WFTW Body: 

ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుటయే కాదు దేవునియొద్ద నుండి వినాలి. ఆయనతో మాట్లాడుటకంటే వినుట ముఖ్యమైయున్నది. నీవు ఫోన్‍లో నీ కంటె పెద్దవాడైన దైవజనుడితో మాట్లాడేటప్పుడు, మాట్లాడుటకంటే ఎక్కువగా వినెదవు. అలాగే దేవునితో మాట్లాడుట కంటే వినుటయే నిజమైన ప్రార్థన.

నీకైదేన చేయవలెనని అనిపించినప్పుడు, దానిని గురించి నిర్మలమైన మనస్సాక్షి కలిగియుండుటకు చిన్న ప్రార్థన చేసి ఈ విషయములో నెమ్మది ఉన్నదని ఊహించుకొని మరియు వెంటనే దానిని చేయుట ద్వారా నిన్ను నీవు మోసపరచుకొనెదవు. ఈ విధముగా నీవు దేవునిచిత్తమును నీవు పూర్తిగా పోగొట్టుకొనెదవు. నీవు ఎంత ముఖ్యమైన నిర్ణయము తీసుకొనగోరితే అంత ఎక్కువగా దానిని గూర్చి ప్రార్థించి నిర్ణయించుకొనవలెను.

శరీరము ప్రాముఖ్యముగా సోమరితనమును మరియు సుఖభోగములను ప్రేమించును. దీనిని బట్టి నీవు మోసపోవద్దు. దేవుని చిత్తమును కనుగొనుటకు నీవు ప్రయత్నించుచున్నప్పుడు నీకు వచ్చే తలంపులను విసర్జించుము. నీ తలంపులకును మరియు దేవునియొక్క తలంపులకును, పరలోకానికి మరియు భూలోకమునకు ఉన్నంత తేడా ఉన్నది (యెషయా 55:8,9). నీకంటే దేవునియొక్క మార్గములు ఎంతో ఉన్నతమైనవి. అందువలన నీవు దేవునికి లోబడి అత్యంతశ్రేష్ఠమైన వాటిని పొందవలెనని ఆయన కోరుచున్నాడు.

కాలేజీలో ఒక విద్యార్థిగా, ఎక్కువగా ప్రార్థించుటకు నీకు ఖాళీ లేకపోవచ్చును. కాని నిర్ణయము తీసుకొనునప్పుడు దేవునియొద్ద కనిపెట్టే వైఖరి నీవు కలిగియుండాలి. కాబట్టి ప్రతిదినము సాధ్యమైతే ఉదయకాలము కొంత సమయమును దేవునితో గడుపుము. ఉదయ కాలము సాధ్యపడనట్లయితే, వేరొక సమయములో ప్రార్థించుము. లేనట్లయితే నీకు వచ్చుచున్న తలంపుల ద్వారా నీ జీవితముపట్ల దేవుని చిత్తమునుండి తొలగిపోగలవు.

ప్రతిదినము దేవుడు నీతో మాట్లాడాలని కోరుచున్నాను. బైబిలులో మొదటి పేజీలో ఉన్న వర్తమానమేమనగా, "మొదటి రోజున దేవుడు పలికెను..... రెండవ రోజున దేవుడు పలికెను..... మూడవ రోజున దేవుడు పలికెను..... నాల్గవ రోజున దేవుడు పలికెను..... ఐదవ రోజున దేవుడు పలికెను..... మరియు ఆరవ రోజున దేవుడు పలికెను" . ప్రతిదినము దేవుడు మాట్లాడినప్పుడు ఏదో ఒకటి జరిగి చివరకు దాని ఫలితముగా చాలా మంచిదిగా చేసెను. ప్రతిదినము దేవునియొద్ద నుండి వినినట్లయితే నీ జీవితములో కూడా ఆవిధముగానే జరుగును. "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును" అని ప్రభువైనయేసు చెప్పారు (మత్తయి 4:4). నీ జీవితంతో ప్రతిదినము దేవునికి మొదటి స్థానమును ఇవ్వనియెడల సులభముగా వెనుకంజ వేయుదువు.

దేవునియొద్దనుండి వినుట అనగా కేవలం బైబిలు చదువుట మాత్రమేకాదు గాని, దినమంతయు దేవునికిష్టమైన దానిని చేయుచు మరియు ఆయనకిష్టము లేనిదానిని విసర్జించుచు మరియు నీ మనస్సాక్షిలో పరిశుద్ధాత్మ స్వరమును వినాలి.

దేవుడు మన ప్రార్థనలను ఎల్లప్పుడు వినాలని కోరుచున్నాడు. కాని ఆయన యొద్దనుండి జవాబు పొందుటకు మనము కనిపెట్టాలి. కొన్నిసార్లు అది "కాదు" అయియుండవచ్చును లేక కొన్నిసార్లు "వేచియుండుము" అయియుండవచ్చును. ట్రాఫిక్ లైట్స్‍లో ఉన్నట్లే ఎరుపు, పసుపు మరియు పచ్చరంగువలె దేవుని జవాబు కూడా "కాదు", "వేచియుండుము" లేక "అవును" అయియుండవచ్చును.