WFTW Body: 

పౌలు, 'భ్రమపడని పవిత్రత' గూర్చి చెప్పాడు (ఎఫెసీ 4:24 - J.B.Philips). ఇది సిద్ధాంతాలను అర్థం చేసుకొనుటద్వారా కాదు కాని యేసే తన జీవితమును మనయందు జీవించుట ద్వారా జరుగును. ధైవభక్తిని గూర్చిన రహస్యం 1తిమోతి 3:16లో చెప్పబడింది - అది యేసు శరీరధారియై వచ్చెనను సిద్ధాంతము కాదు కాని యేసు తానే మన శరీరమందు ఉండుటయై ఉన్నది. ఇది ఏ సిద్ధాంతము వైపు చూచుట ద్వారా కాదు కాని యేసునే చూచుట ద్వారా ఆయన సారూప్యములోనికి మార్పుచెందెదము (2కొరింథీ 3:18). మీ జీవితాంతం దీనిని గుర్తుపెట్టుకొనవలెను.

మీరు, 1) యేసుపైనే మీ చూపు నిలపని యెడల 2) ఆయనను ప్రేమించువారినందరిని, వారు ఏ సంఘస్థులైన వారు ఏ సిద్ధాంతాన్ని నమ్మినను, ప్రేమించని యెడల ప్రతి సిద్ధాంతం మిమ్మును తప్పిపోయేటట్లు చేస్తుంది. క్రీస్తు శరీరమైన సంఘమునకు ఆయనే శిరస్సుగా ఉన్నాడు. కాని సిద్ధాంతమే శిరస్సుగా ఉంటే ప్రజలు పరిసయ్యులు అగుదురు. ఎంత మంచి సిద్ధాంతం కలిగి ఉంటే అంత ఎక్కువ పరిసయ్యులు అగుదురు. ఈ పాట ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోండి - "ఒకప్పుడు ఆశీర్వాదం, కాని ఇప్పుడు ప్రభువు".

యేసు తండ్రిని ఎలా చూపించాడో, మనం కూడా సంఘముగా ఆ విధంగా చూపించాలి - ముఖ్యంగా యోహాను 8:1-11లో పరిసయ్యులకు విరోధముగా, వ్యభిచారములో పట్టబడి పశ్చాత్తాపడిన స్త్రీ పక్షముగా నిలబడుట మనం చూచిన విధంగా. ప్రభువైనయేసు భూమిమీద అత్యంత ఉన్నతమైన ప్రమాణముతో పరిశుద్ధతను బోధించినప్పటికి, అత్యంత ఘోర పాపులతో కూడా కలిసిపోయెను (ఉదా: పునరుత్థానుడైన యేసును చూచే ధన్యత ఇవ్వబడిన మగ్దలేనే మరియ). ఆయన అటువంటి పాపులను ఒక్కసారి కూడా విమర్శించలేదు లేక వారి గతాన్ని గూర్చి వారికి గుర్తుచేయలేదు. సంఘముగా మన పిలుపు కూడా ఇదే - యేసువలె అదే ప్రమాణాలతో పరిశుద్ధతను బోధించడం మరియు అత్యంత ఘోరపాపులను వెనుకకు దిగజారిపోయిన వారిని చేర్చుకొని వారిని ఆయన యొద్దకు ఆకర్షింపచేయుట.

ఎటువంటి ఘోరమైన జబ్బులున్న వారినైనా చేర్చుకొనే హాస్పిటల్ వలె మన సంఘం ఉండాలి. వారందరు బాగుపడగలరు. సహాయము పొందలేనంతగా చెడిపోయామని ఎవ్వరు భావించకూడదు. ధనవంతులు మరియు స్వయం సంతృప్తి చెందిన వారు కూడుకునే క్లబ్‍ల వలె కొన్ని సంఘములున్నవి. కాని అత్యంత ఘోరపాపులను చేర్చుకొనే హాస్పిటల్‍గా మనం ఉండాలి.

మీరు ఎల్లప్పుడు దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. అప్పుడు మీరు చేసేదంతా సఫలమగుతుంది మరియు పరాక్రమము గల శూరునివలె దేవుడు మీ పక్షముగా పని చేస్తాడు (యిర్మీయా 20:11). నా జీవితకాలమంతా దీనిని నేను అనుభవించాను.

దేవుని రాజ్యమును వెదకుట అనగా కేవలం సువార్త చెప్పుట, పరిచర్య చేయుట కాదు. దేవుణ్ణి మీ జీవితంపై అధికారిని చేసి, ఎల్లప్పుడు దేవుని అధికారం క్రింద జీవిస్తూ, ధనాశ, భూసంబంధమైన సుఖభోగాలు, మనుష్యుల ఘనత కంటె ఎక్కువగా పరలోక విలువలకు ప్రాధాన్యతనిచ్చుటయై ఉన్నది.

మొదటగా దేవుని నీతిని వెదుకుట అనగా, మీ అంతరంగ జీవితములో మరియు మీ బాహ్య స్వభావములోని ప్రతి భాగములో దేవుని స్వభావం బయలుపరచబడునట్లు ఎల్లప్పుడు దప్పిక కలిగి ఉండుట.

ప్రతిరోజు ఈ సత్యము మనను పట్టకొనునుగాక. మీకు పిల్లలు కలిగినప్పుడు, వారి జీవితంలో కూడా ఇటువంటి ఫలితాలనే కనుగొనుటకు ఈ సత్యమును వారికి బోధించాలి. ఆవిధంగా ప్రభువు వచ్చు వరకు తరతరములు ఈ భూమిపై ప్రభువు కొరకు ఒక సాక్ష్యం ఉండును.