WFTW Body: 

పరిశుద్ధాత్మయొక్క పరిచర్య, త్రిత్వములో ఉన్న పరిచర్యలలో కంటికి కనబడని పరిచర్య. తన పరిచర్యకు ఎటువంటి గుర్తింపుకాని ఘనతనుగాని కోరక నిశ్శబ్దముగా కనబడకుండా పరిశుద్ధాత్ముడు ప్రొత్సహించి మరియు సహాయపడతాడు. తండ్రిని మరియు కుమారుడైన యేసును స్తుతించి, ఆయనను స్తుతించకపోయినను ఆయన సంతృప్తిపడతాడు. ఇది ఎంత సుందరమైన పరిచర్య.

అటువంటి ఆత్మతో నింపబడుట అనగా ఏమిటి? అనగా మనము కూడా ఆయనవలె అటువంటి పరిచర్య కలిగి అనగా నిశ్శబ్దముగా కంటికి కనబడకుండా ఎటువంటి ఘనతను కోరక ఇతరులు ఘనతపొందునప్పుడు తృప్తిపడేవారిగా ఉంటాము. ఇటువంటి ఆత్మతో మనము నిజముగా నింపబడియున్నామా?

కాని ఈనాడు "పరిశుద్ధాత్మలో నింపబడియున్నామని" చెప్పుకొనువారనేకులు, వారికున్న వరములను క్రైస్తవుల మధ్య ఉపయోగించుట ద్వారా ఘనతను కోరుచూ వారిని హెచ్చించుకొనుచు మరియు వారి కొరకు డబ్బును అడుగుచున్నారు. ఇది పరిశుద్ధాత్మయొక్క పరిచర్యకాదు. ఇది మరియొక నకిలీఆత్మ పరిచర్య. ఇటువంటి నకిలీ పరిచర్యను మరియు మోసమును సంఘములో బహిర్గతము చేయుట మన బాధ్యత.

పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందియున్నామనుటకు ముఖ్యమైన గుర్తు ఏమిటి? అపొ.కా. 1:8లో అది దేవునియొక్క శక్తి అని ప్రభువైనయేసు స్పష్టముగా చెప్పియున్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందియున్నామని అనుకొనుటకు భాషలు మాట్లాడుట ఒక గుర్తు అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. అపొస్తలులు కూడా దీనిని గూర్చి ఏమి చెప్పలేదు. ప్రార్థనలో కనిపెట్టుచున్న విశ్వాసుల దగ్గరకు వెళ్ళి "పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందియున్నారో మీకు ఏవిధముగా తెలుస్తుంది?" అని అడిగినయెడల, భాషలలో మాట్లాడుట అని వారు చెప్పియుండేవారు కాదు. శక్తిని పొందుతారని ప్రభువైనయేసు చెప్పారని వారు చెప్పెడివారు. నీవు ఈ విధముగా అడగవచ్చును, "నేను పరిశుద్ధాత్మను పొందియున్నానని నాకు ఏవిధముగా తెలుస్తుంది?" మన పాపములు క్షమించబడినవని దేవుడు మనకు నిశ్చయత ఇచ్చినట్లే పరిశుద్ధాత్మను కూడా పొందియున్నామని దేవుడు నిశ్చయత ఇస్తాడు. మన పాపములు క్షమించబడియున్నవని పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో సాక్ష్యమిచ్చినట్లే, మనము శక్తిని పొందియున్నామని సాక్ష్యమిస్తాడు. ఈ ముఖ్యమైన రెండు విషయములలో నీకు నిశ్చయత ఇవ్వమని నీవు దేవుని అడుగవచ్చును. కాబట్టి వారు శక్తికొరకు కనిపెట్టియున్నారు. కాని వారు శక్తిని పొందినప్పుడు అన్యభాషలలో మాట్లాడుట అనే వరాన్ని పొందారు.

ప్రతియొక్క క్రైస్తవుడు దేవునియొక్క శక్తి కలిగియుండుట దేవుని చిత్తమైయున్నది. శక్తి కలిగియుండుట అనగా నీవు గొప్ప సువార్తికుడవు అవుతావని కాదు. క్రీస్తు శరీరములో నీ స్వంత పరిచర్యను ఆసక్తి చేత నెరవేర్చగలుతావు. మానవ శరీరాన్ని గమనించండి. ఒక అవయవములో నుండి రక్తము ప్రవహిస్తేనే అది మానవ శరీరములో ఒక అవయవము అయియుంటుంది. రక్తము ప్రవహించని తయారుచేయబడిన హస్తము మానవశరీరములో అవయవము కాలేదు. అలాగే ఎవరయితే క్రీస్తు రక్తములో కడగబడతారో వారే క్రీస్తు శరీరములో అవయవములు అయియుంటారు. కొన్నిసార్లు రక్తము ప్రవహించినప్పటికిని ఒక చేయికి పక్షవాతం వచ్చి నిరుపయోగముగా ఉండవచ్చును. ఒకవేళ ఆ చేయి స్వస్థతను మరియు శక్తిని పొందినయెడల అది నాలుకగా మారుతుందా? మారదు. అది శక్తివంతమైన చేయిగా మారుతుంది. అలాగే ఒక పక్షవాతం గల నాలుక శక్తిని పొందినట్లయితే అది చేయిగా మారదు. అది ఒక శక్తివంతమైన నాలుక అవుతుంది. నీవు ఒక తల్లిగా ఉండుటకు దేవునిచేత పిలువబడి మరియు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందినట్లయితే నీవు సువార్తికురాలివి కాలేవు. అయితే ఆత్మతో నింపబడిన శక్తివంతమైన తల్లివి అవుతావు.

అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభజించబడి వారిలో ప్రతి ఒక్కరి మీద వాలెను అనగా మన శరీరమంతటిలో నాలుక చాలా ముఖ్యమైన భాగమనియు మరియు పరిశుద్ధాత్మ అగ్ని నాలుక మీద ఉండి మరియు ఎల్లప్పుడు ఆయన ఆధీనములో ఉంటుందని సూచిస్తుంది. అన్యభాషలు కూడా దీనికే సాదృశ్యముగా ఉన్నవి. ఇతరులను ఆశీర్వదించుటకు నీవు బోధకుడవు కాకపోయినా నీవు మాట్లాడేటప్పుడు నాలుకను ఉపయోగించాలని దేవుడు కోరుచున్నాడు. అయితే దాని కొరకు రోజుకు 24గంటలు వారానికి 7రోజులు నీ మాటలు పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఉండాలి.