WFTW Body: 

మనము దేవుని స్వభావములో పాలివారము కావచ్చుననునది క్రొత్త నిబంధనలోని సువార్త. ప్రేమయే దేవుని స్వభావము. తన యొక్క స్వంతమును కోరకపోవుటయే ప్రేమలోని ముఖ్యస్వభావము. ప్రభువైనయేసు తన స్వంతమును కోరలేదు గనుక మనలను రక్షించుట కొరకు ఆయన భూమిమీదకు దిగివచ్చాడు. ఒక చంటిబిడ్డయెడల తల్లికున్న ప్రేమతో మనయెడల ఆయనకున్న ప్రేమను ఆయన పోల్చుచున్నాడు (యెషయా 49:15). క్రొత్తగా జన్మించిన బిడ్డయెడల తల్లియొక్క ప్రేమ ఈ భూమిమీద ఉన్న ప్రేమలన్నింటికంటే గొప్పది ఎందుకనగా ఒక మంచితల్లి తన బిడ్డయొద్ద నుండి ప్రతిఫలముగా ఏమియు కోరుకొనక, నిస్వార్థముగా ఆ బిడ్డకొరకు సమస్తమును చేయును. దేవునిప్రేమ వివేకముగా ఉండును మరియు మనము ఇటువంటి స్వభావములో పాలివారము కావలయును. అప్పుడు ప్రభువైన యేసు చేసినట్లే మనము కూడా దేవుని ప్రజలకు పరిచర్య చేయగలము.

ప్రేమ అనే ఇంధనమే క్రైస్తవజీవితమును నడుపును. ఇంధనము లేనట్లయితే కారును త్రోయవలసియున్నది. అదే విధముగా ప్రభువుయెడల మనయొక్క మొదటిప్రేమ చల్లారినయెడల ఆయన కొరకు మనము చేసే పరిచర్య ఒక కారును త్రోసినట్లే భారముగా ఉండును. అప్పుడు ఇతరుల యొక్క బలహీనతలను మరియు బుద్ధిహీనతలను మనము భరించలేము. కాబట్టి మనము పెట్రోలు బంకుకు మరల మరల వెళ్లి నింపుకొనవలెను. "ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులైయుండుడి" (ఎఫెసీ 5:18).

కోపముమీదను మరియు మోహపుచూపుల మీదను జయము పొందుట ద్వారా దేవుని స్వభావములో పాలివారమగుటకు సిద్ధపడవచ్చును. మనము ఎంతో స్వార్థపరులము మరియు ఈ స్వార్థమైన స్వభావమును ప్రతిదినము చంపివేయాలి. మన స్వంతమునుగాని లేక ఘనతనుగాని లేక సుఖభోగములనుగాని మనము కోరుచున్నయెడల నిత్యమరణము పొందెదము. ఎంతవెల చెల్లించవలసి వచ్చినప్పటికిని మనము జీవితములలోని దేవుని చిత్తము మాత్రమే చేయవలెనని కోరుటయే జీవమార్గము. ప్రతిదినము మనలను మనము తీర్పుతీర్చుకొనుచు మరియు ఒకరోజులో అనేకసార్లు చేయుచు మరియు మన అంతరంగములో చూచుకొనక యేసునే చూచుచున్నయెడల, దేవుని మహిమనుగాక స్వంత మహిమను కోరే విషయములను కనుగొనగలము. ఆవిధముగా స్వజీవమునుంచి పవిత్రపరచబడెదము. పరిపూర్ణులమగుటకు మార్గము ఇదియే. చాలా కొద్దిమంది మాత్రమే నమ్మకముగా శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి పవిత్రపరచుకొనుచున్నారు. అందువలననే చాలా కొద్దిమందియే ఆత్మీయముగా ఎదుగుచున్నారు (2 కొరింథీ 7:1).

"బలాత్కారము చేయువారే" దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనెదరని ప్రభువైన యేసు చెప్పారు (మత్తయి 11:12). అనగా దేవుని ఆజ్ఞలకు మనము లోబడకుండా ఆటంకపరిచే ప్రతిదానిని ఎదురించవలెను. పెద్ద ఆజ్ఞలకు లోబడుట ద్వారా మనయొక్క విధేయతను ఋజువుపరచలేము కాని అల్పమైన ఆజ్ఞలకు లోబడుట ద్వారా దేవుని రాజ్యములో గొప్ప వారగుదురు అని ప్రభువైన యేసు చెప్పారు (మత్తయి 5:19). హత్య చేయకుండుటద్వారా గాని లేక స్కూలులో వ్యభిచారము చేయకుండుటద్వారా గాని ఒక చిన్నబిడ్డకు విధేయత పరీక్షింపబడదు. అతడు ఆడుకొనవలెనని కోరినప్పుడు, అతని తల్లి అతన్ని సహాయపడుటకు రమ్మని కోరినప్పుడు అతని విధేయత పరీక్షింపబడును. కాబట్టి దేవునియెడల మనకున్న సంబంధము బట్టికూడా ఉండును. మన నిజజీవితములోని చిన్న చిన్న విషయములలో కూడా నమ్మకముగా ఉండవలెను. లేనట్లయితే అవిధేయులమగుదుము.

"నీతిమంతులు సూర్యునివలె తేజరిల్లెదరని" మత్తయి 13:43లో ప్రభువైన యేసు చెప్పారు. అనేక లక్షలడిగ్రీలతో సూర్యుడు ఎల్లప్పుడు మండుచుండును. సూక్ష్మక్రిములు ఏవియు అక్కడ నివసింపలేవు అదేవిధముగా మనము కూడా ఎల్లప్పుడు మండుచు, ఎల్లప్పుడు ఆసక్తితోను మరియు పవిత్రతతోను ఉండుటకును ఇతరులను సేవించి మరియు ఆశీర్వదించుటకును, దీనులమై ఉండుటకును, కూటములలో సాక్ష్యము చెప్పుటకును మరియు సంఘములను నిర్మించుటకును ఎల్లప్పుడు మండుచుండవలెను. ఈ విషయములో యౌవనస్థులైన మీరు ముందుగా ఉండవలెను. తరువాత మూడు వచనములలో (మత్తయి 13:44-46) రెండు ఉపమానములద్వారా మనము ఎల్లప్పుడు ఏవిధముగా మండుచుండవలెనో ప్రభువు చెప్పాడు (దాచబడిన ధనము మరియు అమూల్యమైన ముత్యము). ఈ రెండు ఉపమానములలో తనకున్నదంతయు అమ్మెనను మాట చూచెదము. ఇదియే రహస్యము. మన స్వచిత్తమును, మన హక్కులను, మన ఘనతను మరియు సమస్తమును విడిచిపెట్టవలెను. అప్పుడు మాత్రమే ఎల్లప్పుడు సూర్యునివలె మండెదము.