WFTW Body: 

అనేకులు రక్షింపబడునట్లు తమ సొంతమును ఏదియూ కోరలేదని పౌలు చెప్పుచూ మరియు తరువాత క్రీస్తును పోలి నడుచుకొను రీతిగా మనము కూడా నడుచుకొనవలెనని చెప్పుచున్నాడు (1 కొరింథీ 10:33 మరియు 11:1).

మనము మోహపు చూపును, కోపమును, ద్వేషమును, ధనాపేక్ష మొదలగు వాటిని నుండి విడుదల పొందినప్పటికిని స్వార్థమనే పాపము అనే వేరు నుండి విడుదల పొందకపోవచ్చు. లూసిఫరు మరియు ఆదాము వ్యభిచారము ద్వారాగాని లేక హత్య ద్వారా లేక కొండెములు చెప్పుట ద్వారాగాని లేక మోహపుచూపులు చూచుట ద్వారాగాని పాపము చేయలేదు. వారు వారియొక్క స్వార్థము కొరకు లాభము అపేక్షించుట వలన పాపము చేసారు. స్వార్థముతో మన సొంతమును కోరుటయే పాపమంతటికి మూలము.

ఈ చెడ్డవేరుమీద గొడ్డలి వేయుట ద్వారానే మన జీవితము యొక్క గమ్యము మార్చబడును. లేనట్లయితే మనము అనేక పాపములలో జయం పొందినప్పటికిని మన సొంతలాభమును మరియు ఘనతను కోరెదము. అందువలననే పాపముమీద జయమును బోధించేవారు కూడా పరిసయ్యులుగా మారుతున్నారు.

కాబట్టి పౌలువలె స్వార్థంనుండి విడుదల పొందవలెనని తీవ్రముగా కోరినయెడల, "అనేకులు రక్షింపబడినట్లు" పౌలువలె కోరెదము (1 కొరింథీ 10:33). 1 కొరింథీ 10:32లో మూడు రకముల ప్రజల గురించి చెప్పారు. అనగా "యూదులు, అన్యులు మరియు సంఘము". వీరు పాత నిబంధనను మరియు నిబంధనలేని వారిని మరియు క్రొత్త నిబంధనలో ఉన్న వారిని చూపించుచున్నారు. వీరు రక్షణ పొందవలెనని అతడు ఎంతో కోరియున్నాడు. ఈనాడు మన మధ్యలో కూడా మూడు రకముల ప్రజలు ఉన్నారు. వారు ఎవరనగా పాపము మీద జయము పొందని విశ్వాసులు(పాత నిబంధన), అవిశ్వాసులు(ఏ నిబంధన లేనివారు) మరియు జయములో జీవించుచున్న యేసుయొక్క శిష్యులు(క్రొత్త నిబంధన). ఈ ప్రజలందరి యెడల మన వైఖరి ఇట్లుండవలెను: "నేను నా సొంతమును కోరను గాని వారి శరీరములో నివసించుచున్న పాపమునుండి వారు రక్షింపబడాలని వారి యొక్క మేలునే కోరుచున్నాను" . పరలోకమునుండి భూమిమీదకు దిగివచ్చునప్పుడు ప్రభువైన యేసు యొక్క వైఖరి కూడా అదియే.

విశ్వాసులు కూడా ఇటువంటి వైఖరి కలిగియున్నప్పుడు మాత్రమే, అనగా "అనేకులు రక్షింపబడవలెనని కోరుచున్నాను కాని నా సొంతమును కోరను" అను వైఖరి కలిగియున్నప్పుడే క్రీస్తు శరీరము అను సంఘము నిర్మించబడుతుంది. లేనట్లయితే గొప్ప సందేశములు చెప్పినప్పటికిని వారి యొక్క ఘనతను పొందుటకే చేసెదరు.

ప్రభువైన యేసు ఆయన సొంతమును కోరలేదు. ఆయన ఎల్లప్పుడు తండ్రి మహిమనే కోరియున్నారు. ఇది మాత్రమే నిజమైన ఆత్మీయత మరియు ఇంతకంటే తక్కువది కాదు. ఒక వ్యక్తి జీవించు ఉద్దేశ్యమును బట్టి అతడు దైవభక్తి గలవాడా లేక పాపి అని చెప్పవచ్చును . ఎందుకంటే కొన్ని పాపములు జయించుట ద్వారా కూడా తన స్వార్థము కోరుటలేదని ఋజువు పరుచుచున్నాడు. ప్రభువైన యేసు మరొక సందర్భములో చెప్పిన రీతిగా "కొన్నిటిని విడిచి, కొన్నిటిని చేయవలసియున్నది".