WFTW Body: 

ఒకడు తనకు పరిశుద్ధత కలదని చెప్తూ దేవుని ప్రేమను చూపించలేకపోయినట్లయితే, నిజానికి అతడిలో ఉన్నది నిజమైన పరిశుద్ధత కాదు, పరిసయ్యతత్వముతో నిండిన నీతి. వేరొక ప్రక్క అందరి యెడల గొప్ప ప్రేమ ఉన్నదని చెప్తూ పవిత్రతతో మరియు నీతి కలిగి జీవించని వారు కూడా పైపైన కనబడే భావావేశాలను దైవికమైన ప్రేమగా పొరబడతారు.

పరిసయ్యుల నీతి ఎండిపోయిన పిండిలా ఉండేది. వారు ఎముకలతో నిండిన ఒక అస్థిపంజరము వలె కఠినముగా మరియు భయంకలిగించేవారిగా ఉండేవారు. వారిలో కొంత సత్యముండేది కాని, అదంతా వక్రీకరించబడిన విషయములతో, సరైన నిష్పత్తులను తప్పిపోయి ఉండేవి.

యేసులో సంపూర్ణమైన సత్యముండేది. ఆయన దేవుని ధర్మశాస్త్రములోని ప్రతి చిన్న విషయానికి పరిసయ్యుల కంటే ఎక్కువగా నిలబడెను. కాని ఆయన కేవలము ఎముకలుగా లేరు. ఎముకలు మానవునిలో ఎలా ఉండాలని దేవుడు ఉద్దేశించారో అలాగే మాంసముతో కప్పబడి యుండెను. ఆయన సత్యం ప్రేమతో కప్పబడియున్నది. ఆయన సత్యమును బోధించారు. అయితే ఆయన ప్రేమతో బోధించారు (ఎఫెసీ 4:15). ఆయన మాటలు అధికారముతో నిండియుండేవి, కానీ అవి కృపాసహితముగా కూడా నుండేవి (లూకా 4: 22,36).

ఇటువంటి స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు మనకు సంక్రమింపచేయాలని మరియు మన ద్వారా ప్రత్యక్ష పరచాలని ఉద్దేశిస్తున్నాడు.

దేవుడు ప్రేమయై ఉన్నాడు. దాని అర్థము కేవలం ఆయన ప్రేమతో కార్యములు చేయువాడు మాత్రమే కాదు. ఆయన తన ప్రతి ఉనికిలో ప్రేమయై ఉన్నాడు. యేసులో మనము చూచు దేవుని మహిమ దానిని ప్రత్యక్షపరుస్తుంది. యేసు కేవలము ప్రేమతో నిండిన కార్యములను చేయుట మాత్రమే కాదు, "ఆయన మేలు చేయుచు... సంచరించుచుండెను" (అపొ.కా. 10:38). ఆయన అణువణువు దేవుని ప్రేమతో నిండియుండుట చేత ఆవిధంగా చేయగలిగెను.

పరిశుద్ధత మరియు దీనత్వము వలె ప్రేమకు కూడా మన అంతరంగ పురుషునిలో దాని మూల స్థానమున్నది. ఆత్మతో నిండిన వ్యక్తి యొక్క కడుపులో నుండి జీవజలనదులు ప్రవహించును (యోహాను 7:38,39). మన ఆలోచనలు మరియు వైఖరులు (అవి ఎప్పుడూ బయటకు చెప్పకపోయినా) మన మాటలకు, పనులకు, వ్యక్తిత్వమునకు ఒక వాసన నిచ్చును. ఇతరులు ఆ వాసనను సుళువుగా గుర్తించగలరు. ఇతరుల యెడల మన యొక్క ఆలోచనలు మరియు వైఖరులు స్వార్థముతోను, విమర్శలతో నిండి ఉన్నట్లయితే ప్రేమతో కూడిన మన మాటలు, క్రియలు ఎందుకూ పనికిరావు. దేవుడు "మన అంతరంగమందు సత్యమును కోరుతున్నాడు" (కీర్తన 51:6).

యేసు మానవులందరి యెడల ఎంతో విలువను ఉంచారు. కాబట్టి ఆయన మనుష్యులందరిని ఎంతో గౌరవముగా చూచారు. దైవభక్తి గలవారిని, నాగరికత గలవారిని మరియు తెలివైన వారిని గౌరవించుట చాలా సుళువు. క్రీస్తులో మన తోటి విశ్వాసులను ప్రేమించినప్పుడు మనమెంతో ఎత్తుకు ఎదిగి పోయామని మనమనుకోవచ్చును. కాని యేసు మనుష్యులందరిని ప్రేమించుటలో దేవుని యొక్క మహిమ కనబడుతుంది. యేసు ఎప్పుడూ ఎవ్వరిని కూడా వారి బీదరికం, అమాయకత్వం, అందహీనత లేక నాగరికత లేకపోవుటను బట్టి తృణీకరించలేదు. ఈ లోకం మరియు అందులో ఉన్నదంతయు ఒక మానవుని ప్రాణమునకు సాటిరావని ఆయన ప్రత్యేకముగా చెప్పారు (మార్కు 8:36). ఆయన మానవుని అటువంటి విలువతో చూచారు. అందువలన మనుష్యులందరి యందు ఆనందించెను. ఆయన మనుష్యులు మోసపోవుటను మరియు సాతాను చేత బంధింపబడి ఉండుటను చూచి వారిని విడుదల చేయుటకు ఆశపడ్డారు.

ఆయన వస్తువుల కంటే జనులు ఎంతో ప్రాముఖ్యమైన వారని చూచారు. ఆయన మనుష్యులను ఎంతగా ప్రేమించారంటే ఆయన పూర్తిగా వారితో కలసిపోయి ఆయన మాకు కావాలి అని వారనుకునేటట్లు చూసేవారు. ఆయన వారి యొక్క భారములను పంచుకొనేవారు మరియు ఆయన యొద్ద పీడింపబడు వారికి అవసరమైన దయ గల మాటలు మరియు జీవిత పోరాటములలో ఓడిపోయిన వారికి కావలసిన ప్రోత్సాహకరమైన మాటలు ఉండినవి. ఆయన ఎప్పుడూ ఏ మానవుని పనికిరాని వానిగా చూడలేదు. వారు మొండిగా మొరటుగా నుండినా, వారు విడుదల అవసరమైన ప్రజలు.

మరొక ప్రక్క వస్తువులు ఆయనకు ఏ విలువలేనివిగా ఉండేవి. వస్తు సామాగ్రి ఇతరులకు లాభదాయకముగా ఉపయోగపడక పోయినట్లయితే వాటికి విలువ ఏమీ లేదు. యేసు వడ్రంగి దుకాణంలోనికి పొరుగువారి బిడ్డ ఒకరు వచ్చి అక్కడ ఒక ఖరీదైన వస్తువు దేనినైనా విరుగగొట్టినట్లయితే దాని విషయమై యేసు ఏమాత్రము చికాకు పడియుండేవారు కాదు, ఎందుకంటే విరిగిన ఆ వస్తువు కంటే ఆయనకు ఆ బిడ్డ ఎంతో విలువైనవాడు మరియు ముఖ్యమైనవాడు. ఆయన వస్తువులను కాక, జనులను ప్రేమించెను. వస్తువులు జనులకు సహాయపడుటకు ఉపయోగపడవలెను.

పరిశుద్ధాత్ముడు మన మనస్సులను నూతన పరచుట వలన మనము "అన్ని విషయములను ప్రభువు యొక్క ధృక్కోణం నుండి చూచు వారముగా" ఉందుము (కొలస్సీ 1:9). ఒక వ్యక్తిని ప్రేమించుట అనగా అతడిని దేవుడు చూచునట్లుగా కనికరముతో చూడవలెను.

దేవుడు బహు ఆనందముతో ఆయన ప్రజలయందు ఆనందించును (జెఫన్యా 3:17). యేసు దేవుని ఆత్మచేత నింపబడుట వలన ఆయన తండ్రియొక్క సంతోషమును ఆయన బిడ్డలకు పంచెను. ఆవిధముగా ఎవరి మనసులైతే ప్రజలను దేవుని ధృక్కోణం నుండి చూచునట్లు నూతన పర్చబడినవో వారు కూడా ఆవిధంగా ఉందురు. ఇతరుల యెడల యేసుకుండిన ఆలోచనలు ఎప్పుడూ ప్రేమతో కూడిన ఆలోచనలే తప్ప, వారి అనాగరికత లేక వికారతను బట్టి వచ్చే విమర్శతో కూడిన ఆలోచనలు కాదు. అందువలన జనులు ఆయన ఆత్మలో నుండిన చక్కని సువాసనను గ్రహించగలిగిరి మరియు "సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి" (మార్కు 12:37). మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు మన హృదయములలో ఇటువంటి ప్రేమను క్రుమ్మరించును (రోమా 5:5).