యెహాను 16:33లో ప్రభువైనయేసు ఇట్లనెను "లోకములో మీకు శ్రమకలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను". పెద్దశ్రమలు గాని లేక చిన్నవిగాని మనము తప్పించుకొనెదమని ఆయన వాగ్ధానము చేయలేదు కానీ ఆయన జయించిన రీతిగా మనము కూడా జయించెదమని చెప్పారు. మనలను శ్రమలనుండి రక్షించుటకంటే జయించువారముగా మారి, మన యొక్క గుణ లక్షణములలో మార్పురావలెనని కోరుచున్నాడు లేక కొందరు చెప్పుచున్నట్లుగా మహాశ్రమలనుండి తప్పించుకొనుట నమ్మకమైనవారికి బహుమానం కూడా కాదు. కానీ సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించువారికి ఇతరులకంటే ఎక్కువశ్రమ కలుగునని చెప్పెను.(మార్కు 10:30) ఆయన తన శిష్యులకొరకు ఈ విధముగా ప్రార్ధించారు. నీవు లోకములో నుండి వారిని కాపాడుమని ప్రార్ధించెను (యెహాను 17:15). వారు శ్రమలను ఎదుర్కొన కుండునట్లు, శ్రమల కాలంలో కొనిపోవాలని ఆయన కోరలేదు.
మూడవ శతాబ్దములో క్రైస్తవులు రోమా ప్రభుత్వంలోని ప్రదర్శనశాలలో సింహాల మధ్యలో వేయబడి మరియు అనేక స్ధలములలో కాల్చబడిరి. ఆ శ్రమలనుండి ప్రభువు వారిని కాపాడలేదు. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు వాటి నోరును మూయించిన దేవుడు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు శిష్యులైన క్రైస్తవులను ఆ విధంగా కాపాడక వారి మరణంద్వారా దేవుడు మహిమపొందాడు. వారు యజమానుడైన యేసువలె శత్రువులనుండి కాపాడుటకు (సేవకుల) సైన్యమును పంపమని అడుగలేదు. వారు మరణం పొందునంతగా గొఱ్ఱెపిల్లను వెంబడించుటను, తన కుమారుని యొక్క పెళ్లికుమార్తె ఆ విధంగా సింహాలచేత చీల్చివేయబడుటయు మరియు వారు కాల్చబడుటయు పరలోకము నుండి దేవుడు చూచెను (ప్రకటన 14:4). "మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చెదను" అని మాత్రమే ప్రభువు వారితో చెప్పెను (ప్రకటన 2:10). ఈనాడు కూడా ప్రభువైన యేసు యొక్క శిష్యులు ఆయన నామమును బట్టి హింసించబడినప్పుడు భూమి మీద నుండి ప్రభువు వారిని
తీసుకొని వెళ్ళగలడు. అదే విధముగా మహా శ్రమలకు ముందుగా మనలనుకూడా పరలోకానికి తీసుకొనివెళ్ళడు. దానికంటే ఉత్తమమైన దానిని చేయును, మహా శ్రమలలో కూడా ఆయన మనలను జయించువారిగా చేయును.
మహా శ్రమలనుండి మనలను కాపాడుటకంటే చెడ్డదానినుండి కాపాడవలెనని ఆయన కోరుచున్నాడు. శ్రమలలో గుండా వెళ్ళుట ద్వారా మాత్రమే మనము ఆత్మీయముగా బలవంతులమగుదుమని తెలియును.
దురదచెవుల గల బోధకుల బోధను వినుచు సుఖభోగములను ప్రేమించుచున్న క్రైస్తవులకు ఈ వర్తమానం వింతగా ఉండును. కాని ఆదిమ సంఘములలో అపొస్తలులు దీనినే ప్రకటించిరి(అపొ14:12). దేవతలు మనుష్యరూపము దాల్చి మనయొద్దకు దిగి వచ్చియున్నారని కేకలువేసి, బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్యప్రసంగియైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి.
మన ఇంటిలోను మరియు పనిచేయుస్ధలములో మనము పొందుచున్న శ్రమలు, రాబోయే కాలములో పెద్దశ్రమలకు సిద్ధపరచుచున్నవి, అందువలన ఇప్పుడు మనము నమ్మకముగావుండవలసి యున్నది. దేవుడు ఇట్లనుచున్నాడు "నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టి?" (యిర్మియా 12:5) , ప్రకటన
1:9,10 లో "యేసునుబట్టి కలుగు శ్రమలో పాలివాడనని" యెహాను చెప్పుచున్నాడు. యేసుని హృదయపూర్వకముగా వెంబడించే ప్రతి శిష్యుడు, ఈ లోకంలో ఉన్నంత కాలము యేసును బట్టి కలుగు శ్రమలలో పాలివాడగును. యెహాను సౌఖ్యముగా ఉన్నపుడు ఈ ప్రత్యక్షత కలుగలేదు.
దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసిగావున్నప్పుడు అతడు ఈ ప్రత్యక్ష్యతను పొందెను(ప్రకటన1:9). కడవరి దినములలో క్రీస్తు విరోధిని బట్టి పరిశుద్ధులు పొందబోయే శ్రమలను గురించి వ్రాయుటకు అతడు కూడా శ్రమలలో గుండా వెళ్ళవలసి వచ్చెను.
శ్రమలలో గుండా వెళ్ళేవారికి పరిచర్య చేయుటకు, మనకు కూడా శ్రమలు అనుమతించి దేవుడు సిద్ధపరచును. క్రొత్త నిబంధనలో సహనము గొప్ప గుణలక్షణమైయున్నది. ప్రభువైన యేసు ఇట్లనెను, జనులు మిమ్మును శ్రమల పాలు చేసెదరు, అంతము వరకు సహించినవాడెవడో వాడే రక్షించబడును."(మత్తయి 24:9,13).