WFTW Body: 

ప్రతిదినము దేవుని మాటలు వినేందుకు సమయాన్ని కేటాయించండి.

బైబిలు గ్రంథములో మొట్టమొదటి అధ్యాయంలోనే తరచుగా మనకు కనబడే పదజాలము: "అప్పుడు దేవుడు చెప్పెను".

నిరాకారముగా ఉన్న భూమిని మళ్ళీ సృష్టిస్తున్న మొదటి ఆరు దినాల్లో ఆయన ప్రతిరోజు ఏదో ఒక మాట పలికాడు. ఆయన మాట్లాడినప్పుడల్లా ఆ భూమి మరింత మంచి ఆకారాన్ని సంతరించుకుంది.

కాబట్టి బైబిలు గ్రంథములోని మొట్టమొదటి పేజీలోనే మనము ఒక అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని నేర్చుకుంటున్నాము - అదేమిటంటే ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు మనము విని తీరాలి. అలా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న మాటలకు విధేయులమైతే మనము శ్రేష్టమైన మరియు మంచి ప్రయోజనకరమైన క్రైస్తవులముగా మార్చబడతాము.

మామూలు బైబిలు పఠనమునకు దేవుడు చెప్పే మాటలు వినుటకు మధ్య చాలా వ్యత్యాసమున్నది. ప్రతిదినము బైబిలు చదివిన ప్రజలే ప్రభువును సిలువ వేశారని గుర్తుంచుకోండి. వారు తమ బైబిళ్ళు చదివారు గానీ తమ హృదయాల్లో దేవుడు మాట్లాడుట వారెన్నడూ వినలేదు (అపొ.కా.13:27). అటువంటి ప్రమాదం మనముకూడా ఎదుర్కొంటాము. ఆ తరువాత మనము కూడా వారిలా గ్రుడ్డి వాళ్ళం కాగలము.

దేవుడు మనతో ప్రతి రోజు మాట్లాడాలని ఆశిస్తున్నట్టు కూడా ఆదికాండము మొదటి అధ్యాయము మనకు బోధిస్తుంది.

అయితే చాలామంది క్రైస్తవులు ప్రతిరోజు దేవుని మాటలు వినరు. వారు మానవులు రచించిన గ్రంథాలు మాత్రమే చదువుతారు.

ఆదికాండము మొదటి అధ్యాయములో దేవుడు మాట్లాడినప్పుడల్లా మానవాతీత సంఘటనలు జరిగినట్లు చదువుతాము. దేవుడు మొదట మన హృదయాలతో మాట్లాడిన మాటలను మనం బోధించిన పక్షంలో మన పరిచర్యలోకూడా పై విధంగా మానవాతీత కార్యాలు జరిగి తీరుతాయి.

తనతోపాటు ఇతరులను కూడా రక్షించుకోవాలంటే తాను బోధించుటకు ముందుగా తన సొంత జీవితం గూర్చి జాగ్రత్తపడమని తిమోతితో పౌలు చెప్పాడు (1 తిమోతి 4:16). మనలను మనం మోసం చేసుకొనుట నుండి తప్పించుకునేందుకు గల ఏకైక మార్గం, మనతో దేవుడు మాట్లాడుతున్న మాటలను వినుటయే.

మరియవలె కూర్చొని వినకుండా, తీరికలేని పనిలో మునిగిపోయిన మార్తను యేసు ఒకసారి గద్దించారు. మరియ చేసిన పనే జీవితంలో అవసరమైనదని యేసు చెప్పారు (లూకా 10:42). ''ప్రభువా, మాట్లాడుము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు" అని సమూయేలు చెప్పినట్లు మనందరి వైఖరి ఉండాలి.

బైబిలు గ్రంథములోని మొట్టమొదటి పేజీలోనే మనమేమి చూశాము? దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే ఏదో ఒకటి జరిగింది. వెలుగు కలిగింది, జలరాశి నుండి భూమిపైకి వచ్చింది, చెట్లు, చేపలు, పశువులు మొదలైన జీవరాసులు సృష్టించబడ్డాయి.

దేవునికి అనుకూలమైన దానిని నెరవేర్చక, ఆయన పంపిన కార్యమును సఫలముచేయక దేవుని నోటినుండి వెడలిన మాట వృధాగా తిరిగిరాదని యెషయా 55:10-11 చెబుతుంది.

ప్రపంచములోని ప్రజలందరూ అత్యంత విలువను ఆపాదించే రెండు మాటల్ని ఈ వాక్యాల్లో గమనించండి - "విజయం", "కార్యసాధన".

మనమంతా మన జీవితాల్లో ఏదో నెరవేర్చాలని, సాధించాలని కోరుకుంటాము. నెరవేర్పు, సఫలత కోసం ఆయా పద్ధతుల్ని ప్రయోగించి చూచేందుకు సరిపోయినంత సమయంలేదు. ఎందుకంటే మన జీవితము చాలా చిన్నది- ఇక ఆత్మీయ విషయాల్లో అసలు చేయలేము. దేవుని పని చేయుటకు మనము ఏదో ఒక పద్ధతిని ఏర్పరచుకొని 20 సంవత్సరముల తరువాత దేవుని పని చేసే విధానము ఇది కాదని మనము తప్పుడు మార్గములో ఉన్నామని తెలుసుకొనేటట్లుగా మనము చేయకూడదు. దేవుడు మాట్లాడునప్పుడు మనము ఆయన మాటలు విన్నట్లయితే సమయమును వృథాచేయకుండా మనము కాపాడబడతాము. ఇది మనకు ఎల్లప్పుడు విజయమును మరియు కార్యసిద్ధిని కలుగజేస్తుంది.