WFTW Body: 

ప్రభువైనయేసు ఈ లోకానికి రాకముందు అనేక సంవత్సరాల క్రితమే జ్ఞానములోను మరియు సౌందర్యములోను పరిపూర్ణుడైన లూసిఫరు అనే దూతను దేవుడు సృష్టించాడు. లూసిఫరును దూతలందరి మీద అధిపతిగా దేవుడు నియమించాడు. కాని లూసిఫరు గర్వముతోను అసంతృప్తితోను నిండినవాడై తానింకా పైకి వెళ్ళగోరి తనను తాను హెచ్చించుకోవాలనుకున్నాడు. ఆ విధంగా అతను దేవుని సృష్టిలోనికి పాపాన్ని తెచ్చాడు. దేవుడు వెంటనే అతని త్రోసివేయగా అతడు సాతానుగా మారాడు. ఈ విశ్వములో ఉన్న ప్రతి పాపానికి మరియు చెడుకు గర్వమే మూలమైయున్నది. ఆదాము కూడా పాపము చేసి ఈ సాతాను గర్వాన్ని పొందియున్నాడు. ఆదాము యొక్క ప్రతి బిడ్డ కూడా ఈ సాతాను గర్వముతోనే పుట్టియున్నాడు. మనుష్యుని గర్వమనే ఈ విషమునుండి రక్షించుటకు ప్రభువైనయేసు తనను తానే తగ్గించుకున్నాడు. లూసిఫరుయొక్క గర్వము ద్వారా పాపము ఎలా ఆరంభమయిందో అలాగే ప్రభువైనయేసు తనను తాను తగ్గించుకొనుట ద్వారా విమోచన ఆరంభమయింది. క్రీస్తుయేసుకు కలిగిన ఇటువంటి దీనమనస్సుని మనమూ కలిగియుండాలి. ఇదియే మన ఆత్మీయ అబివృద్ధికి కొలమానమైయున్నది.

మహిమకరమైన పరలోకమునుండి ఈ భూమిమీదకు ప్రభువైనయేసు దిగివచ్చుటలోనే ఆయనలో ఉన్న దీనత్వము బయలుపరచబడియున్నది. అంతేకాక ఆయన మానవునిగా కూడా తనను తాను తగ్గించుకున్నాడు (ఫిలిప్పి 2:8). "ఆయన అన్ని విషయములలోను తన సహోదరులవంటి వాడాయెను" (హెబ్రి 2:17). అనగా ఇతర మనుష్యులవలె దేవుని యెదుట తాను కూడా ఉన్నాడు. దేవుడు తనకు సర్వములో సర్వమగునట్లు, ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని ఖాలి చేసుకున్నాడు. ఇదియే నిజమైన దీనత్వం. ఆయన సంపూర్ణమైన మానవునిగా అయ్యాడు. వంశావళి, పేరుప్రతిష్ఠలు, కుటుంబం ఏదైనప్పుటికి మానవులందరు సమానమేనని ఆయన నమ్మాడు మరియు సమాజములో అత్యంత తక్కువ స్థాయికి దిగి వచ్చాడు. ఆయన అందరకు పరిచర్య చేయగలుగునట్లు, ఆయన అందరి క్రిందకు వచ్చాడు (దాసుడిగా అయ్యాడు). ఇతరుల క్రిందకు వెళ్ళినప్పుడు మాత్రమే వారిని పైకి లేపగలడు. మరియు ప్రభువైనయేసు ఈ విధముగా భూమిమీదకు దిగి వచ్చాడు.

తన తండ్రి చిత్తమును బట్టి 30సంవత్సరాలు ఆయన అసంపూర్ణులైన పెంచినతండ్రికి మరియు తల్లికి లోబడెను. ఆయన వారికంటె ఎంతో జ్ఞానముకలిగినవాడై మరియు వారు పాపముగలవారైనను ఆయన పాపము లేనివాడైయున్నాడు. అయినప్పటికి ఆయన వారికి లోబడియున్నాడు. జ్ఞానములోను మరియు ఆత్మీయతలోను తనకంటె తక్కువస్థాయిలో ఉన్న వారికి లోబడుట సులభము కాదు కాని నిజమైన దీనత్వానికి లోబడుటలో ఇబ్బంది ఉండదు. ఎందుకనగా దేవుని దృష్ఠిలో తాను వట్టివాడనని అనుకొనువానికి, దేవుడు తన మీద ఉంచిన అధికారులకు లోబడుటకు ఇబ్బంది ఉండదు.

ప్రభువైనయేసు అంతగా గౌరవింపబడని వడ్రంగి పని చేయుటకు నిర్ణయించుకున్నాడు. మరియు ఆయన పరిచర్య ఆరంభించినప్పుడు ఆయన తన పేరుకు ముందుకాని వెనుకకాని ఎటువంటి బిరుదులు పెట్టుకోలేదు. ఆయన "పాస్టర్ యేసు" కాదు, రెవరెండ్ డాకర్ట్ యేసు" అసలే కాదు. ఆయన భూసంబంధమైన పదవికాని బిరుదుకాని పెట్టుకొని, తాను పరిచర్య చేయుట కొరకు వచ్చిన ప్రజలకంటే తనను హెచ్చించుకొవాలనుకోలేదు. చెవులుగలవాడు వినును గాక.

ఒకసారి జన సమూహము ఆయనను రాజుగా చేయాలని కోరినప్పుడు ఆయన వారి మధ్యలోనుండి ఒంటరిగా వెళ్ళిపోయాడు (యోహాను 6:15). ఆయన మనుష్యకుమారునిగా మాత్రమే ఇతరులకు తెలియబడాలనుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనుష్యుల ఘనతను వెదకలేదు, కోరలేదు. ఆయన తన తండ్రి యెదుట మాత్రమే జీవించాడు. మరియు ఆయన మనుష్యులచేత తృణీకరించబడినప్పటికినీ మరియు విసర్జించబడినప్పటికినీ తన జీవితకాలమంతయు తృప్తి కలిగియున్నాడు. తండ్రియొక్క అంగీకారము మాత్రమే ఆయనకు ముఖ్యమైయున్నది.

ప్రభువైనయేసు తన దీనత్వాన్ని బట్టి ఎవరికి తీర్పు తీర్చలేదు. దేవుడు మాత్రమే మనుష్యులందరిని తీర్పు తీర్చును మరియు ఏ మానవుడైనను ఇతరులను తీర్పు తీర్చినయెడల అతడు దేవుని యొక్క స్థానాన్ని తీసుకొనుచున్నాడు. భూమిమీద ఒక మానవునిగా ప్రభువైనయేసు ఇట్లన్నారు "నేను ఎవరిని తీర్పు తీర్చను" (యోహాను 8:15). ఆయన తీర్పు తీర్చుట అంతటిని దేవునికి అప్పగించియున్నాడు. ఇక్కడ కూడా ఆయనలో ఉన్న దీనత్వంయొక్క సౌంధర్యమును చూస్తాము.

తన శిష్యులతో కలిసి సహవాసం చేస్తూ ప్రార్థించుటలో కూడా ఆయనలోని దీనత్వాన్ని చూడగలము. గెత్సెమనే తోటలో ఆయన పేతురు, యోహాను, యాకోబులను ప్రార్థించమని కోరాడు. ఎందుకనగా "మరణమగునంతగా ఆయన ప్రాణము బహుదుఃఖములో మునిగియున్నది" (మత్తయి 26:38). ఆయన ధరించిన శరీరము ఎంత బలహీనమైనదో ప్రభువైనయేసునకు తెలుసు. అందువలననే ఆయన వారితో కలిసి ప్రార్థించాలని కోరాడు.

ప్రభువైనయేసు తనను తాను తగ్గించుకున్నాడు కనుక దేవుడాయనను విశ్వమంతటిలో అత్యంత ఉన్నతమైన స్థాయికి హెచ్చించాడు (ఫిలిప్పి 2:9). ఈ దీనమార్గములో ఎవరైతే అత్యంత ఎక్కువగా ప్రయాణిస్తారో వారు ప్రభువైనయేసు క్రీస్తుకి కుడివైపున మరియు ఎడమవైపున మహిమలో కూర్చుంటారు. ప్రభువైనయేసు తన జీవితకాలమంతయు క్రిందకు వెళ్ళుచున్నాడు. ఆయన పరలోకమునుండి క్రిందికి దిగివచ్చి మరియు సిలువ మరణం పొందువరకు అంతకంతకు క్రిందకు వెళ్ళుచూనే ఉన్నాడు. ఆయన ఒక్కసారికూడా ఈ మార్గమును విడిచి తనను తాను హెచ్చించుకోవాలని కోరుకోలేదు.

ఈనాడు భూమిమీద రెండు ఆత్మలు మాత్రమే పనిచేయుచున్నవి. ఒకటి సాతాను(లూసిఫరు) యొక్క ఆత్మ అనగా ప్రజలను లోకములోగాని క్రైస్తవ్యంలో గాని తనను తాను హెచ్చించుకొనేటట్లు ప్రేరేపిస్తాడు. క్రీస్తుయొక్క ఆత్మ, ప్రజలను అంతకంతకు క్రిందకు వెళ్ళునట్లు నడిపిస్తాడు. ఆయన గోధువగింజవలె భూమిక్రిందకు వెళ్ళాడు మరియు ఆయన యొక్క శిష్యలందరు తప్పకుండా ఇటువంటి గుణలక్షణాలను కలిగియుంటారు.

ప్రభువైనయేసు యొక్క మరణములో ఆయన దీనత్వములో ఉన్న జ్ఞానాన్ని చూడగలము. ప్రభువైనయేసు వలె మరెవరు కూడా అన్యాయముగా తీర్పు తీర్చబడలేదు. అయినప్పటికిని ఆయన మౌనముగా తాను పొందిన గాయములకు, అవమానములకు, అన్యాయముగా తీర్పుతీర్చబడుటకును, నిందకును ఆయన విధేయత చూపించాడు. ఆయన తన శతృవులను శపింపలేదు. ఆయన ఒక్కసారికూడా బెదిరించలేదు. దూతల సహాయాన్ని అడుగలేదు. దేవుని కుమారునిగా తనకున్న హక్కులన్నిటిని విడిచిపెట్టాడు. కాని మానవులు బిగించిన పిడికిలి కలిగి అధికారమును, ఆస్తిపాస్తులను గట్టిగా పట్టుకొని మరియు వారు ఇతరుల చేత కొట్టబడినప్పుడు తిరిగి కొట్టాలని కోరుతారు. కాని ప్రభువైనయేసు తన సిలువమీద తన చేతులలో మేకులు కొట్టించుకొనుటకు ఆయనే తన చేతులు చాపాడు. ఎల్లప్పుడు ఇస్తు మరియు ఇస్తు మరియు ఇస్తూనే ఉండుటకు ఆయన ఎల్లప్పుడు చేతులు చాపియున్నాడు. చివరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఇది నిజమైన దీనత్వము.