వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   స్త్రీలు
WFTW Body: 

సమూయేలుయొక్క జీవితము గొడ్రాలైయున్న హన్నాతో ఆరంభమవుతుంది (1సమూయేలు 1:2). కొందరు స్త్రీలు అనగా శారా, రిబ్కా, రాహేలు మరియు హన్నా అనేక సంవత్సరములు గొడ్రాళ్ళుగా ఉన్నారని లేఖనములలో చెప్పబడుట ఆసక్తికరముగా ఉంది. వారందరు ప్రార్థనలో దేవున్ని వెదికారు మరియు వారిలో ప్రతి ఒక్కరు దేవుని దయాసంకల్పమును బట్టి ఒక ప్రత్యేకమైన కుమారుని కన్నారు. వారి గొడ్రాలితనాన్ని వారు అంగీకరించలేదు. పిల్లల కొరకు వారు ఆసక్తితో దేవుని ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థనను విని జవాబిచ్చాడు మరియు ఆయన ప్రత్యేకమైన సంకల్పము నెరవేరునట్లు వారికి బిడ్డలను అనుగ్రహించాడు.

చాలా మంది తల్లులు వారు గర్భవతులుగా ఉన్నప్పుడు వారి బిడ్డలకొరకు ప్రార్థిస్తారు. అయితే ఈ స్త్రీలు ఎంతో ఆసక్తితో ప్రార్థించారు. అటువంటి ప్రార్థన ద్వారా ఒక బిడ్డ పుట్టుట ఎంతో అద్భుతమైన విషయం. సమూయేలు ఆ విధముగా జన్మించాడు.

హన్నా ఒక బిడ్డకొరకు అనేక సంవత్సరములు ప్రభువుకు ప్రార్థించింది. చివరకు ఆమె ప్రభువుతో ఇలా ప్రమాణము చేసింది. "దేవా, నీ సేవకుకాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగబిడ్డను దయచేసినయెడల ఆ బిడ్డను జీవితకాలమంతయు ప్రభువుకు సమర్పించెదను" (1సమూయేలు 1:11). ఇక్కడ ఆమెయొక్క గురి మారియున్నది. మొదటగా తన యొక్క అవసరమును గూర్చి: "నాకు ఒక కుమారుడు అవసరం". అప్పుడు మరలా ఈ విధముగా చెప్పసాగింది. నాకు కుమారుడు ఉన్నట్లయితే నాకనుగ్రహించిన ప్రభువుకే వానిని సమర్పించెదను". మన యొక్క ప్రార్ధన మన అవసరం నుండి దేవుని అవసరం వైపునకు తిరిగినప్పుడు మన ప్రార్ధనలకు జవాబు పొందుట ఆరంభమగును. మొట్టమొదటిగా "నీ నామము పరిశుద్ధపరచబడునుగాక" అని ప్రార్ధించమని ప్రభువు నేర్పించాడు.

ఇశ్రాయేలు ప్రజలలో అప్పుడు గొప్ప ఆత్మీయ అవసరం ఉన్నది. దేవుని ప్రజలు ఎంతో వెనుకంజ వేశారు. వారి నాయకులైన ఏలి మొదలగు వారు ఆత్మీయముగా ఎంతో వెనుకంజ వేశారు. మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తలు లేరు. హన్నా అప్పటి పరిస్థితిని గమనించింది. ఇశ్రాయేలీయులలో ప్రవక్తయొక్క అవసరాన్ని ఆమె గుర్తించింది. కాబట్టి ఆమె ఈవిధముగా ప్రార్ధించింది, "దేవా నేను అతని తలమీదకి క్షౌరపుకత్తి ఎన్నటికి రానియ్యక వాడు బ్రతుకుదినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఈ దేశము నీవైపు తిప్పుటకు నీవు అతనిని ఉపయోగించుకొనినట్లయితే, అతడు నీవాడే". తన యొక్క ప్రార్ధనంతయు తన అవసరము నుండి దేవుని అవసరము వైపు తిరిగింది.

అనేకసార్లు మన ప్రార్ధనలు మనయొక్క అవసరము గూర్చి ప్రార్ధిస్తాము కనుక మనము జవాబు పొందము. సమూయేలు అటువంటి తల్లికి పుట్టుట అద్భుతకరమైన విషయం.

హన్నా సమూయేలును కనినప్పుడు, ఆమె తాను చేసిన వాగ్ధానమును మరిచిపోలేదు. ఆమె తన కుమారున్ని దేవాలయము వద్దకు తీసుకొని వచ్చి ఇట్లన్నది "ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవి విని ఆయన నాకగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను(1సమూయేలు 1:27,28). ఆమె అతనిని ఎప్పుడు వెనుకకు తీసికొని వెళ్ళలేదు. మోకరించి దేవునిని ఆరాధించుట అతనికి నేర్పించింది. అటువంటి భయభక్తులు గల తల్లిని కలిగియుండుట అద్భుతమైన విషయము. తరువాత ఆమె అద్భుతమైన స్తుతిగీతం పాడింది (1సమూయేలు 2:1-10). దీని ద్వారా మరియ ప్రేరేపించబడి ఆమె కూడా స్తుతి గీతాన్ని పాడింది (లూకా 1:46-55).

సమూయేలు పెరిగి పెద్దవాడై తనయొక్క ప్రవచనాత్మక పరిచర్య ద్వారా న్యాయాధిపతుల గ్రంథములో ఉన్న ఇశ్రాయేలు యొక్క దౌర్భాగ్యస్థితి నుంచి మహిమకరమైన దావీదుయొక్క పరిపాలనలోనికి నడిపించాడు.