WFTW Body: 

కృపను పొందకుండా క్రొత్తనిబంధన ఆజ్ఞలకు లోబడియుండుట అసాధ్యము. 10 ఆజ్ఞలలోని మొదటి 9 ఆజ్ఞలను కృపలేకుండా కొందరు నెరవేర్చవచ్చును, కాని నీది కానిదానిని ఆశించవద్దు అనే 10వ ఆజ్ఞను దేవునికృప పొందకుండా ఎవరు నెరవేర్చలేరు. కృపను పొందనియెడల క్రొత్తనిబంధన జీవితము (మత్తయి 5నుండి7అధ్యాయములలో వివరించబడినట్లు) జీవించలేము. దీనులకే దేవుడు కృపనిచ్చును(1పేతురు 5:5).

దీనత్వమనే గుణలక్షణము సులభముగా నకిలీ చేయవచ్చు. మనలో ఇతరులు చూడగలిగినది నిజమైన దీనత్వము కాదు. అది మన లోపల ఉండును మరియు దేవుడు చూచును. ప్రభువైనయేసు యొక్క జీవితములో అది స్పష్టముగా చూపించబడినది. ఫిలిప్పీ 2:5-8లో ప్రభువైనయేసు దేవునిగా ఉండుట విడిచిపెట్టి మరియు దాసుడయ్యెను. మరియు మనుష్యులచేత సిలువవేయబడుటకు ఇష్టపడెను. ఆ దీన మార్గములోనే మనము వెంబడించాలి.

ప్రభువైనయేసు దీనుడై 3మెట్లు దిగియున్నాడు.

1. ఆయన మనుష్యుడిగా పుట్టెను.

2. ఆయన దాసుడయ్యెను.

3. ఒక నిందితునిగా సిలువ వేయబడుటకు ఆయన ఇష్టపడెను.

ఇక్కడ క్రైస్తవ జీవితములో మూడు రహస్యములు మనము చూచుచున్నాము: అవి దీనత్వము, దీనత్వము, దీనత్వము.

ప్రభువైనయేసు ముప్పైమూడున్నర సంవత్సరములు భూమిమీద జీవించి మరియు దీనత్వముతోను సహనముతోను అవమానమును భరించుచు మరియు గాయపరచబడుచు అనేకులకు పరిచర్యచేయుట దూతలు ఆశ్చర్యముతో చూచియుండవచ్చును. అనేక సంవత్సరములనుండి ఆ దూతలు ఆయనను పరలోకములో ఆరాధించియున్నారు. కాని భూమిమీద ఆయన యొక్క ప్రవర్తనను వారు చూచినప్పుడు, ప్రభువైనయేసు పరలోకములో ఉన్నప్పుడు వారు చూడనటువంటి, అర్థము చేసుకోలేనటువంటి దేవుని స్వభావములోని దీనత్వమును మరియు తగ్గింపు స్వభావమును వారు చూచియున్నారు. ఇప్పుడు సంఘములో ఉన్న మనలోని అదే క్రీస్తుయొక్క ఆత్మను పరలోకములోని దూతలు చూడవలెనని దేవుడు కోరుచున్నాడు (ఎఫెసీ 3:10). ఇప్పుడు దూతలు మనలను చూచినప్పుడు మనలోను, మనయొక్క ప్రవర్తనలోను ఏమి చూచుచున్నారు? మనయొక్క ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చుచున్నదా?

దీనత్వము అన్ని గుణలక్షణముల కంటే గొప్పది. మనము ఏమైయున్నామనునదియు మరియు మనకున్న వరములన్నియు దేవునికి చెందినవని దీనత్వము ఒప్పుకొంటుంది. మనుష్యులందరిని ప్రత్యేకముగా బలహీనులకు, నాగరికతలేనివారికి, కుంటివారికి మరియు బీదలకు విలువ నిచ్చేటట్లు దీనత్వము చేస్తుంది. "అటువంటి దీనత్వమనే పొలములోనే ఆత్మ యొక్క ఫలములు మరియు క్రీస్తుయొక్క గుణలక్షణములు అభివృద్ధి చెందును". కాబట్టి ఎల్లప్పుడు నిన్ను నీవు తీర్పుతీర్చుకొనుచు, గొప్ప తలంపులనే విషముగాని లేక ఘనత కోరుటగాని లేక దేవునికి చెందవలసిన మహిమను పొందుటకాని ఎన్నటికి నీ హృదయములో ప్రవేశించకుండా చూచుకొనుము. ప్రభువైనయేసు యొక్క దీనత్వమును ధ్యానించుము. అది నేను మీకిచ్చే గొప్ప హెచ్చరిక.

ప్రభువైనయేసు 70మంది శిష్యులతో ఇట్లనెను, "అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను" (లూకా 10:20). మనమేమైయున్నామో అను దానిని బట్టిగాని లేక మనము చేయగలిగిన దానిని బట్టిగాని లేక మనం చేసినదానిని బట్టిగాని మనము సంతోషించకూడదు. కాని ప్రభువు ఏమైయున్నాడనే దానిని బట్టియు, ప్రభువు మనకొరకు చేసి ముగించిన దానిని బట్టియు మరియు ప్రభువు చేయగలిగిన దానిని బట్టియు సంతోషించాలి. మనము చేయగలిగిన దానిని బట్టి సంతోషించినయెడల, మనమే ఘనతను పొందెదము మరియు ఇతర విశ్వాసుల కంటే మనలను గొప్పగా చేయును. ఇది పరిసయ్యతత్వము. మనము దయ్యములను వెళ్ళగొట్టుట, రోగులను స్వస్థపరచుట, వాక్యమును ప్రకటించుట, కొన్ని వ్యాసములను వ్రాయుట, ఆతిథ్యము ఇచ్చుట, బాగుగా వంటచేయుట, కారును బాగుగా నడుపుట మొదలైన భూసంబంధమైన వాటిని గొప్పగా చేయుట ద్వారా మనము సంతోషించెదము (అపొ.కా. 7:41). మనము ఘనత పొందుటకు అనేకమార్గములు ఉన్నవి. కాని ఇదంతయు విగ్రహారాధన. కాని దేవుడు చేసిన దానిని బట్టి మనము సంతోషించినయెడల, అప్పుడు మనము దీనులముగా ఉండి, ఇతర విశ్వాసులతో సమానస్థాయిలో ఉందుము. మరియు ఇక్కడ క్రీస్తుయొక్క శరీరము నిర్మించబడును.