WFTW Body: 

"ఆయన నిమిత్తము సమస్తమును కలిగియున్నవి" (రోమా 11:36). దేవుడు అల్ఫయును, ఒమేగయును, ప్రారంభమును మరియు అంతమును, మొదటి వాడును మరియు ఆఖరివాడునైయున్నాడు. కనుక, శాశ్వత స్వభావము కలిగిన సమస్తమును ఆయనలో ఉద్భవించుట చేత, వాటియొక్క లక్ష్యప్రాప్తి కూడా ఆయనలోనే చూచుకొనుచుండెను. సమస్తము దేవునికి మహిమ తెచ్చుటకొరకు ఆయనచేత సృష్టింపబడెను. ఇది దేవుడు మననుండి స్వార్థముతో మహిమను అపేక్షిస్తున్నారని కాదు. ఆయన తనలో పూర్తిగా అన్నియు కలిగిన వాడు మరియు ఆయనకు కలిగిన వాటికి కలుపుట కొరకు మనము దేనినీ ఇచ్చుకొనలేము. ఆయనయొక్క మహిమను వెదకమని ఆయన మనలను పిలుచుట, మనకు గొప్ప మేలు జరుగుట కొరకే, అలా కానట్లయితే మనము మన కొరకు మాత్రమే ఆలోచించుకొనుచూ దుర్భరమైన జీవితము గడుపుదుము.

ఆయనలో మనము కేంద్రీకృతమై ఉండటం సృష్టిలో దేవుడు ఏర్పరచిన నియమము. ఆ నియమమును మీరగలిగినది వారి కొరకు వారే ఆలోచించగలిగే స్వేచ్ఛ ఉన్న ప్రాణులు మాత్రమే. సృష్టిలో స్పందన లేని జడ పదార్థములు సృష్టికర్తకు సంతోషముగా విధేయత చూపిస్తూ ఆయనను మహిమపర్చును. కాని ఆదాము ఈ నియమమునకు అవిధేయత చూపినందున మానవజాతికి వచ్చిన దుర్భరత్వములో ఆ పర్యవసానము మనము చూచుచున్నాము.

ప్రభువు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో, అన్నిటికంటే మొదటి అభ్యర్థన "నీ నామము పరిశుద్ధపర్చబడును గాక" అనునది. యేసు ప్రభువు హృదయములో ప్రప్రధమముగా ఉండిన ఆశ అది. "తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక" అని ప్రార్థించి, తండ్రికి మహిమ కలుగు సిలువ మార్గమును ఎంచుకొనెను (యోహాను 12:27, 28).

యేసు ప్రభువు జీవితమును నడిపించిన ఒక ప్రధానమైన కోర్కె తండ్రియొక్క మహిమ. ఆయన చేసిన ప్రతి పని తండ్రి మహిమకొరకే చేసారు. ఆయన జీవితములో ప్రవిత్రమైనది మరియు లౌకికమైనది అనే వేరు వేరు పద్ధతులు లేవు. ప్రతిది పవిత్రమైనదే. ఆయన బోధించుట మరియు రోగులను స్వస్థపరచుట ఎంతగా దేవుని మహిమ కొరకు చేసెనో ఆయన బల్లలు మరియు కుర్చీలు చేయుట కూడా అంతగా దేవుని మహిమ కొరకే చేసారు. ప్రతిరోజు కూడా ఆయనకు ఒకే విధమైన పవిత్రత కలిగియుండేది. మరియు దైనందిక జీవిత అవసరాలకు ఖర్చు పెట్టిన సొమ్ము దేవుని పనికి లేక బీదలకు ఇచ్చినప్పుడు ఎంత పరిశుద్ధముగా ఎంచుదుమో అంతే పరిశుద్ధముగా ఆయన ఎంచెను.

యేసుప్రభువు ఎప్పుడూ తండ్రి మహిమను వెదకుటచేత మరియు తండ్రికి ఆమోదమైన దాని కొరకు మాత్రమే పట్టించుకొనుట చేత ఆయన ఎల్లవేళలయందూ హృదయములో పరిపూర్ణమైన విశ్రాంతిలో జీవిస్తూయుండేవాడు. ఆయన ఘనతనుగాని, పొగడ్తలను గాని లెక్కచేయలేదు. "తనంతట తానే బోధించువాడు స్వంత మహిమను వెదుకును" (యోహాను 7:18) అని యేసు చెప్పెను.

ప్రకృతి సంబంధియైన క్రైస్తవుడు అతడెంతగా దేవుని మహిమను వెదకినట్లు కనబడినా, అతడి అంతరంగములో నిజానికి తన స్వంత ఘనత యెడల ఆసక్తి కలిగియుండును. ప్రభువైన యేసైతే ఎప్పుడూ తన కొరకు ఘనతను ఆశించలేదు. మానవునియొక్క జ్ఞానములో ప్రారంభింపబడి మానవపరమైన చాతుర్యము మరియు ప్రతిభ ద్వారా కొనసాగబడేది ఎప్పుడూ మనుష్యుని ఘనపర్చును. మానవునియొక్క ప్రకృతి సంబంధమైన జీవములో మొదలయ్యేది సృష్టింపబడిన దానినే మహిమపర్చును. కాని పరలోకమందు లేక భూమిపై శాశ్వతకాలము ఏ మానవునికి ఘనతను లేక మహిమను తీసుకొని వచ్చేది ఏదీ లేదు. దేవునినుండి, దేవునిద్వారా మరియు దేవుని కొరకైన ప్రతిదీ మాత్రమే కాల పరిస్థితులకు నిలిచి నిత్యత్వములో ప్రవేశించును.

దేవునికి సంబంధించినంత వరకు ఏ కార్యమునకైనా దాని వెనుకనున్న ఉద్దేశ్యము ఆ కార్యమునకు విలువను ప్రాధాన్యతను ఇచ్చును. మనము ఏంచేస్తున్నామనేది ముఖ్యమే, కాని ఎందుకు చేస్తున్నామనేది ఇంకా ముఖ్యమైనది.