సుదీర్ఘ చర్చలు అవసరమని నేను భావించాను, ఇది చేతులు "కలిసి ఎక్కువ సమయం గడపడం" లాంటిది. ఇది నిజంగా మనల్ని సమన్వయంలో ఉంచలేదు! ఐక్యత అనేది సమన్వయం మరియు సంభాషణ యొక్క విధి అని నేను పొరపాటుగా భావించాను, కానీ మరింత సమన్వయం మరియు సంభాషణ మరింత ఐక్యతకు దారితీయలేదు; తరచుగా, నా స్వంత ప్రయత్నాలు ఎక్కువ అనైక్యతకు దారితీశాయి.

చేతులు సమన్వయంలో లేవని నేను చూసినప్పుడు, దాని అర్థం వాటిలో ఒకటి ఖచ్చితంగా సంగీతకారుని యొక్క తల నుండి వేరుపరచబడి ఉండాలి! వేరుపరచబడటం అనేది పక్షవాతం, పక్షవాతానికి గురైన చేతితో పియానో సంగీతకారుడు అందంగా వాయించాలని మనం ఆశించలేము. అదేవిధంగా వివాహంలో మనం పక్షవాతానికి గురైన సభ్యులుగా, కలిసి ఎక్కువ సమయం గడపవలసిన అవసరం లేదు; మన తలతో పరిపూర్ణంగా సంబంధం పునరుద్ధరించడానికి మనం వెతకాలి!

ముందుగా దేవుణ్ణి వ్యక్తిగతంగా వెతకడం, నా హృదయాన్ని పరీక్షించడం (నా హృదయాన్ని శోధించమని, అక్కడ ఏదైనా అభ్యంతరకరమైనది ఉంటే చూపించమని ఆయనను అడగడం), ఆయన నాకు వెల్లడించే ప్రతిదాన్ని సరిచేసుకోవడానికి ఆత్రుతతో సంకల్పించటమే నా భూసంబంధాన్ని పునరుద్ధరించడానికి మరింత ఉత్పాదకమైన మరియు ఫలవంతమైన మార్గం, కానీ వివిధ దృక్కోణాలు మరియు వ్యూహాలను వెంబడించుట మార్గం కాదు.

మేము ఇలా చేసినందున, అనేక విబేధాలు మరింత చర్చ అవసరంలేకుండా పూర్తిగా కనుమరుగైనట్లు కనుగొన్నాము. మేము మరింత సంభాషణను కోరుకున్నప్పుడు, పూర్తిగా పనిచేసే ఆరోగ్యకరమైన చేతులుగా పునరుద్ధరించబడిన సభ్యులుగా మేము ఫలవంతంగా పాల్గొనవచ్చు.

మన వివాహాల పట్ల దేవుని సంకల్పం ఏమిటంటే, మన పట్ల ఆయన విమోచించే ప్రేమయొక్క అద్భుతాన్ని, ఆయనతో పరిపూర్ణమైన ఐక్యతకు మనలను సమాధానపరచుటను ప్రదర్శించడం (ఎఫెసీ 5:31-32). మన వివాహాలను విభజించే ప్రమాదమున్న భిన్నాభిప్రాయాల్లో ఆయన ప్రేమను తిరిగి ఆలోచించుటకు మనం వ్యక్తిగతంగా ప్రయత్నించే రెండు మార్గాలు ఇవి.