WFTW Body: 

"భయం" అనేది సాతాను ఉపయోగించే ప్రధాన ఆయుధం. అతడు ఎల్లప్పుడూ దానిని ఉపయోగించును. విశ్వాసులు ఇతరులను భయపెట్టినప్పుడు లేక బెదిరించినప్పుడు (వారికి తెలియకుండానే) వారు సాతానుతో సహవాసం కలిగియున్నారు. ఎందుకంటే వారు సాతాను ఆయుధం వాడుతున్నారు. "దేవుడు మీకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు" (2తిమోతి 1:7). భయం ఎల్లప్పుడు సాతాను ఆయుధంగా ఉంది. కావున మనం మనుష్యుల బెదిరింపులకు గాని వారి కుయుక్తులకుగాని భయపడకూడదు. అటువంటివారు విశ్వాసులమని పిలుచుకొనినను, సాతాను అనుచరులై ఉన్నారు. మన జీవితకాలమంతయు ఈ పాఠం నేర్చుకొనవలెను.

ఇతరులు భయపడునట్లుగా మనం బోధించకూడదు. నరకం గూర్చి ప్రజలను హెచ్చరించుటకు, బెదిరించుటకు తేడా ఉంది. యేసుప్రభువు ఎవరిని బెదిరించలేదు. అనేక వచనాలు చెప్పుట ద్వారా బోధకులు మనల్ని నేరారోపణలోనికి గాని నిందారోపణలోనికి గాని తీసుకురానీయకూడదు. వారు సంఘమును విడిచిపెట్టునప్పుడు లేక వారు దశమభాగము ఇవ్వనప్పుడు బోధకులు దేవుని తీర్పును బట్టి విశ్వాసులను బెదిరించెదరు. ఇవన్నియు సాతాను కుయుక్తులు.

"దేవుని భయం" అనే సువాసనను వెంటనే పసిగట్టుట ఎంతో ముఖ్యమైనది (యెషయా 11:3). ఒక కూడలిలో ఉన్నప్పుడు, మనం అనేక స్వరములు వినుచున్నప్పటికి పోలీసు కుక్క నేరగాని వాసన పసిగట్టినట్టు, ఆయనకిష్టమైనది ఏదో అది గుర్తించుటకు, దేవుని మహిమపరచు సరియైన మార్గమును ఎన్నుకొనుటకు పరిశుద్ధాత్మ మనల్ని ఎంతో సున్నితముగా చేయాలనుకుంటున్నాడు. ఈ సువాసనను మీరు త్వరితముగా గుర్తించులాగున తయారవుదురు గాక. మీరు పాపముతో మరియు భ్రష్టత్వముతో ఉండిన దేశములో నివసించుచున్నారు. మిమ్మును మీరు పవిత్రులుగా ఉంచుకోండి.

సాతాను మరొక ప్రధానమైన ఆయుధం నిరుత్సాహం. నిరాశ(నిరుత్సాహం) ఎల్లప్పుడు సాతాను నుండి వచ్చును గాని దేవుని నుండి కాదు. శారీరకముగా గాని చదువు విషయంలో గాని లేక ఆత్మీయంగా గాని లేక ఏ విషయములో అయినా ఏది మిమ్మల్ని నిరాశపరచనీయకండి.

పాపం చేయునట్లు మొదటిగా సాతాను మిమ్ము నిరాశపడునట్లుగా చేయును. మీరు జాగ్రత్తగా లేనియెడల, ఒంటరితనం మరియు ఇంటిధ్యాస మిమ్ము నిరాశపరచును. వాటితో మీరు పోరాడి జయించవలెను. దేవుడు మీకు కృపనిచ్చును.

మీరు చూడలేని అపాయాలను మరియు మీరు అనుకొనని వాటిని గూర్చి దేవుడు మిమ్మల్ని ముందుగానే హెచ్చరించును గాక. ప్రభువు మీకు జ్ఞానమునిచ్చి కాపాడును గాక.

విశ్వాసముతో అడిగిన వారికి దేవుడు జ్ఞానమును వాగ్ధానం చేశాడు (యాకోబు 1:5). మీరు అడగని యెడల పొందరు. లేక మీరు అవిశ్వాసముతో అడిగినను పొందరు.

మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలని కాదుగాని, క్రీస్తువలె రూపాంతరము చెందవలెనని దేవుడు కోరుచున్నాడని గుర్తుంచుకొనుడి. మీకు సరిపోయే భూసంబంధమైన ప్రతీ ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చును. కాని అది ప్రాముఖ్యం కాదు- ఎందుకనగా డబ్బు ఎక్కువ కూర్చుకొను పనిని దేవుడు లోకస్థులకు ఇచ్చాడు, మనకు కాదు (ప్రసంగి 2:26 చూడండి).