WFTW Body: 

రహస్య స్థలములలో దేవునియెదుట నివసించుచు మరియు ఆయన కొరకు దప్పికతో మొరపెట్టుచుండవలెను. దేవుని కొరకు ఈ దప్పిక కోల్పోయినయెడల క్రైస్తవత్వము శూన్యమై ఎండిపోవును. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనైనను దేవుని కొరకైన ఈ దప్పికను కాపాడుకొనవలెను. అది మీ విశ్వాసములో ప్రాముఖ్యమైయున్నది. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవుని కొరకు మన ప్రాణము ఆశపడవలెను.

మన కొరకైన దేవుని విద్యలో, లోకస్థులు నిరాశలు అని పిలిచే అనుభవములు ఎన్నో ఉన్నాయి. కాని ఇవి మన మేలు కొరకు దేవుడు అనుమతించే మంచి విషయములు. ఇటువంటి అనుభవముల ద్వారా మనం వెళ్ళనట్లయితే, ఇతరులను మనము ప్రోత్సహించలేము. ఓడిపోవుట జీవితపాటములో భాగమైయున్నది. లోకము 99.9శాతం ఓడిపోయిన వారితో నిండియున్నది గనుక వారికి సహాయపడవలెననిన మనం ఓడిపోవుట అవసరమై ఉన్నది. ఓడిపోవుట యొక్క రెండు ప్రయోజనాలు 1. మనలను దీనులుగా చేయుటకు (విరుగగొట్టబడుట). 2. ఇతరులయెడల మనము కనికరము కలిగియుండుటకు.

మీ ఆత్మీయ పోరాటము కూడా మీ విద్యలో భాగమే. తాత్కాలికమైన భూసంబంధమైన డిగ్రీల కొరకే మీరు ఎంతో కష్టపడిన యెడల పరలోక సంబంధమైన నిత్యమైన వాటికొరకు ఎంతో ఎక్కువ కష్టపడవలసియుంది. సమయం కొద్దిగానే ఉన్నది మరియు చెడ్డ దినములలో ఉన్నాము. భూసంబంధమైన వాటికొరకు మనము వెదకునప్పుడు కూడా పరలోక సంబంధమైన మనస్సు కలిగియుండవలెను. ఎల్లప్పుడు మిమ్మును మీరు తీర్పుతీర్చుకొనుచు మరియు పరిశుద్ధముగా అంతరంగములో ప్రభువుతో నడుస్తూ జీవించాలి.

పౌలు తిమోతితో ఇట్లన్నాడు, "నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము" (2తిమోతి 1:14). ఈ భూలోక జీవితములో దేవుడు మనకు అనుగ్రహించిన శరీరములను దేవుని కొరకు భద్రపరచుకొనవలెను. ఈ భూమి మీద మన జీవితయాత్ర ముగిసే వరకు మన శరీరములు పాపము నుండి కడగబడి మరియు పరిశుద్ధతలో కాపాడుకొనుటకు ప్రతి దినము దేవునికి సమర్పించుకొనవలెను.

ఒక దృష్టాంతముగా దీనిని చూస్తే, ఒక కంపెనీ ఒక ప్రదేశమునుండి మరొక ప్రదేశమునకు తీసుకొనివెళ్ళుటకు మనకు 50లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా ఉన్నది. కాని దానిలో మనము కొంత వృధాగా ఖర్చుచేసి మిగతావి దారిలో పోగొట్టుకొనియున్నాము. ఇప్పుడు ఓడిపోయిన మనము మారుమనస్సు పొంది ప్రభువు దగ్గరకు వచ్చియున్నాము. అప్పుడు ప్రభువు ఏమి చేయును? ఆయన మనలను తృణీకరించడు దానికి బదులుగా మనలను క్షమించి మరొక 50లక్షలు రూపాయలు మనకు అనుగ్రహించి, జీవితాంతము కాపాడవలెనని చెప్పియున్నాడు. మన దేవుడు ఎంత మంచివాడు.

క్రైస్తవులుగా మన సాక్ష్యం ప్రపంచ ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉండాలి. చెడుగా కనబడే దానిని కూడా మనము చేయకూడదు. మనకు ఏవిషయములోనైనా అనుమానమున్న యెడల మనము జాగ్రత్తపడి మరియు విచక్షణతో వ్యవహరించవలెను కాని తప్పు చేసే వైపు ఉండకూడదు.