WFTW Body: 

తమ దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండుటకు సైనికులు దేశం కొరకు ఎంతో త్యాగం చేస్తుండగా, సాతాను అవమానపరచబడి ప్రభువు పేరు మన జీవితాలలో ప్రతి విషయములో మహిమ పరచబడునట్లు మనం ఇంకెంతగా (మన జీవితాలతో సహా) త్యాగం చేయుటకు సిద్ధంగా ఉండాలి.

మీ పనులన్నిటిలో అధ్బుతముగా దేవుని కృపను పొందుచున్నారని నమ్ముచున్నాను. మీ చదువు, పనుల కోసం మీకు ఆలోచనలు ఇవ్వమని దేవుణ్ణి అడగవచ్చు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో అడగండి - ఆయన ఎటువంటి అద్భుతాలు చేయగలడో చూడండి. అటువంటి పరిస్థితులలో ఆయనను నిరూపించినప్పుడే, మన విశ్వాసం బలపడుతుంది. అన్ని సమయాలలో దేవుణ్ణి ఘనపరచండి. దేవుని ఘనపరచువారికి, వారి జీవితంలోని అన్ని విషయాలలో శ్రేష్ఠమైన దాన్ని పొందుతారు. నేను తిరిగి జన్మించినప్పటి నుండి దాన్ని నిరూపించాను ఎంతగా అంటే ప్రతి స్థలమునకు వెళ్ళి ఈ క్రింది విషయాలు చెప్పాలని కోరుకున్నాను.

- అన్ని విషయాలలో దేవుణ్ణి ఘనపరచండి

- ఎల్లప్పుడు దేవుణ్ణి మొదటిగా ప్రేమించండి

- ఎల్లప్పుడు మీ మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకొండి

అప్పుడు మాత్రమే మీరు విలువైన జీవితం జీవించగలరు

ఈ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారికున్న ప్రతిభ(తలాంతుల)నుబట్టి మరియు భూమిమీద వారు సాధించిన దాన్ని బట్టి విలువైన జీవితం జీవించగలమని అనుకొనే వారు అత్యంత బుద్ధిహీనులు. అంతిమంగా వీటిద్వారా ఎవ్వరూ సంతృప్తి చెందరు.

యోహాను 15 అద్భుతమైన అధ్యాయం. నిలిచిఉండటం అనేది ఆందోళన, ఉద్రిక్తత లేకుండా (ద్రాక్షావళ్ళిలోని తీగలా) సంపూర్ణ విశ్రాంతి యొక్క చిత్రం - ఇది మన జీవితంలోని ప్రతి వివరాలను దేవుడు పట్టించుకుంటాడానే విశ్వాసం యొక్క ఫలితం. పోరాటాలు, కష్టపరిస్థితులు వస్తాయి, కాని చింతించము, కలవరపడము. నిరంతరం తీగలలోకి చెట్టులోనుండి కణరసం ప్రవహించటం ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడే అవసరం చూపిస్తుంది.

ఈ రెండు విషయాల కొరకు ప్రభువుని వెదకండి:

1. మిమ్మును నీతిమంతులుగా చేసి, మీ జీవితంలో ఒక్కసారిగా కూడా పాపం చేయనట్లుగా దేవుడు మిమ్మును చూచునట్లు చేయుట ఎంత శక్తివంతమైనదో వాక్యపు వెలుగులో చూపించమని దేవుని వెదకండి.

2. మనుష్యుల అభిప్రాయాలనుండి పూర్తిగా విడుదల పొందుటకు దేవుని వెదకండి.

మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే విషయంలో మనం ఎంత బానిసలుగా ఉన్నామో గ్రహించలేము. ఈ రెండు విషయాల మీద మీరు శ్రద్ధ వహించినట్లయితే ప్రభువు చేతులలో మంచి పాత్రలుగా ఉండెదరు. మన గత ఓటములను జ్ఞాపకం చేసుకుంటూ మనం దీనులుగా ఉన్నామని భావించేలా సాతాను తరచుగా ప్రయత్నిస్తాడు. మనం ఇతరుల పట్ల కఠినంగా ఉండేటట్లు శోధించబడినప్పుడు మన గత ఓటములను జ్ఞాపకం చేసుకోవాలి (2పేతురు 1:9) - వేరే సమయాలలో కాదు.

ఈ రెండు విషయాలు స్పష్టముగా తెలుసుకొంటే మీ జీవితంలో మీరు ఒక రాకెట్ వలె పైకి ఎగురుదురు. ఈ విషయాలను హేతుబద్ధంగా లేదా జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. కేవలం దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించండి.

మనను మనం నిందించుకోవటం, నిరాశ ఎప్పుడూ సాతాను నుండి వస్తాయి. మీరు ఎప్పుడైనా గతంలో జీవించవద్దు. మీ గత ఓటముల గూర్చి లేక మీరు గతంలో పొందిన జయాల గుర్చిగాని ఆలోచించకండి. మీరు పడిపోయినప్పుడు వెంటనే లేచి పరుగెత్తండి. ఎప్పుడైననూ విడిచిపెట్టవద్దు.