WFTW Body: 

సంఘ నిర్మాణము కొరకు ప్రభువైనయేసువలె సమస్తము ఇచ్చెడివారే నిజమైన సంఘము నిర్మించగలరు.

"క్రీస్తు సంఘమును ప్రేమించి మరియు దానికొరకు తనను తాను అప్పగించుకొనెను"(ఎఫెసీ 5:27). ఈనాడు సంఘమును నిర్మించాలని కోరే ప్రతివారు ఈ త్యాగమును చేయవలెను. అనగా ప్రతిరోజు స్వజీవమును పూర్తిగా త్యాగము చేయవలెను. క్రీస్తుయొక్క శరీరము నిర్మించుట కొరకు దీనికంటే సులభమైన మార్గములేదు. మానవ చరిత్ర ఆరంభం నుండి ఈ నియమమును మనము చూచెదము.

కయీను కేవలము 'ఒక' అర్పణ దేవుని కొరకు తెచ్చియున్నాడు - దేవుడు దానిని నిరాకరించాడు. కాని హేబెలు తన మందలోని 'శ్రేష్టమైన' వాటిని అర్పణగా తెచ్చాడు - దేవుడు దానిని అర్పణగా అంగీకరించాడు(ఆది.కా. 4:3-5). కొంచెము వెల కలిగిన అర్పణలు తెచ్చే మతానుసారమైన క్రైస్తవులకు కయీను సూచనగా ఉన్నాడు. తమకున్న సమస్తాన్ని వెలగా చెల్లించి అర్పించే ఆత్మానుసారమైన విశ్వాసులకు హేబెలు సూచనగా ఉన్నాడు.

మోరియా పర్వతము మీద దేవుని పిలుపు ప్రకారము అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు అది తన జీవితములో అత్యంత గొప్ప త్యాగమైయున్నది. అతడు హేబెలును అనుసరించియున్నాడు (ఆది.కా. 22వ అధ్యాయం).

1000 సంవత్సరముల తరువాత అదే పర్వతము మీద(అరౌనా కళ్ళములో) దావీదు అర్పణ అర్పించి మరియు ఈ విధముగా చెప్పాడు, "వెల యియ్యక నేను తీసుకొనిన దానిని యెహోవాకు దహనబలిగా అర్పించను"(2సమూయేలు 24:24).

దేవుడు అబ్రహాము మరియు దావీదుయొక్క అర్పణలను చూచి అదే మోరియా పర్వతము మీద అరౌనా కళ్ళమందు సొలొమోనుకు దేవాలయము కట్టమని చెప్పాడు (2దిన 3:1).

ఎవరైతే త్యాగపూరితమైన ఆత్మను కలిగియుంటారో వారితో మాత్రమే దేవుడు తన ఆత్మీయ మందిరమును నిర్మిస్తానని దేవుడు చూపిస్తున్నాడు. పెండ్లికుమార్తెయైన యెరుషలేమును అటువంటివారు మాత్రమే నిర్మించగలరు (ప్రకటన 21:2). ఇతర క్రైస్తవులందరూ వేశ్యయైన బబులోనును మాత్రమే నిర్మించగలరు (ప్రకటన 17,18 అధ్యాయములు).

మతానుసారమైన ప్రజలు మరియు ఆత్మీయానుసారమైన ప్రజలు అను రెండు ప్రవాహములు కయీను మరియు హేబెలు ద్వారా ఆరంభమైనవి. ఇశ్రాయేలు చరిత్రలో అబద్ధప్రవక్తలు మరియు నిజ ప్రవక్తల ద్వారాను, ప్రభువైనయేసు మరియు పరిసయ్యుల ద్వారాను, చివరకు బబులోను మరియు యెరుషలేములో ఈ రెండు ప్రవాహములు చూడగలము (ప్రకటన 17,18,21 అధ్యాయములు).

చాలామంది విశ్వాసులు దేవదూతలను ప్రభువైనయేసును శరీరధారిగా చూడాలని ఆశపడతారు కాని మనమైతే ఆయన భూమిమీద జీవించిన విధానములో యేసు జీవములో ఉన్న మహిమను చూడాలని ఆసక్తి కలిగియుండాలి. మనం వెంబడించుటకు ఇదియే మాదిరి.

పౌలు ఇట్లు అన్నాడు, "నా శరీరములో మంచిది ఏదియు నివసించదు.. నేను ఎంత దౌర్భాగ్యుడను" (రోమా 7:18,24). దీనిని బట్టియే తన్ను తాను పవిత్రపరచుకొనుటకు ఎంతో ఆసక్తి కలిగియున్నడు. మన శరీరంలో ఉన్న భ్రష్టత్వమును గూర్చిన ప్రత్యక్షత మనకు కూడా అవసరము. అప్పుడు మాత్రమే "దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందుము"- ఆ విధముగా సంఘము పవిత్రతలో కాపాడబడుతుంది (2కొరింథీ 7:1).

వీటిని మనము కేవలము పవిత్రమైన సిద్ధాంతములుగా విశ్వసించి బోధించినట్లయితే మనము దాని శక్తిని అనుభవించకుండా కేవలము పైకి భక్తి గలవారమై యుండెదము. ఇవి సిద్ధాంతముల కంటే మనకు ఎంతో ఎక్కువై ఉండాలి. అవి మనకు ప్రత్యక్షతగా మారి మన జీవితాంతం ఆ ప్రత్యక్షతలో అభివృద్ధి చెందాలి. మన జీవితములో వచ్చే అనేక శోధనలను మనము నమ్మకముగా ఎదుర్కొని మరియు పోరాడుచూ ఉన్నట్లయితే మన అంతరంగ జీవితములో క్రీస్తువలె లేని అనేక విషయములను ఆత్మ మనకు బయలుపరచును. అప్పుడు వాటినుండి మనము పవిత్రపరచుకొనగలము.

అటువంటి ప్రత్యక్షతను ఎల్లప్పుడూ పొందకపోయినట్లయితే మనము సంఘమును నిర్మించుట అసాధ్యము. మన శరీరములో ఉన్న భ్రష్టత్వమును గూర్చి ప్రత్యక్షత పొందకుండా "పరిశుద్ధతను" పొందినట్లయితే అది కేవలము పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన నీతిగలిగి మరియు పాతనిబంధన పరిశుద్ధులవలే ఉందుము. దానిని బట్టి మన తోటివిశ్వాసులలో మనకు గుర్తింపు రావచ్చుగాని దేవుని దృష్టిలో మనము సంపూర్ణులముకాము (ప్రకటన 3:1,2).

మనకు శోధన వచ్చినప్పుడు ప్రభువైనయేసు మాదిరి చూడనట్లయితే, మనం ఇప్పటికీ ఆత్మీయముగా దిగజారిన వారమగుదుము.