WFTW Body: 

మనము సంవత్సరాంతమునకు వచ్చియుండగా చాలామంది సహోదరసహోదరీలు గతములో వారు చేసిన పాపములను బట్టి, దేవుని విషయములో ఓడిపోయినందువలన ఇప్పుడు వారి జీవితములో దేవునియొక్క పరిపూర్ణ చిత్తమును నెరవేర్చాలేమేమోనని నిరాశపడెదరు.

ఈ విషయములో మన స్వంత జ్ఞానమును లేక మన తర్కాన్ని ఆధారము చేసుకొనక లేఖనములు ఏమి చెప్పుచున్నవో చూచెదము. ఆదియందు దేవుడు భూమ్యాకాశముల సృజించెను" (ఆదికాండము 1:1) అని బైబిలు ఆరంభమగుటను గమనించండి. దేవుని చేతిలో నుండి పరిపూర్ణము కానిది కాని లేక పూర్తికానిదేదియు రాదు కాబట్టి దేవుడు సృజించినప్పుడు భూమ్యాకాశములు పరిపూర్ణమైనవైయుండును. కాని ఆయన సృజించిన తరువాత కొందరు దూతలు పడిపోయిరని యెషయా 14:11-15 మరియు యెహెజ్కేలు 28:13-18లోను చెప్పబడినది. అప్పుడు భూమి ఆదికాండము 1:2లో చెప్పినరీతిగా "శూన్యముగాను, నిరాకారముగాను, చీకటిగాను ఉండెను". ఆదికాండము 1వ అధ్యాయములో తరువాత ఆ నిరాకారముగాను, శూన్యముగాను, చీకటిగాను ఉన్న భూమిమీద దేవుడు పనిచేసి మరియు చాలామంచిదిగా చేసి, "చాలా మంచిదిగా" ఉండెనని దేవుడు చెప్పెను (ఆదికాండము 1:31). ఆదికాండము 1:2,3లో దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచు మరియు దేవుడు వాక్యముతో మాట్లాడినప్పుడు ఆ విధముగా మారెను, ఈనాడు దీనిలో మనకున్న వర్తమానమేమిటి? అదేమిటనగా మన జీవితములో మనము ఎంత ఘోరముగా, ఎన్ని సార్లు ఓడిపోయినప్పటికిని మరియు మన జీవితములను ఎంత ఘోరముగా పాడుచేసుకున్నప్పటికినీ, దేవుడు తన యొక్క ఆత్మద్వారాను మరియు వాక్యముద్వారాను మన జీవితములలో మహిమగల కార్యములను చేయును. దేవుడు భూమ్యాకాశములను సృజించినప్పుడు, ఆయనకు పరిపూర్ణమైన ఉద్దేశ్యము కలదు. కాని లూసిఫరు ఓటమి ద్వారా ఈ ఉద్దేశ్యము(ప్రణాళిక)ను ప్రక్కకు పెట్టవలసి వచ్చింది. కాని దేవుడు భూమ్యాకాశములను ఆ దౌర్భాగ్యస్థితి నుండి విడిపించి "చాలా మంచిదిగా" చేశాడు.

తరువాత ఏమి జరిగిందో చూచెదము. ఆదాము మరియు హవ్వ మరలా మొదటి నుండి ఆరంభించియున్నారు. దేవుడు వారి విషయములో కూడా పరిపూర్ణమైన ప్రణాళికను కలిగియున్నాడు. అందులో వారు మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములు తిని పాపము చేయుట ఉండకపోవచ్చును. ఆ ప్రణాళిక ఏదైనప్పటికీ, వారు ఆ నిషేధించబడిన చెట్టు ఫలము తిని మరియు ఆ ప్రణాళికను భంగపరిచారు. వారు ఇంక ఏ మాత్రమును దేవుని ప్రణాళిక నెరవేర్చలేదని తర్కించవచ్చును. కాని ఏదేను తోటలో దేవుడు వారిని కలుసుకొనుటకు వచ్చినప్పుడు, వారు ఇక మీదట ఆ ప్రణాళికలో కాకుండా రెండవ స్థాయిలో జీవించవలెనని వారితో చెప్పలేదు. ఆదికాండము 3:15లో స్త్రీ సంతానము, సర్పము యొక్క తలమీద కొట్టునని దేవుడు వాగ్దానము చేశాడు. ప్రభువైన క్రీస్తు మానవాళి పాపములకొరకును మరియు అపవాదిని నశింపజేయుటకును కల్వరిపై మరణించెను.

ఇప్పుడు ఈ వాస్తవమును చూసి మరియు దాని కారణమును చూచెదము. నిత్యత్వము నుండి ప్రభువైన క్రీస్తు మరణించుట దేవుని నిత్యసంకల్పములో ఉన్నది. "జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్ల" (ప్రకటన 13:8). మరియు ఆదాము మరియు హవ్వ పాపము చేసి, దేవునికి అవిధేయత చూపినందువలన ప్రభువైన క్రీస్తు మరణించాడని మనకు తెలియును. కాబట్టి ఆదాము ఓడిపోయినప్పటికినీ, ప్రభువైన క్రీస్తు లోకపాపముల కొరకు మరణించవలెననే దేవుని నిత్యసంకల్పము నెరవేరింది. ఆదాము పాపము కొరకు మాత్రమేగాక కల్వరి సిలువ దేవుని ప్రేమను మనకు వెల్లడిపరచింది.

కాబట్టి ఆరంభమును నుండి బైబిలులో నుండి దేవుడు మనకు తెలియచేయవలెనని కోరిన వర్తమానమిదియే. ఓడిపోయిన మానవుని ఆయన తీసుకొని మరియు అతని జీవితములో దేవుని సంకల్పమంతయు నెరవేరునట్లు చేయును. ఇదియే మానవునికి దేవుని వర్తమానము మరియు దీనిని మనము మరిచిపోకూడదు. అనేకసార్లు ఓడిపోయిన వ్యక్తులలో కూడా దేవుడు తనయొక్క అతిశ్రేష్టమైన సంకల్పము నెరవేరునట్లు చేయగలడు. ఎందుకనగా ఓటముల ద్వారా కూడా మనము కొన్ని మరచిపోలేని పాఠములు నేర్చుకొనుట దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళికయైయున్నది.

ఎన్ని పెద్ద తప్పులు చేసినను లేక ఎన్ని సార్లు ఓడిపోయినను, నీవు దేవునితో క్రొత్తగా ఆరంభించవచ్చును. దేవుడు నీ జీవితములో కూడా అద్భుతమైన మహిమకరమైన కార్యము చేయగలడు. కాబట్టి మనము "విశ్వాసము వలన బలముపొంది, దేవుని మహిమపరిచెదము" (రోమా 4:20). ఇప్పటి వరకు మనకు అసాధ్యమనుకున్న వాటిని రాబోయే దినములలో దేవుడు చేస్తాడని నమ్మెదము. వారు ఎంత ఘోరముగా ఓడిపోయినప్పటికి, దీనులై మరియు దేవునియందు విశ్వాసముంచి, యధార్థముగా వారి ఓటములను ఓప్పుకొనినట్లయితే, పెద్దవారైనను లేక చిన్నవారైనను వారికి నిరీక్షణ ఉన్నది. ఆ విధముగా మనమందరము మన ఓటములనుండి నేర్చుకొని మరియు మన జీవితములలో దేవుని పరిపూర్ణమైన సంకల్పము నెరవేరునట్లు సాగిపోయెదము. మరియు రాబోయే యుగములలో, పూర్తిగా ఓడిపోయినవారికి మన సాక్ష్యమును వారికి చూపించి, దేవుడు వారిని ప్రోత్సహించును. ఆదినమున, "క్రీస్తుయేసునందు అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచును" (ఎఫెసీ 2:6). హల్లేలుయా!