WFTW Body: 

మంచి సమరయుని ఉపమానములో, అవసరములో ఉన్న మన సహోదరుని చూచినప్పుడు అతనికి సహాయపడుట ఎంత ప్రాముఖ్యమైయున్నదోనని ప్రభువైనయేసు చెప్పారు (లూకా 10:25-37).

నిత్య జీవమును ఏ విధముగా స్వతంత్రించుకొనవలెనని ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభువైన యేసును అడిగెను. పూర్ణహృదయముతో దేవుని ప్రేమించుటద్వారాను మరియు నిన్నువలె నీ పోరుగువారిని ప్రేమించుటద్వారానని ప్రభువైనయేసు సమాధానము ఇచ్చెను. కాని ఆ ధర్మశాస్త్ర బోధకుడు (ఈనాటి అనేక బోధకులవలె) తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి-ఆవును గాని నా పొరుగువాడెవడని యేసునడిగెను (లూకా 10:29). ఆ ప్రశ్నకు జవాబుగా ప్రభువైన యేసు ఈ ఉపమానము చెప్పెను.

ఒక మనుష్యుడు దొంగలచేత కొట్టబడి, కొరప్రాణముతో విడిచిపెట్టబడెను. ఒక యాజకుడు (దేవుని ఇంటిలోని పెద్ద కుమారుడు) అతనిని చూచి, ప్రక్కగా పోయెను. ఆ దినములలోని ఇశ్రాయేలీయులందరు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు సంతతివారైయున్నారు. ఇప్పుడు మనము విశ్వాసులమైయున్నట్లే, వారు సహోదర-సహోదరీలైయున్నారు. కాబట్టి ఈ పడి యున్న వ్యక్తి ఆ యాజకుని యొక్క సహోదరుడైయున్నాడు. కాని ఆ యాజకుడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అంతేకాక అతడు రాత్రి సమయములో ఒంటరిగా రాకుండ ఉండవలసిందని అతనిని తీర్పుతీర్చి ఉండవచ్చును. మన తోటి విశ్వాసి బాధపడుచున్నప్పుడు మనము కూడా అతనికి సహాయపడకపోగా, త్వరపడి వారిని తీర్పు తీర్చెదము.

ప్రభువు మనతో ఒక దినమున ఇలాగు చెప్పునేమోనని ప్రశ్నించుకొనెదము, "నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. మీరు కేవలము పాటలు పాడి మరియు ప్రసంగములు చేసిరి కాని నా అవసరములో మీరు నాకు సహాయపడలేదు". ఆ యాజకుడు అవసరములో ఉన్న తన సహోదరునికి సహాయపడుటకంటే యేరూషలేములోని కూటమునకు వెళ్ళుటకు ఎక్కువ ఆసక్తి కలిగియున్నాడు. అనేక ప్రసంగములు చేసి కూడా అంత్యదినమున నరకమునకు వెళ్ళే అవకాశమున్నదని ప్రభువైన యేసు హెచ్చరించెను (మత్తయి 7:22,23).

తరువాత ఒక లేవీయుడు (దేవుని ఇంటిలోని ఒక సహోదరుడు) ఆ చోటికి వచ్చి మరియు అవసరములో ఉన్న తన సహోదరుని చూచి నిర్లక్ష్యము చేసి ప్రక్కగా పోయెను. అతడు కూడా ప్రార్థన కూటమునకు వెళ్ళుటకు ఎంతో ఆసక్తి కలిగియున్నాడు. అతడు కూడా పరీక్షలో ఓడిపోయెను. వీరిద్దరు కూడా దేవుని వాక్యమును వినుటకు కూటమునకు వెళ్ళిరి కానీ వారు వెళ్ళుచున్న మార్గములోనే అవసరములో ఉన్న వారి యొక్క సహోదరునికి సహాయపడువలెనని, దేవుడు మాట్లాడెనని వారు గ్రహించలేదు. ప్రభువు చెప్పుచున్న మాటలు వినగల చెవులు వారికి లేవు కాబట్టి ఆ ఉదయకాలము వారు దేవునికి పాడిన పాటలు మరియు ప్రార్థనలు వ్యర్థమే. దేవుని బిడ్డలు శ్రమలలో గుండా వెళ్ళుట మనము చూచినప్పుడు దేవుడు మన హృదయమును పరీక్షించును. యోబు యొక్క కథను పరిగణించెదము. యోబు శ్రమల ద్వారా దేవుడు తన ముగ్గురి స్నేహితులయొక్క హృదయములను పరీక్షించెను మరియు వారు ముగ్గురు పరీక్షలలో ఓడిపోయిరి.

ప్రభువు చెప్పిన ఉపమానములోని యాజకుడివలె లేక లేవీయుడివలె మనము ఉన్నామా? ఆ విధముగా ఉన్నట్లయితే, మనము మారుమనస్సు పొంది మరియు రాబోయే దినములలో వేరుగా ఉండుటకు ప్రయత్నించెదము. యాజకుడు మరియు లేవీయుడు పాత నిబంధన ప్రజలైయున్నారు కానీ మనము క్రొత్త నిబంధన క్రైస్తవులని చెప్పుకొనుచున్నాము. అట్లయితే, మనము ప్రభువైనయేసుని బయలుపరచవలెను మరియు మనము క్రీస్తును సరిగా చూపించుచున్నామా లేదా అని ప్రశ్నించుకొనవలెను.

చివరకు, తృణీకరించబడిన సమరయుడు (అనగా కొన్ని తప్పుడు సిద్ధాంతములు కలిగిన ఒక బబులోను సంఘమునకు చెందిన సహోదరుడు), గాయపడిన వ్యక్తికి సహాయపడెను. ఆ సమరయుడు సంఘపెద్దకాదు లేక బోధకుడు కాదు. అతడు ఒక సామాన్య సహోదరుడైయుండి ఎల్లప్పుడు ఇతరులకు సహాయపడుటకు సిద్ధముగానుండును - మరియు తన క్రియలు ఎవరికి తెలియకుండా చూచుకొనును. అతడు గాయపడిన వ్యక్తిని చూచినప్పుడు, తనకు కూడా అటువంటి పరిస్థితి వచ్చునెమోనని తలంచెను. కాబట్టి అతడు తనను తాను ఉపేక్షించుకొని మరియు తన సమయమును తన డబ్బును అవసరములో ఉన్న తన సహోదరునికి ఖర్చుపెట్టెను .

అక్కడ ప్రభువుకు నిజమైన శిష్యుడిగా ఉండుటను చూచెదము. మనయొక్క మంచి సిద్ధాంతములద్వారా కాదుగాని అవసరములో ఉన్న సహోదరులకు సహాయపడుటద్వారా క్రీస్తు యొక్క స్వభావమును వ్యక్తపరచెదము. అనగా ఇతరుల యెడల మంచితనము, ప్రేమ మరియు కనికరము కలిగి ఉండెదము.

ఆ విధముగా ఉండుటకు ప్రభువు మనకందరుకును సహాయపడునుగాక ఆమేన్.