వ్రాసిన వారు :   డా. అనీ పూనెన్ విభాగములు :   గృహము సంఘము శిష్యులు
WFTW Body: 

"నా యెడల ఓర్చుకొనుము" అని ఒక దాసుడు తన తోటి దాసుని కనికరము కొరకు మొఱపెట్టెను (మత్తయి 18:29). బయటకు చెప్పని ఇటువంటి మొఱ ఇళ్ళలో భార్యలుగా మరియు తల్లులుగా ఉండిన మనకు, ప్రతిరోజు మనం వ్యవహరించే వారి యెద్దనుండి వచ్చును. అది బయటకు చెప్పబడనిది కావున ఆ మొఱ వినుటకు మన ఆత్మలలో మనం సున్నితముగా ఉండవలసిన అవసరముంది.

మన పిల్లలకు మనం ఒక విషయమును మరల మరల నేర్పించుటకు ప్రయత్నించినప్పుడు వారు అది నేర్చుకొనుటలో నెమ్మదిగా ఉండుట చేత మనకు బాధకలిగి వారిపట్ల సహనం కోల్పోవుటకు శోధింపబడవచ్చును. ఆ సమయములో "నా యెడల ఓర్చుకొనుము, దాన్ని సరిగా చేయుటకు నా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాను" అనే బయటకు చెప్పబడని వారి మొఱను మనం వినినట్లయితే, అప్పుడు వారిపై చికాకుపడే శోధనను జయించుట సులువుగా ఉండును.

మన ఇంటి పనులలో సహాయం చేసే పనిమనిషి బహుశా మనం కోరుకున్నంత శుభ్రముగా లేకుండా, సరిగా పని చేయకపోతూ ఉండవచ్చును. అందువలన ఆమె యెడల కఠినముగా ఉండునట్లు మనం శోధింపబడవచ్చును. కాని "నా యెడల ఓర్చుకొనుము, మరొక అవకాశమిచ్చినట్లయితే నేను బాగా చేస్తాను" అనేది ఆమె బయటకు చెప్పని మొఱ - మరియు ఆమె యెడల మృదువుగా ఉండే మరొక అవకాశమును మనం పొందుదుము.

మన తల్లితండ్రులు లేక అత్తమామలు ముసలితనములో, శరీర దుర్భలత్వముతో ఇప్పుడు మనపై ఆధారపడుతు ఉండవచ్చును. వారి బలహీనమైన బయటకు చెప్పబడని మొఱ కూడా, "నా యెడల ఓర్చుకొనుము, నిన్ను యిబ్బంది పెట్టకూడదనుకొనుచున్నాను, కాని ఇప్పుడు నీ సహాయం నాకు కావాలి". మనం వారి భావాల విషయంలో సునిశితంగా ఉండినట్లయితే, మనం వారి మొఱవిని, వారి మర్యాదకు భంగము కలగకుండా, వారు మనపై ఆధారపడుతున్నారనే ఆలోచన వారికి కలుగనీయకుండా వారికి సహాయపడుదుము.

బహుశా సంఘములో మనతోటి సహోదరీల ప్రవర్తన మనకు ఒక పరీక్షగా ఉండి ఉండవచ్చు. వారు బయటకు చెప్పబడని మొఱ కూడా "నా యెడల ఓర్చుకొనుము, నాకింకా కావలసినంత జ్ఞానం లేదు". అది గమనించినట్లయితే అప్పుడు వారు కూడా పరిపూర్ణులగుటకు మనవలెనే పోరాడుచున్నారని అర్థం చేసుకొనగలము.

అటువంటి పరిస్థితిలో, ఆ కనికరం లేని సేవకుని వంటి నైజము మన శరీరములో కలిగియుండుటను మనం కనుగొందుము. అయితే అటువంటి సమయములలోనే మనం దేవునిచేత ఎంతగా క్షమించబడ్డామో, మన తప్పిదాల యెడల ఇతరులు ఎంతగా ఓర్చుకొనుచున్నారో మనం జ్ఞాపకం చేసికోవాల్సి ఉంది.

మనం మన ఆత్మీయ చెవులను మనతోటి దాసుల నుండి వచ్చే మొఱను (వారు చిన్నవారైనా పెద్దవారైనా) అన్ని సమయాలలో వినుటకు అలవర్చుకోవలెను.

"ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువ లేకుండా ఉంటారు" (యాకోబు 1:4 ).