WFTW Body: 

యేసు మనకు బోధించిన మొదటి మూడు విన్నపాలు "నీ నామము పరిశుద్ధపరచబడును గాక", "నీ రాజ్యము వచ్చును గాక", "నీ చిత్తము నెరవేరును గాక". ఈ విషయాలన్నీ కూడా దేవునికి సంబంధించినవని గమనిస్తాము. మనిషి సాధారణంగా తనను తానే కేంద్రంగా కలిగి ఉంటాడు. ఆదాము నుంచి మనం వారసత్వంగా స్వీయ కేంద్రీకృతమైన జీవితాన్ని పొందాము. అది ప్రాముఖ్యంగా మనల్ని గూర్చి మనమే, తరచుగా మన కొరకు మాత్రమే ఆలోచించేటట్లుగా చేస్తుంది. అది నేను, నా, నా కుటుంబం. అనేకమంది వీటిని గూర్చి మాత్రమే పట్టించుకుంటారు. వారు మార్పు చెందిన తర్వాత కూడా నేను, నా, నా కుటుంబం అలాగే ఉంటాయి. వారు క్రీస్తును స్వీకరించిన తర్వాత కూడా క్రీస్తు నన్ను, నా కుటుంబాన్ని ఏ విధంగా దీవిస్తాడని ఆలోచిస్తారు. అది క్రైస్తవ్యం కాదు. మన దుఃఖాలు మరియు మన బాధలన్నిటికీ మూల కారణమైన స్వీయ కేంద్రీకృత జీవితం నుంచి మనల్ని విడిపించడానికి యేసు వచ్చారు.

అనేకమంది క్రైస్తవులు ఎల్లప్పుడూ ఆనందించక పోవడానికి కారణం వారు వారినే కేంద్రంగా కలిగి ఉన్నారు. వారికి ఏదైనా మంచి జరిగినప్పుడు వారు ఆనందిస్తారు. వారు కోరుకున్నది ఏదైనా జరగనప్పుడు వారు కోరుకునే పదోన్నతి పొందనప్పుడు వారి సంతోషాన్ని కోల్పోతారు. ఎందుకు? దేవుడు ఇంకా సింహాసనం పైనే ఉన్నాడు, నీ పాపాలు ఇప్పటికీ క్షమింపబడే ఉన్నాయి, సాతాను ఇప్పటికీ ఓడిపోయే ఉన్నాడు! నీవు కోరుకున్నది పొందనందువల్ల సంతోషించలేకపోతున్నావు. మన సమస్యలన్నిటికీ మూల కారణమైన స్వీయ కేంద్రీకృత జీవితం నుండి విడిపించుటకు యేసు వచ్చారు.

మనం మన ఆహారం కోసం అడగవచ్చా? అవును మనం అడగవచ్చు. మత్తయి 6:11లో "మా అనుదిన ఆహారము మాకు దయచేయండి" అని ప్రార్థించమని యేసు బోధించారు. అనుదిన ఆహారంలో- ఆహారం, వస్త్రాలు, ఇల్లు, పిల్లల చదువులు అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే మన పిల్లలు కూడా చదువుకొని ఉద్యోగం పొందుకొని వారి యొక్క అనుదిన ఆహారాన్ని సంపాదించుకోవాలి. వీటిని గురించి అడగడంలో తప్పేమీ లేదు. "మా పాపాలను క్షమించండి", "కీడు(దుష్టుని) నుండి విడిపించండి" అనేవి కూడా మంచి విన్నపాలే. అయితే మనకు చెందిన ఈ మూడు విన్నపాలు దేవుని నామము, దేవుని రాజ్యము, దేవుని మహిమను వెతికిన తరువాత వస్తాయి. యేసు మన ప్రాధాన్యతలను మారుస్తున్నారు.

దేవుని రాజ్యాన్ని ఆయన నామాన్ని ఆయన చిత్తాన్ని మన ఆలోచనలలో ప్రధమమైన వాటిగా పెట్టుకుని ప్రార్థించడమే సరైన విధంగా ప్రార్థించడం. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని నామం, దేవుని రాజ్యం కొరకు, దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచించునట్లుగా మన యొక్క పూర్తి జీవన విధానాన్ని మార్చుకోవడం. వారే నిజమైన ఆత్మీయులైన క్రైస్తవులు. ఎవరైనా ఈ ప్రార్థనను చేయవచ్చు, చిలుక కూడా దీనిని పలుకవచ్చు. కానీ కేవలం ఆత్మీయులైన వ్యక్తులు మాత్రమే హృదయ పూర్వకంగా ఈ ప్రార్థనను చేయగలరు. ఎందుకంటే కేవలం ఆత్మీయులైన వ్యక్తులు మాత్రమే, ఈ దేశంలో సంఘంలో వారిలో వారి కుటుంబాలలో దేవుని నామం పరిశుద్ధపరచబడాలనేది వారి జీవితంలోని ప్రాథమికమైన పట్టింపని యదార్ధంగా చెప్పగలరు.

"దేవుని రాజ్యం రావాలి. దేవుని పరిపాలన సంఘంలో స్థాపించబడాలి. దేవుని చిత్తం నా జీవితంలో నా కుటుంబంలో మరియు ప్రతి చోటా జరగాలి". నిజమైన ఆత్మీయమైన వ్యక్తికి గుర్తు ఇదే. ఈ మూడు విషయాలు నీ హృదయంలో అత్యుత్తమమైన కోరికలుగా అయ్యేంతవరకు కూడా నిన్ను నీవు ఒక ఆత్మీయమైన వ్యక్తిగా పరిగణించుకోవద్దు. ఇంకా నీ జీవితమంతా నీ చుట్టూనే తిరుగుతున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా అర్థం లేనిదే. అనేక మంది వ్యక్తులు వారి జీవితంలో వారే కేంద్రంగా ఉంటారు కాబట్టి, వారు మార్పు చెందినప్పుడు కేవలం వారిని సేవించడానికి, వారి పాపాలు క్షమించడానికి, వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి, వారిని దీవించడానికి, వారిని ఐశ్వర్యవంతులుగా చేయడానికి, వారి రోగములను బాగు చేయడానికి యేసును వారి కక్షలోనికి చేర్చుకుంటారు. ఇది క్రైస్తవ్యం కాదు, ఒక మతాన్ని పైన జోడించిన స్వీయ కేంద్రీకృతమైన జీవితం. క్రీస్తు నిజంగా లోనికి వచ్చినప్పుడు మన స్వీయ కేంద్రీకృత జీవితం నుండి తిరుగుతాము (మారుమనస్సు పొందుతాము), మరియు దేవుడు కేంద్రంగా అవుతాడు.

ప్రభువు ప్రార్థన చివరలో మనకు చెందిన ఈ మూడు విన్నపాలలో భౌతిక సంబంధమైన విషయాల గురించి కూడా యేసు చెప్పారు (మా అనుదిన ఆహారము మాకు దయచేయండి). అయితే ఆయన వీటిని "మీ చిత్తం పరలోకంలో జరిగినట్లుగా భూమి మీద జరుగును గాక" అనే మాటకు అనుసంధానించారు. నేనేం చెప్తున్నాను అంటే, "నా తండ్రి పరలోకంలో దేవదూతలు నీ చిత్తాన్ని ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా ఈ భూమి మీద నా జీవితంలో నీ చిత్తాన్ని నేను కచ్చితంగా చేయాలనుకుంటున్నాను, అది వెంటనే లోబడటం. నీ చిత్తాన్ని చేయుటకు నాకు ఆరోగ్యం కావాలి కాబట్టి నా అనుదిన ఆహారం దయచేయండి". దేవుని చిత్తాన్ని చేయుటకు అనుదిన ఆహారాన్ని అడుగుతున్నావా? లేక నీ చిత్తాన్ని చేయుటకు అడుగుతున్నావా? పాపం చేయుటకొరకా లేక దేవుణ్ణి సంతోషపరచుటకొరకా?. మన ప్రార్థన "దేవునికొరకు జీవించుటకు ఆరోగ్యం మరియు బలం కొరకు అనుదిన ఆహారం మాకు దయచేయండి" అనునదిగా ఉండాలి.

ఈ ప్రార్థన అంతటిలో మనం గమనించే మరొక విషయం ఏమిటంటే ’నా’, ’నేను’ అన్న పదాలు కనపడవు. మన యొక్క సొంత ప్రార్థనలో ’నేను’, ’నా’ అనే పదాలను విరివిగా ఉపయోగించుటను కనుగొనటం ఆసక్తికరమైన విషయం కాదా. అయితే ప్రభువు మనకు బోధించిన ప్రార్థనలో ఈ మాటలు అస్సలే కనపడవు. ఆయన "మాకు ఇవ్వండి" అని చెప్పారు -"ప్రభువా ఇది నాకు మాత్రమే కాదు ఇదిగో నా సహోదరుని గురించి కూడా ఆలోచిస్తున్నాను అతనికి కూడా అనుదిన ఆహారం కావాలి". "మమ్మును క్షమించండి" -"నన్ను మాత్రమే కాదు నా సహోదరుని కూడా క్షమించండి". "మమ్మును విడిపించండి" -తన జీవితంలో దేవుడే కేంద్రముగా కలిగిన నిజమైన ఆత్మీయుడైన వ్యక్తి, తన గురించి ఆలోచించుకునే పరిస్థితుల్లో తన గురించి మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న దేవుని కుటుంబంలోని ఇతర వ్యక్తుల గురించి కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక పెద్ద కుటుంబానికి తండ్రి ఆయన ఇతరుల గురించి గురించి కూడా ఆలోచిస్తాడు.

సరియైన క్రమము మొదటిగా క్రీస్తు తర్వాత ఇతరులు మరియు నేను; కేవలం ’నేను’ ’నా’ గురించి కాదు. ఒక ఆత్మీయుడైన వ్యక్తి కేవలం తన యొక్క సొంత అవసరాల కొరకు మాత్రమే కాకుండా ఆ క్రమంలో ప్రార్థిస్తాడు. సహజంగానే తన సొంత పిల్లల పట్ల పట్టింపు కలిగి ఉంటాడు, అయితే వేరే వారి పిల్లల పట్ల కూడా పట్టింపు కలిగి ఉంటాడు. అతడు వారిని తక్కువగా చూడడు. మన సొంత పిల్లల పట్ల కలిగి ఉన్న భారాన్ని ఇతరుల పిల్లల పట్ల కూడా కలిగి ఉండడం మానవ పరంగా సాధ్యమయ్యే విషయం కాదు. మనం వాస్తవికంగా ఉండి వారి కొరకు కొంతైనా పట్టింపు కలిగి ఉండాలి. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి.

"ఇతరుల పాపములు మేము క్షమించిన ప్రకారము మా పాపములు క్షమించండి". ఇది ఎంతో ముఖ్యమైన అభ్యర్థన. చివర్లో యేసు మరలా చెప్పిన విన్నపమిది. మత్తయి 6:14లో "ఇతరుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకమందున్న తండ్రి కూడా మీ అపరాధములను క్షమించును" అని చెప్పారు. ఈ షరతును అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది, ఎందుకంటే స్వయంగా యేసే దానిని చెప్పారు: నీవు మనుష్యులను క్షమించనట్లయితే అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధములను కూడా క్షమించడు. ఇది సరైనదేనా కాదా?

నీకు వ్యతిరేకంగా తప్పు చేసిన వ్యక్తిని నీవు క్షమించకుండా ఉన్నప్పుడు దేవుడు నిన్ను క్షమింపకుండా అలాగే ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. ఇతరులను నీవు క్షమించనట్లయితే ఆయన నిన్ను కూడా క్షమించడు. దయచేసి దీనిని జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఇతరులతో ఏ విధంగా వ్యవహరిస్తామో అదే విధంగా ఆయన మనతో వ్యవహరిస్తాడనేది దేవుడు మన యెడల వ్యవహరించే వాటిలో ఒక ప్రాథమికమైన నియమము. మనం ఇతరుల ఎడల దయ కలిగి ఉంటే అప్పుడు దేవుడు కూడా మన పట్ల దయ కలిగి ఉంటాడు. మనం ఇతరులను క్షమిస్తే అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. మత్తయి 5:7లో మనం చూసినట్లుగా "కనికరం కలిగిన వారు ధన్యులు వారు కనికరం పొందుదురు". ఇక్కడ మనం ఈ విధంగా చెప్పవచ్చు, ఇతరులను క్షమించు వారు ధన్యులు, వారు క్షమించబడుదురు; ఎవరైతే ఇతరులను క్షమించరో వారు క్షమించబడరు.

ఈ విషయాన్ని స్పష్టంగా చూపించడానికి యేసు ఒక సాదృశ్యాన్ని మత్తయి 18:21-35లో చెప్పారు. ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమైనది. ఒకానొక రాజుకి అనేకమంది దాసులు ఉన్నారు. వారందరూ ఆ రాజుకు ఎంతో డబ్బును అప్పుగా ఉన్నారు. ఒక వ్యక్తి పదివేల తలాంతులు అప్పు ఉన్నాడు - అది నీవు ఎప్పటికీ తీర్చలేని వంద కోట్ల రూపాయలతో సమానమైన గొప్ప అప్పు. ఆ రాజు కనికరపడి అతన్ని క్షమించాడు. ఈ క్షమించబడిన వ్యక్తి బయటకు వెళ్లి 100 రూపాయలు అతనికి అప్పు ఉన్న మరొకరిని కనుగొని అతని గొంతు పట్టుకొని ’నీవు నాకు దాన్ని తిరిగి చెల్లించని యెడల నేను నిన్ను కోర్టుకు తీసుకొని వెళ్లి చెరసాలలో వేయిస్తాను’ అని చెప్పాడు. అతను వెళ్లి ఆ విధంగా చేశాడు. మిగిలిన దాసులు దాన్ని చూసినప్పుడు వెళ్లి రాజుకు ఆ విషయాన్ని చెప్పారు. ఆ రాజు దాసుని పిలిచి, ’చెడ్డదాసుడా నీ అప్పును క్షమించమని నీవు నన్ను అడిగినప్పుడు నిన్ను క్షమించాను. నేను నీ పట్ల కనికరపడినట్లుగా నీవు నీతోటి దాసుని పట్ల కనికరపడవలసి ఉన్నది కదా?’ అని చెప్పి రాజు ఎంతో కోపగించుకున్నాడు. రాజు, ఆ దాసుడు తన అప్పు అంతయు తిరిగి చెల్లించువరకు బాధపరచు వారికి అతన్ని అప్పగించాడు.

ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆ క్షమించబడిన అప్పు మరల అతని తలపై ఉంచబడింది. దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం? దేవుడు మనల్ని క్షమించిన తర్వాత ఆ క్షమాపణ రద్దు చేస్తాడా? క్షమించబడిన మన పాపాలని తిరిగి మన తలపై ఆయన మరలా ఉంచుతాడా? ఈ వచనం ప్రకారం అవును. బైబిలు ఎప్పుడూ కూడా దేవుడు మన పాపాలను మర్చిపోయాడు అని చెప్పదు. ఆయన ’మీ పాపములను ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను’ అని చెప్పాడు దాని అర్థం ’మీ పాపాలను మీకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఎత్తి పట్టుకోను’.

దేవుడు పూర్తిగా మర్చిపోతాడని ఏ వచనం కూడా చెప్పదు. నేను చేసిన పాపాలను నేనే మర్చిపోను, అయితే దేవుడు ఎలా మర్చిపోతాడు. లేదు ఆయనకు తెలుసు, అయితే ఆయన వాటిని మనకు వ్యతిరేకంగా ఎంచడు. ఈ ఉపమానం మనకు ఏం బోధిస్తుందంటే నీవు ఇతరులను క్షమించినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీవు ఇతరులను క్షమించనట్లయితే దేవుడు నిన్ను క్షమించడు.

చివరి విన్నపం ఏమిటంటే "మమ్మును శోధనలోనికి తీసుకొని వెళ్లవద్దు". దాని అర్థం ఏమిటి? మనం భరింపగలిగిన దానికంటే అధికముగా శోధింపబడుటకు దేవుడు అనుమతించడు (1కొరంథీ 10:13). అయితే మనం ఈ విధంగా ప్రార్థించడం మంచిది. ఎందుకంటే కొన్ని శోధనలు మన సామర్థ్యానికి మించి ఉన్నాయని మనం తెలుసుకోవడం ఎంతో మంచిది. మన సామర్థ్యానికి మించి మనం పరీక్షింపబడుటకు దేవుడు అనుమతించరని మనకు తెలుసు. అయితే మనం సహింపలేని శోధనలోనికి వెళ్లకుండునట్లు మనం ప్రార్థించాలి. "దుష్టుని(కీడు)నుండి తప్పించుము". నేను దీనమైన స్థితిలో ఉండి విధంగా చెప్తున్నాను "ఈ శోధనను ఎలా జయించాలో నాకు తెలియదు. ఈ శోధనను ఎదుర్కొనుటకు నాకు సామర్థ్యం లేదు. కాబట్టి ప్రభువా నా తండ్రి, నాకంటే బలమైన శోధనలోనికి నన్ను నడిపించకు". ఈ విధంగా నేను ప్రార్థించినప్పుడు నా యొక్క అసమర్ధతను నిస్సహాయతను వెలిబుచ్చుతున్నాను. అది శోధన పట్ల ఉండవలసిన ఒక మంచి వైఖరి.

శోధన వలన జయించబడలేనంత బలంగా ఉన్నామని మనమెప్పుడూ ఆలోచించకూడదు. అనేకులకు పాపంపై జయం లేకపోవడానికి ఇదే కారణం. అనేక మంది క్రైస్తవులు పాపం చేత ఓడింపబడడానికి కారణం వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వారు సామర్థ్యం కలిగి ఉన్నారని అనుకుంటారు -మరికొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం బిగ పట్టుకుని ఉండడం వలన జయించవచ్చని అనుకుంటారు. లేదు, అలా చేయలేరు. మనం, "ప్రభువా నాకంటే బలమైన శోధనలోనికి నన్ను నడిపించకు, నేను శోధనను ఎదుర్కొన్నప్పుడు కీడు నుండి తప్పించు, ఎందుకంటే కీడును నా అంతట నేను జయించలేను" అని ఒప్పుకోవాలి. కీడు మనకంటే బలమైనదని, ఇతరులను క్షమించే విషయంలో కూడా బలమైనదని మనం గుర్తించినట్లయితే అప్పుడు మనం యేసు ఇక్కడ బోధించినట్లుగా ప్రార్థిస్తాము. ఎవరైనా నీకు గానీ నీ కుటుంబానికి గానీ గొప్ప కీడు చేసినప్పుడు, వారు చేసిన కీడును బట్తి ఆ వ్యక్తిని క్షమించడం నీకు కష్టమైనప్పుడు దేవుణ్ణి కృప కొరకు నీవు అడగవచ్చు. "ప్రభువా నాకు సహాయం చేయండి. క్షమించలేని ఆత్మ అనే ఈ కీడు నుండి నన్ను విడిపించండి. ఈ వ్యక్తిని క్షమించుటకు నాకు సామర్థ్యం లేదు. అతన్ని క్షమించుటకు సహాయం చేయమని కోరుతున్నాను" అని చెప్పండి.

ప్రార్థన అనేది మన బలహీనతను వ్యక్తపరచడం మరియు దేవునిపై నిస్సహాయులముగా ఆధారపడటం. విశ్వాసం అంటే దేవుడు మనకు సహాయం చేస్తాడని ధైర్యం కలిగి ఉండడం, ఎందుకంటే ఆయన పరలోకమందున్న నా తండ్రి మరియు నా పాపములన్నిటి నుండి నన్ను స్వతంత్రునిగా చేయుటకు ఆయన తన కుమారుడిని చనిపోవుటకు పంపించాడు. రోమా 8:32 ఈ విధంగా చెప్తుంది, "మన పాపముల నుండి మనలను స్వతంత్రులుగా చేయుటకు తన కుమారుని ఇచ్చినవాడు ఆయనతో పాటు మనకు అవసరం ఉన్నవన్ని కూడా ఎంత ఎక్కువగా ఇచ్చునో కదా!".

మత్తయి 6:13లో ప్రార్థన ఈ విధంగా ముగించబడింది, "రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి, ఆమెన్".

ఈ విధంగా ప్రార్థన ముగించడం ఎంతో ప్రాముఖ్యమైనది, "ప్రభువా దీనంతటి తర్వాత, నా ప్రార్థనకు నీవు జవాబిచ్చిన తర్వాత, నేను నిన్ను అడిగిన ప్రతి ఒక్కటి నువ్వు చేసిన తర్వాత రాజ్యము నీదేనని బలము నీదేనని నేను ఒప్పుకుంటున్నాను. ఈ జీవితాన్ని జీవించుటకు నాకు శక్తి లేదు; పాపమును జయించుటకు నాకు శక్తి లేదు. బలము నీదే. నేను పాపమును జయించినప్పుడు మహిమ కూడా నీకే చెందుతుంది".

ఆ ప్రార్థన "ఆమెన్"‍తో ముగుస్తుంది, దాని అర్థం "ఆ విధంగా జరుగును గాక".