WFTW Body: 

దేవునిని ఎరుగుటయే ఈ లోకములో అతిశ్రేష్టమైన విషయము. ఎందుకనగా మనము దేవునిని ఎరిగియున్నయెడల, మనము ఎదుర్కొనే ప్రతిపరిస్థితులలో ఏమి చేయవలెనన్నది ఎరుగుదుము. మనము బలమైన పునాది మీద నిలచియున్నాము కనుక లోకమంతయు మనలను వ్యతిరేకించినను ధైర్యముగా మనము ఎదుర్కొనగలము. దేవునిని ఎరుగుటకు సమయము పట్టును. కాబట్టి నీవు యౌవనస్థుడుగా ఉన్నప్పుడే దానిని ఆరంభించుము. దేవునిని ఎరుగుటకు, ఆయనతో పోల్చినప్పుడు ఈ లోకములో ఉన్నదంతయు పెంటగా పరిగణించడానికి సిద్ధంగా ఉండాలి. అనగా లోకస్థులు గొప్పగాయెంచే వాటిని బట్టి నీవు ఆకర్షించబడకుండుటయే గాక దానిని చెత్తగా చూచెదవు. పౌలు విషయంలో ఆవిధముగానే యున్నది (ఫిలిప్పీ 3:8).

నీవు డబ్బునుగాని సుఖసౌఖ్యములనుగాని మరియు ఘనతనుగాని లేక లోకములో గొప్పవాటినిగాని వెంటాడినయెడల, నిత్యత్వపు వెలుగులో ఒక దినమున నీ చేతులలో ఉన్నదంతయు చెత్తేనని గ్రహించెదవు. తనయొక్క శోధింపశక్యముగాని ఐశ్వర్యమును స్వతంత్రించుకొనుటకు ఎల్లప్పుడు దేవుడు మనలను పిలచుచుండగా వ్యర్థమైన వాటి కొరకు మన జీవితమును వ్యర్థము చేసుకొనియున్నామని కనుగొనెదము. కాబట్టి జ్ఞానము కలిగి భూవస్తువులను వాడుకొనుము (ఎందుకనగా మనం జీవించుటకు అవి అవసరము), కాని వాటిచేత కొనిపోబడవద్దు. ఎందుకనగా ఒక్కపూటి కూటికొరకు నీ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకోగలవు.

నీవు క్రైస్తవజీవితము గురించి తీవ్రముగా ఉన్నావని దేవుడు చూచినయెడల, దేవునితో నీకున్న సంబంధం విషయంలో నీవు మోసపోకుండునట్లు, నీ జీవితంలో చలించే వాటన్నింటిని ఆయన చలింపజేయును. నీ ఆత్మ కొరకు ఆయన ఎంతో ఆసక్తి కలిగియున్నాడు. కేవలము పుస్తకము(బైబిలు) ద్వారా కాని లేక వేరే వ్యక్తి ద్వారాగాని కాకుండా వ్యక్తిగతముగా నీవే ఆయనను ఎరిగి యుండవలెనని ఆయన కోరుచున్నాడు.

మనము ఇప్పుడే సరిచేసుకొనగలుగునట్లు మన నిజస్థితిని మనకు ప్రేమతో చూపించుచున్న దేవునికి స్తోత్రములు. మనము కేవలము పాపమును ద్వేషించి మరియు పవిత్రముగా ఉండుటయే సరిపోదు. ప్రభువైనయేసుతో వ్యక్తిగతముగా లోతైన సంబంధమును కలిగియుండాలి. లేనట్లయితే కేవలము నైతికంగా నిన్ను నీవు బాగుచేసుకొనే వాడవుగా ఉందువు. ప్రభువైనయేసుతో సన్నిహితమైన సంబంధమును కలిగియుండుటకు మొదటిగా నీకు తెలిసిన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి మరియు నిర్మలమైన మనసాక్షి కలిగియుండుటకు ప్రయాసపడుము. రోజులో ప్రభువుతో అనేకసార్లు మాట్లాడుటను అలవాటు చేసుకొనుము. ఈవిధముగా మాత్రమే, ఒకరోజు నీ చుట్టు ఉన్నదంతయు కూలిపోయి పడిపోయిన్నప్పుడు నీవు నిలబడగలవు.

'ప్రభువును ఎరుగుట మాత్రమే నిత్యజీవమై యున్నది' గనుక ఆయనను ఎరుగవలెననే గొప్ప కోరిక నాకు కలదు (యోహాను 17:3). నేను వ్యతిరేకించబడినప్పుడు మరియు ఇండియాలోను మరియు ఇతర దేశములలోనూ ఉన్న వేరే క్రైస్తవ గుంపులు మరియు పాస్టర్లచేత నిందించబడినప్పుడు, కేవలము ప్రభువును ఎరుగుటను బట్టి, నేను భంగపడక విశ్రాంతిలో ఉండి మరియు అందరిని ప్రేమించాను. మీరు కూడా ఆవిధముగా ప్రభువును ఎరుగవలెననియు మరియు అంతకంటె ఎక్కువగా ఎరుగవలెననియు కోరుచున్నాను.