WFTW Body: 

ఇక్కడ నా సామెతలలో ఒక దానిని చెప్పుచున్నాను: "ఒక జ్ఞానవంతుడు ఇతరుల పొరపాట్లనుండి నేర్చుకొనును. ఒక సామాన్యమైన వ్యక్తి తన పొరపాట్లనుండి నేర్చుకొనును. కాని ఒక బుద్ధిహీనుడు తన పొరపాట్లనుండి కూడా నేర్చుకొనడు".

నేను ఒక తండ్రిగా, ఇతర తండ్రుల పొరపాట్లనుండి నేర్చుకొనవలెనని కోరుచున్నాను. మీరు వెంబడించునట్లు మీ కొరకు నేను ఏవిధమైన మాదిరిని ఉంచుతున్నాను అని నన్ను నేను ప్రశ్నించుకొంటాను. అది ఈ విధముగా ఉండాలని నిరీక్షిస్తున్నాను: దేవుని రాజ్యమును మొదటిగా వెదకుచూ మరియు మన జీవితకాలమంతయు జ్ఞానము గల ప్రేమతో అందరిని భరించటం.

ఇబ్బంది పెట్టే వారినుండి దూరముగా ఉండుటయే జ్ఞానము - మరియు జ్ఞానము ప్రేమను నియంత్రించవలెను. మీయొక్క పెట్రోల్ ట్యాంక్ (మీ హృదయం) ప్రేమతో నింపబడియుండవలెను. కాని జ్ఞానము డ్రైవర్ సీటులో ఉండవలెను. లేనట్లయితే మానవ ప్రేమ అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేయును. మీయొక్క ప్రేమ 'వివేచించుటలో (జ్ఞానములో) అభివృద్ధి చెందవలెను' (ఫిలిప్పీ 1:11). మీరు ఎవరినైననూ ద్వేషించకూడదు లేక కఠినముగా ఉండకూడదు. మిమ్మును పలకరించని వారికి నమస్కారం చేయుడి. ఎల్లప్పుడూ ప్రతి వ్యక్తితో మర్యాదగా మాట్లాడవలెను (1పేతురు 2:17 చెప్పబడిన విధంగా). మీకు కీడు చేసిన వారికి మేలు చేయుడి.

పరిసయ్యులు యేసుప్రభును బయెల్జెబూలు అని పిలిచినప్పుడు, ఆయన వారిని క్షమించెను (మత్తయి 12:24,32). వారు ఆయనను కోర్టుకు తీసుకొని వెళ్ళి అన్యాయముగా నిందించినప్పుడు, ఆయన వారిని బెదిరింపక తననుతాను తన తండ్రికి అప్పగించుకొనియున్నాడు (1పేతురు 2:23). యేసు యొక్క అడుగు జాడలను మనం వెంబడించాలి.

కాబట్టి పరిసయ్యులు మిమ్మును దూషించినను (మిమ్మును కోర్టుకు తీసుకు వెళ్ళినను) యేసుప్రభువు చెప్పిన మాటలను గుర్తుంచుకోండి: "మీరు అందరిచేత ద్వేషించబడుదురు... మిమ్మును కోర్టుకు తీసుకువెళ్ళెదరు... కాని మీరు పాముల వలె వివేకులును పావురములవలె నిష్కపటులై ఉండుడి... మీరు ఏమి చెప్పవలెనో ఆ గడియలోనే ఆత్మ ద్వారా అనుగ్రహింపబడును(అక్కడ మౌనముగా ఉండవలసిన అవసరం లేదు)... హృదయ రహస్యములు అన్ని ఒకరోజు బయలుపడును గనుక ప్రజలకు భయపడవద్దు... కాని అంతమువరకు (ప్రేమలో అందరిని) సహించినవాడే రక్షింపబడును... మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అని అనుకొను గడియ వచ్చుచున్నది" (మత్తయి 10:16-30; 24:9-13; యోహాను 16:2).

కాబట్టి ఎల్లప్పుడు:

1. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదటగా వెదకండి.

2. ఎల్లప్పుడూ ఇతరుల యెడల జ్ఞానముగల ప్రేమలో అంతకంతకు వేరుపారుడి.

ప్రతీ క్రైస్తవ గుంపు కూడా వారి బైబిల్ పట్టుకొని "మేమే సరియైన వారము, దేవుడు మాతో ఉన్నాడు" అంటారు. మరి వీరిలో ఎవరు సరియైనవారు? నేను ప్రభువుయొద్దనుండి స్పష్టమైన జవాబు పొందితిని: "ఎల్లప్పుడూ ప్రేమతో సత్యము మాట్లాడు వారితోను (అది వారికి వ్యతిరేకముగా ఉన్నప్పటికి) ఇతరుల యెడల ఎల్లప్పుడూ జ్ఞానముతో కూడిన ప్రేమతో నిలిచియున్న వారితోను (అనగా ఇతరులకు కీడు చేయనివారితో మరియు చేయవలెనని ఎన్నటికి తలంచనివారితో)" దేవుడు ఉంటాడు.

ఎల్లప్పుడు మీ జీవితకాలమంతయు దేవుని రాజ్యమును మొదటిగా వెదకెదరు గాక. అనగా మీ చదువులలో లేదా పనిలో బాగా రాణించడం మరియు క్రైస్తవులు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, నిజాయితీగా మరియు ఇతరుల పట్ల నిస్వార్థ ప్రేమ కలిగియున్నారని చూపించడం.

ఏ విషయములో అయినను మిమ్ములను ఎవరైనా విమర్శించినప్పుడు ఏమి చేయాలో నేను సలహాను ఇస్తున్నాను. మిమ్ములను సమర్థించుకొనుచు ఏమియు మాట్లాడవద్దు. యెషయా 54:17 చెప్పిన ప్రకారం ప్రభువు మిమ్మును సమర్థించును: "నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్థిల్లదు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇదే యెహోవా వాక్కు". అనేకమందికి వివరణ ఇచ్చుటకు ప్రయత్నించుట అర్థరహితమై ఉన్నది. దేవుడు సర్వశక్తిమంతుడు మరియు ఆయన యొక్క సత్యము అగ్ని వంటిది గనుక మన వంటి అల్పులు సమర్థించవలసిన అవసరం లేదు.